వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోకోడ్రైవ్ ప్రయివేట్ కారు ప్యాకేజ్ పాలసీ, ఈ పథకం అందరికీ అవసరం!

Google Oneindia TeluguNews

DHFL జనరల్ ఇన్సూరెన్స్ వారి "కోకోడ్రైవ్ ప్రైవేట్ కార్ పాకేజ్ పాలసీ" - కారు యజమానులందరికీ కచ్చితంగా అవసరమయ్యే బీమా పథకం

బీమాఈ పదం వింటేనే ఒకపక్క భయం, మరోపక్క అయోమయం ఆవరిస్తాయి. కానీ చివరికి ప్రతి మనిషికి ఇది అవసరం అవుతుంది. సుప్రీం కోర్టు ప్రకారం కనీసం థర్డ్-పార్టీ మోటార్ బీమా పథకం తప్పనిసరి అయింది.అందువల్ల ఫోర్ వీలర్ ఉన్న వాళ్లంతా మీకు సరిపోయే అంశాల కలయికతో సమగ్రమైన బీమా పాలసీని ఎంచుకుని ముందుకు వెళ్లడమే ఉత్తమ మార్గం. ఈ ప్రమాద బీమా పథకాలు, కారు ప్రమాదం లేదా చోరీకి గురైన నేపథ్యంలో సంభవించే ఆర్థిక నష్టాల నుంచి మీకు కనీస రక్షణగా నిలుస్తాయి. ఒకవేళ మీ కారు వల్లే ప్రమాదం జరిగితే చట్టపరమైన అంశాల పరంగా కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.

 Coco Drive private car package policy dhfl general insurance a necessity for every car owner

కోకోడ్రైవ్- DHFL జనరల్ ఇన్సూరెన్స్ :

ఇటీవలే "కోకోడ్రైవ్ ప్రైవేట్ కార్ పాకేజ్ పాలసీ" అనే ఆన్ లైన్ విధానంలో సమగ్ర కార్ బీమా పథకాన్ని ప్రారంభించింది. DHFL జనరల్ ఇన్సూరెన్స్. ఈ ఫోర్-వీలర్ సమగ్ర బీమా పాలసీ, సగటు కారు బీమా పాలసీ వినియోగదారులకు నిజంగా వరమనే చెప్పాలి. కోకోడ్రైవ్, ప్రతి కారు వినియోగదారునికి సరిపోయేవిధంగా, రక్షణాత్మక బీమా పాలసీ కవర్లను అందించడంలో ఉత్తమంగా నిలుస్తుంది.

కోకోడ్రైవ్ ఫోర్-వీలర్ సమగ్ర బీమా పాలసీ గురించి చెప్పదగిన ప్రధాన విషయం ఒకటుంది.ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ రూ. 35 లక్షల వరకు ఇచ్చే ఒకే ఒక్క పాలసీగా ఈ కోకోడ్రైవ్ నిలుస్తోంది.

ఇక పాలసీ విభాగాల కందకు వస్తే, 'పాత కారుకు కొత్త కారు''టైర్ల మార్పిడి'నుంచి 'కీ &లాక్ మార్పిడి'అలాగే 'NCB సెక్యూర్'వరకు, అనేక అంశాలలో వినియోగదారులు వారి వ్యక్తిగత వాహన అవసరాలకు అనుబంధంగా ఉండేలా ఈ యాడ్-ఆన్లను ఎంచుకునే సౌలభ్యాన్ని ఈ కోకోడ్రైవ్ పాలసీ కల్పిస్తుంది. దీనిని "à la carte"మోటార్ విధానం అని వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా, 'EMI ప్రొటెక్టర్''అవుట్-స్టాండింగ్ లోన్ ప్రొటెక్టర్'వంటి విభాగాలను ఎన్నుకోవడం ద్వారా, ప్రమాదాల సమయాలలో సంబంధిత వాహనం, ఫైనాన్సింగ్, పాలసీ పరంగా వారికి అత్యుత్తమంగా సహాయపడుతుంది. భారతదేశం అంతటా ఈ పాలసీ కవరేజ్ అందిస్తోంది. అదనంగా కొన్ని ఇతర దేశాల్లోనూ ఈ పాలసీ విధానం అమల్లో ఉంది. కోకోడ్రైవ్కవరేజ్ భౌగోళిక విస్తరణలో భాగంగా నేపాల్,భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వంటి ఇతర పొరుగు దేశాలతో కూడుకుని ఉంటుంది.

కోకోడ్రైవ్ ప్రైవేట్ సంరక్షణా ప్యాకేజీ విధానంలోని కొన్ని ఇతర ముఖ్యాంశాలను ఇక్కడ ఇస్తున్నాం.

మార్కెట్లో ఉన్న ఇతర ఇన్సూరెన్స్ పాలసీలతో పోల్చినప్పుడు అత్యధికంగా 19 యాడ్-ఆన్లు ఈ పాలసీలో ఉన్నాయి.
మీరు ఇతర ఇన్సూరెన్స్ వెబ్సైట్లు లేదా ఇతర పాలసీ అడ్వర్టైజ్మెంట్లను పరిశీలించి చూసినట్లయితే, అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు గరిష్టంగా 5 నుంచి 6 యాడ్-ఆన్స్ మాత్రమే పొందుపరచినట్లుగా కనిపిస్తుంది. అయితే, అవి కూడా కస్టమర్ పాలసీ అవసరాల ప్రకారం, కారు రకం, కారు ఏజ్, ఉండే ప్రాంతంతో పాటు మొదలైన అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా కోకోడ్రైవ్ కూడా అత్యధిక సంఖ్యలో 19 వరకు అత్యత్తమ యాడ్ ఆన్లను కలిగి ఉంటుంది.

