వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: ‘సెజ్‌’లపై మ్యాట్ తొలగించండి.. జైట్లీకి వాణిజ్య శాఖ అప్పీల్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్)లపై విధించిన కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) తొలగించాలని కేంద్ర ఆర్థికశాఖను వాణిజ్యశాఖ కోరింది. వివిధ సామాజిక రంగాల వారికి ఉద్యోగాల కల్పన లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక ఆర్థిక జోన్లలో ఏర్పాటైన వివిధ పారిశ్రామిక యూనిట్లకు పన్ను రాయితీలు కల్పించాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారి ఒకరు కోరారు.
2016 - 17 సంవత్సరం సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో 2020 మార్చి లోపు ఉత్పత్తి ప్రారంభించే నూతన సెజ్ యూనిట్లకు ఐటీ ఆదాయం పన్ను మినహాయింపులు కొనసాగిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

 Commerce Ministry for Removal of Sunset Clause for SEZs

'మ్యాట్'తో ఇలా ఉపాధి కల్పనపై ప్రతికూల ప్రభావం

2020లోపు ఉత్పత్తి ప్రారంభించే 'సెజ్'లపై మ్యాట్ రద్దు
సెజ్‌లపై ప్రతికూల ప్రభావం చూపే కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) పూర్తిగా తొలగించాలని కోరామని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారి ఒకరు కోరారు. ముందస్తుగానే పన్ను రాయితీలు ఎత్తేయాలని నిర్ణయించడం వల్ల ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్)ల్లో పెట్టుబడులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ నిఫుణులు అంటున్నారు. ఈఓయూ, సెజ్‌లపై ఏర్పాటైన ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గుప్తా స్పందిస్తూ 'మ్యాట్' వల్ల సెజ్‌ల్లో పారిశ్రామిక్ యూనిట్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇది ఆమోద యోగ్యం కాదన్నారు.

 Commerce Ministry for Removal of Sunset Clause for SEZs

సెజ్ యూనిట్లపై ఇలా ఐదేళ్ల ఐటీ మినహాయింపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగిన ఎగుమతులు
సెజ్ యూనిట్లకు ఐదేళ్ల పాటు 100 శాతం ఐటీ మినహాయింపు ఉంటుంది. తదుపరి మరో ఐదేళ్లు 50 శాతం మినహాయింపు లభిస్తుంది. కానీ సెజ్‌లు 'మ్యాట్' అమలు వల్ల నష్ట పోయాయని రాహుల్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. 2017 - 18 ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య సెజ్‌ల్లో నుంచి ఎగుమతులు 13 శాతానికి పెరిగి రూ.2.67 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది సెప్టెంబర్ వరకు సెజ్‌లు రూ. 4.49 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం 423 సెజ్‌లు అనుమతించగా, 222 సెజ్‌లు కార్యకలాపాలు ప్రారంభించాయి. గత నెల వరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ నియమించిన బోర్డుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వివిధ పారిశ్రామిక యూనిట్లకు పలు రాయితీలు కల్పించేందుకు అదనపు అధికారాలు కట్టబెట్టడం గమనార్హం.

English summary
New Delhi: The commerce ministry has pitched for continuation of tax incentives being enjoyed by units in special economic zones (SEZs) with a view to boost shipments and job creation, a government official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X