• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్విడ్ ప్రోకో జరిగిందా?!: కొచ్చర్ దంపతుల మెడకు బిగిస్తున్న ఉచ్చు.. దీపక్‌కు ఐటీ నోటీసులు

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు ఆదాయం పన్ను (ఐటీ) విభాగం నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్‌ రుణం కేసులో పన్ను ఎగవేతల కేసులో దర్యాప్తులో భాగంగా ఐటీ చట్టం సెక్షన్‌ 131 కింద ఈ నోటీసులు ఇచ్చింది. కొన్నేళ్లుగా సంస్థ వ్యక్తిగత ఆదాయాలు, ఆదాయం పన్ను రిటర్న్‌లు, ఆయన కంపెనీ న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌కు చెందిన వ్యాపార లావాదేవీల వివరాలను సమర్పించాలని ఆ నోటీసుల్లో తెలిపింది. కంపెనీ, దాని సంబంధీకుల ఆర్థిక వ్యవహారాలపై ఐటీ విభాగం దర్యాప్తు కూడా ప్రారంభించిందని అధికారులు తెలిపారు. కంపెనీతో సంబంధం ఉన్న మరికొందరికీ నోటీసులు పంపిందని, వాళ్లు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇదే కేసుపై ప్రాథమిక దర్యాప్తులో భాగంగా త్వరలోనే దీపక్‌ కొచ్చర్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తారని సీబీఐ అధికారులు తెలిపారు. 2012లో వీడియోకాన్‌ గ్రూపునకు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణ వ్యవహారంలో క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన లబ్ధి చేకూర్చారా అనే విషయాన్ని తేల్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కొందరి అధికారులను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ప్రాథమిక విచారణ కోసం వీడియోకాన్‌ గ్రూపు ప్రమోటర్‌ వేణు గోపాల్‌ ధూత్‌, దీపక్‌ కొచ్చర్‌, మరికొందరి పేర్లను చేర్చింది.

కార్యక్రమం షెడ్యూల్ నుంచి చందాకొచ్చర్ పేరు తొలగించిన ఫిక్కీ

కార్యక్రమం షెడ్యూల్ నుంచి చందాకొచ్చర్ పేరు తొలగించిన ఫిక్కీ

వీడియోకాన్‌ గ్రూపు రుణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్‌ను ఫిక్కీ మహిళల సమాఖ్య (ఎఫ్‌ఎల్‌ఓ) వార్షిక సమావేశానికి నిర్వాహకులు దూరం పెట్టారు. గురువారం జరిగే ఈ సమావేశంలో గౌరవ అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరవుతారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం రాష్ట్రపతిని చందాకొచ్చర్‌ సన్మానిస్తారని తొలుత నిర్ణయించారు. ఆ విధంగానే గత నెలలో ఆహ్వానితులకు సందేశాలు కూడా వెళ్లాయి. తాజాగా మంగళవారం కొచ్చర్‌ పేరు లేకుండా సవరించిన సందేశాలను పంపారు. ‘ఆమె (కొచ్చర్‌) మా గౌరవ అతిథిగా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఆమెను దూరం పెట్టడంతో హాజరయ్యే అవకాశం ఏమాత్రమూ లేదు' అని ఎఫ్‌ఎల్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు రష్మీ సరితా తెలిపారు. ఆమెను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో కారణాలను వెల్లడించలేదు. ‘ఆమెనే సన్మానం చేయాల్సి ఉంది. గౌరవ అతిథిగా కూడా అనుకున్నాం. కాని ఇప్పుడు దూరం పెట్టాం' అని ఆమె పేర్కొన్నారు. 2012లో వీడియోకాన్‌కు రుణ పరిమితిని పొడిగించిన వ్యవహారంలో చందా కొచ్చర్‌ పాత్రపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దీపక్ కొచ్చర్‌కు స్వయాన సోదరుడే రాజీవ్ కొచ్చర్

దీపక్ కొచ్చర్‌కు స్వయాన సోదరుడే రాజీవ్ కొచ్చర్

వీడియోకాన్‌ గ్రూపు రుణ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌పై దర్యాప్తు సంస్థలు ఓ వైపు ప్రాథమిక దర్యాప్తుకు సిద్ధపడుతుండగా.. ఆమె బంధువుకే సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆ బంధువు మరెవరో కాదు దీపక్‌ కొచ్చర్‌కు స్వయానా సోదరుడు. పేరు రాజీవ్‌ కొచ్చర్‌. ఈయన సింగపూర్‌ కేంద్రంగా అవిస్టా అడ్వయిజరీ గ్రూపు పేరుతో ఓ ఆర్థిక సేవల సంస్థను నిర్వహిస్తున్నారు. విదేశీ కరెన్సీ మార్పిడి బాండ్ల (ఎఫ్‌సీసీబీ) రూపేణా కంపెనీలకు రుణ పునరుద్ధరణ సేవలను ఇది అందిస్తోంది. గత ఆరేళ్లలో ఏడు కంపెనీలకు 170 కోట్ల డాలర్లకు పైగా రుణ పునరుద్ధరణలో ఇది సలహాదారు పాత్రను పోషించింది. అవిస్టా అడ్వయిజరీ తెలిపిన వివరాల ప్రకారం రుణ పునరుద్ధరణ పొందిన కంపెనీల్లో జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, జైప్రకాశ్‌ వపర్‌ వెంచర్స్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సుజ్లాన్‌, జేఎస్‌ఎల్‌, వీడియోకాన్‌ గ్రూపు ఉన్నాయి. ఎఫ్‌సీసీబీ రూపేణా జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌కు 11 కోట్ల డాలర్లు, జై ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌కు 20 కోట్ల డాలర్లు చొప్పున రుణ పునరుద్ధరించారు. జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌కు ఇచ్చిన రుణంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ లీడ్‌ మేనేజరుగా కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