దేశంలోనే మొట్టమొదటి "à la carte"మోటార్ విధానం : వన్-స్టాప్ షాప్

దేశంలోనే మొట్టమొదటగా "à la carte"విధానం అనుసరిస్తున్న బీమా పథకంగా ఈ కోకోడ్రైవ్ పాలసీ ఉంటుంది. ఈ విధానంలో అనవసరమైన యాడ్-ఆన్లను పక్కన పెట్టి, వినియోగదారులకు అవసరమైన విభాగాలను మాత్రమే ఎంచుకునే వీలు ఉంటుంది. నిజానికి కొన్ని ప్రత్యేకించబడిన రెస్టారెంట్లలో డిషెస్ ఎంపికలో ఈ విధానాన్ని మనం చూస్తుంటాము. ఇతర ఇన్సూరెన్స్ పాలసీల వలె తమకు అవసరం లేని యాడ్-ఆన్లను బలవంతంగా రుద్దే ప్రయత్నం జరగదు. ఇది నిజంగా ఆహ్వానించదగిన అంశమే.

అత్యధిక మొత్తంలో వ్యక్తిగత ప్రమాద బీమాని అందించే ఒకే ఒక్క పాలసీగా కోకోడ్రైవ్ పాలసీ :

కోకోడ్రైవ్ పాలసీ అనేక ఇతర అత్యుత్తమ యాడ్-ఆన్లను కూడా అందిస్తుంది. యజమాని మాత్రమే కాకుండా, కారును వాడుకుంటున్న వారికి, ఉద్యోగరీత్యా పని చేసే డ్రైవర్లకు కూడా వ్యక్తిగత ప్రమాద బీమాను అందించే నాన్-స్టాండర్డ్(ప్రామాణికం కాని) యాడ్-ఆన్లను సైతం అందిస్తుంది. ఏ ఇతర పాలసీలలో లేనివిధంగా, అత్యంత మెరుగైన వ్యక్తిగత ప్రమాద బీమా కవరింగ్ ను 35లక్షల రూపాయల వరకు పెంచింది. ప్రస్తుత దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలు వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ కింద 15లక్షల వరకు అందిస్తుంది. కాని కోకోడ్రైవ్ పాలసీలో, వినియోగదారులు (యజమాని, డ్రైవర్) సైతం 35లక్షల రూపాయల ప్రమాద బీమాను, కారు నడిపే ఇతరులు 22లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ పొందవచ్చు.

బీమా కొనుగోలు కూడా సులభతరం:

చాట్ ఫీచర్ పొందుపరచబడినందువలన, వినియోగదారులు ఇప్పుడు నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పొందుపరచబడిన చాట్-బాట్ తో మాట్లాడి విషయాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేలా ఏర్పాటు చేయబడింది కూడా.

కోకోడ్రైవ్ పాలసీ నిజంగా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథస్సు) మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ జోడించబడి, వినియోగదారులకు సలహాలు, సూచనలను అందించేలా రూపుదిద్దబడి ఉంటుంది. క్రమంగా టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న ఈ మిలీనియం దశకంలో అందరికీ అందుబాటులో, సూచనలను ఇచ్చేలా టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖచ్చితంగా వినియోగదారుల మన్ననలను చూరగొంటుందని చెప్పవచ్చు. కోకోడ్రైవ్ పాలసీ ఆన్లైన్ కొనుగోలు ప్రక్రియలో, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ పద్దతుల ద్వారా, వినియోగదారులకు పూర్తిస్థాయిలో వారి వారి పరిసరాలకు తగినట్లుగా స్థానికీకరించబడి, అనుకూలీకరించబడిన సలహాలను అందిస్తూ, వారు తమ అవసరాలకు తగినట్లుగా అనుబంధాలను (యాడ్-ఆన్స్) ఎంచుకునేలా వారికి సహాయం చేస్తుంది.

ఉదాహరణకు ముంబై వాసులు ఇంజిన్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ కలిగి ఉంటారు. కానీ చండీగడ్ వాసులకు ఆ యాడ్-ఆన్ మారిపోయి ఉంటుంది. దీనికి కారణం, ముంబై వాసులకు నీటి సంబంధిత సమస్యల కారణంగా తరచుగా ఇంజిన్లు సమస్యల బారిన పడుతుంటాయి.

సులభరీతిలో డిజైన్ చేయబడిన ఈ ఆన్లైన్ పోర్టల్, కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు పరంగానే కాకుండా, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, రద్దు ప్రక్రియలను సైతం సులభతరం చేసింది.

అనేక బీమా పాలసీలు అనేకరకాల అర్ధరహిత నిబంధనలను, షరతులను పెట్టడం వల్ల వినియోగదారులు బీమా చేసే సమయంలో అనేక ప్రశ్నల నడుమ ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం పరిపాటిగా ఉంటుంది. కానీ కోకోడ్రైవ్ ప్రైవేట్ కార్ల పాలసీ, మార్కెట్లోని మిగిలిన ఇన్సూరెన్స్ పాలసీలతో పోల్చి చూసినప్పుడు పారదర్శకంగా , సులభరీతిన కనిపిస్తుంది. క్రమంగా వినియోగదారులు ఎంచుకోదగిన ఉత్తమ పాలసీగా ఈ "కోకోడ్రైవ్ ప్రైవేట్ కార్ పాకేజ్ పాలసీ" ఉంటుందని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X