వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉందిలే మనకు మంచి కాలం: దేశీయ గిరాకీ కలిసొస్తుంది.. జీడీపీపై ‘క్రిసిల్’!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 - 19)లో భారత్‌ 7.5 శాతం మేర వృద్ధి రేటును నమోదు చేస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేస్తోంది. ఇందుకు దేశీయ వినియోగం, విధానాల మద్దతు, అంతర్జాతీయ వృద్ధి కలిసి వస్తాయని ఒక నివేదికలో పేర్కొన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చన్న అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సర్వే-2018 అంచనా ప్రకారం 2018-19లో 7- 7.5 శాతం వృద్ధి కనబడవచ్చు.

గౌరవ ప్రద ప్రగతి సాధిస్తుందని భావిస్తున్నామన్న క్రిసిల్

గౌరవ ప్రద ప్రగతి సాధిస్తుందని భావిస్తున్నామన్న క్రిసిల్

2016 నవంబర్ ఎనిమిదో తేదీన పెద్ద నోట్ల రద్దు, 2017 జూలై నుంచి జీఎస్‌టీ అమలులోకి తేవడంతో రెండేళ్లుగా తక్కువ వృద్ధి రేటు నమోదైనా.. వచ్చే ఏడాది పుంజుకుని.. గౌరవప్రదమైన 7.5 శాతం వృద్ధి నమోదవవచ్చునని క్రిసిల్ పేర్కొన్నది. దేశీయ అంశాలే ఈ వృద్ధికి దోహదం చేయనున్నాయన్నది. అంతర్జాతీయ వృద్ధి కొంతలో కొంత మద్దతునివ్వనుంది. అంత క్రితం సంవత్సరాల్లో తక్కువ వృద్ధి నమోదు కావడమూ (లో బేస్‌ ఎఫెక్ట్‌) మరికొంత మద్దతునివ్వవచ్చు.

స్థూల బ్యాంకుల మొండి బకాయిలు 10.5 శాతం

స్థూల బ్యాంకుల మొండి బకాయిలు 10.5 శాతం

బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు, గ్రామీణ భారత్‌లో వినియోగం పెరుగుతుండడం, కొనసాగుతున్న సంస్కరణల అమలు, పెరుగుతున్న అంతర్జాతీయ వృద్ధి తదితర అంశాలు దేశ ఆర్థిక వృద్ధి ఎంత మేర పుంజుకోవచ్చన్న అంశాన్ని ప్రభావితం చేస్తుందని క్రిసిల్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండి బకాయిలు 10.5 శాతానికి చేరుతున్నాయి.

దేశీయంగా డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు

దేశీయంగా డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు

బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి చర్యలు ప్రారంభం తీసుకోకుండా.. ఆర్థిక రికవరీ కొనసాగకపోవచ్చు. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ ‌(ఎన్సీఎల్టీ) గడువు ఆధార పరిష్కారాలను మొదలుపెట్టిన నేపథ్యంలో కొంత ఆశలు చిగురిస్తున్నాయి. కేటాయింపులు భారీగా ఉండడంతో బ్యాంకింగ్‌ రంగ రికవరీకి సమయం పట్టేలా ఉంది. నిరంతరాయ సంస్కరణల అమలుతోపాటు గ్రామీణ, మౌలిక రంగాలపై నిధులు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల డిమాండ్ పెరిగి, ఉద్యోగత లభిస్తుందని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

కొత్తగా 1.1 కోట్లు కల్పించాలని చైనా లక్ష్యం

కొత్తగా 1.1 కోట్లు కల్పించాలని చైనా లక్ష్యం

చైనా గతేడాది మాదిరిగానే 2018లోనూ వృద్ధి రేటు లక్ష్యాన్ని 6.5 శాతంగానే నిర్ణయించింది. సోమవారం పార్లమెంటు వార్షిక సమావేశాల ప్రారంభం సందర్భంగా గడిచిన ఏడాదిలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రధాని లీ కెకియాంగ్‌ ప్రకటన చేశారు. ఈ సందర్భంగానే 6.5 శాతం వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని మూడు శాతం స్థాయిలోనే ఉంచాలని, కొత్తగా 1.1 కోట్ల ఉద్యోగాలను పట్టణ ప్రాంతాల్లో కల్పించాలనే లక్ష్యాలను వెల్లడించారు. నిరుద్యోగిత రేటు 5.5 శాతంగానే ఉంటుందని పేర్కొన్నారు.

English summary
Resolution of stressed assets in banking, rural rejuvenation, implementation of reforms and rising global growth are the key factors that will be critical in driving the country’s gross domestic product (GDP) growth to “a respectable 7.5 per cent” during the financial year 2018-19, rating agency CRISIL said in a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X