అవిష్టా సేవల వినియోగం నిజమేనన్న జైప్రకాశ్ అసోసియేట్స్

అవిష్టా సేవల వినియోగం నిజమేనన్న జైప్రకాశ్ అసోసియేట్స్

రుణ పునరుద్ధరణ విషయంలో అవిస్టా అడ్వయిజరీ సేవలను ఉపయోగించుకున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖండించింది. అవిస్టాను తాము ఎప్పుడూ ఎలాంటి సేవల కోసం నియమించుకోలేదని స్పష్టం చేసింది. ‘మేం నియమించుకోనప్పడు ఆ సంస్థకు రుసుం కింద డబ్బులు చెల్లించాల్సిన అవసరమే ఉండదు. ఆయాచిత లబ్ధికి తావేలేదు. కేవలం దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారు'అని ఐసీఐసీఐ బ్యాంక్‌ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ సేవల నిమిత్తం అవిస్టాను నియమించుకున్నట్లు జేపీ గ్రూపు అధికార ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. అలాగే రుణ పునరుద్ధరణ సేవలకు మార్కెట్‌లో నడుస్తున్న రేటు ప్రకారం రుసుం చెల్లించామని తెలిపారు. అయితే బ్యాంకుల బృందం ద్వారా జేపీ గ్రూపు కంపెనీలు తీసుకున్న రుణాల విషయంలో అవిస్టా జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. అందువల్ల అవిస్టాను ఉపయోగించుకొని ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మిగిలిన సంస్థల నుంచి కూడా ఇంకా స్పందన రావాల్సి ఉంది.

కంపెనీలకు సలహాదారుగానే అవిష్టా ఉంటుందన్న రాజీవ్

కంపెనీలకు సలహాదారుగానే అవిష్టా ఉంటుందన్న రాజీవ్

కంపెనీల రుణ పునరుద్ధరణపై రాజీవ్‌ కొచ్చర్‌ స్పందిస్తూ ‘రుణ సలహాదారు నియామక ప్రక్రియ పోటీతో కూడుకున్నది. ఎఫ్‌సీసీబీ రూపేణా రుణాల పునర్‌వ్యవస్థీకరణకు జైప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌లు అవిస్టాను రుణ సలహాదారుగా నియమించుకున్నాయి. ఈ ప్రక్రియలో రుణ పునరుద్ధరణ చేసుకునేవి కంపెనీలు. రుణాలిచ్చేవి.సంబంధిత విదేశీ కరెన్సీ మార్పిడి బాండ్లు కలిగి ఉన్న సంస్థలు. వీళ్లు సాధారణంగా విదేశీ మదుపర్లే అయి ఉంటారు. వీళ్లతో సంప్రదింపులు జరిపి రుణ పునరుద్ధరణ నిమిత్తం కంపెనీలకు అవిస్టా సలహాలు ఇస్తుంది. ఈ వ్యవహారంలో దేశీయ రుణ సంస్థలు/ బ్యాంకుల ప్రమేయం ఉండదు. అలాంటప్పుడు ఆయాచిత లబ్ధికి ఆస్కారమే లేదు' అని స్పష్టం చేశారు. మరోవైపు న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌లో మెజార్జీ వాటాదారుగా ఉన్న మారిషస్‌ సంస్థ డీహెచ్‌ రెన్యూవబుల్స్‌ గురించి పూర్తి నిజానిజాలను బయటపెట్టాలని దీపక్‌ కొచ్చర్‌ను సామాజిక కార్యకర్త అరవింద్‌ గుప్తా డిమాండ్‌ చేశారు. గుప్తాకు ఐసీఐసీఐ బ్యాంక్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లో షేర్లున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NEW DELHI: The Income Tax Department has issued a notice to Deepak Kochhar, husband of ICICI bank MD and CEO Chanda Kochhar, in connection with its tax evasion probe in the Videocon bank loan case, officials said.They said the notice has been issued, under section 131 (power regarding discovery, production of evidence) of the I-T Act, to Deepak Kochhar in his capacity as the Managing Director (MD) of the firm NuPower Renewables.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more