వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బడ్జెట్ తర్వాత మొబైల్స్ ధరల పెరుగుదల, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

బడ్జెట్ తర్వాత మొబైల్స్ ధరల పెరుగుదల.. ఎందుకంటే?

న్యూఢిల్లీ: 2018 కేంద్ర బడ్జెట్ తర్వాత స్మార్ట్‌ఫోన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఇతర దేశాల నుండి పరికరాలను దిగుమతి చేసుకోవడం కంటే ఇండియాలోనే వస్తువుల తయారీని పెంచిపోషించేందుకు అనువుగా కొన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని విధించాలని కేంద్రం యోచిస్తోందని సమాచారం.దీంతో రానున్న రోజుల్లో అత్యాధునిక మొబైల్స్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశాన్ని మేకిన్ ఇండియాగా తీర్చి దిద్దనున్నట్టు ప్రధాన మంత్రి మోడీ ప్రకటించారు. ఈ మేరకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. అయితే ఇతర దేశాల నుండి వస్తువులు, పరికరాలను దిగుమతి చేసుకోవడం కంటే ఇండియాలోనే వస్తువుల తయారీని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు పెద్ద ఎత్తున ఇండియాలో పరిశ్రమలను స్థాపించే వారికి ప్రోత్సాహకాలను కూడ ప్రభుత్వం కల్పిస్తోంది.ఈ కారణంగా ఇతర దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకొంటే కస్టమ్స్ డ్యూటీని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలు

స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలు

కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వా స్మార్ట్‌పోన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ తర్వాత స్మార్ట్‌పోన్, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ వేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.

కస్టమ్స్ డ్యూటీ పెంపు కారణంగానే

కస్టమ్స్ డ్యూటీ పెంపు కారణంగానే

ప్రస్తుతం ఎలాంటి సుంకాలు లేని ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, కెమెరా మాడ్యూల్స్‌, డిస్‌ప్లేలపై రానున్న బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. జీఎస్‌టీ రాకతో ప్రస్తుతం కేవలం కస్టమ్స్‌ డ్యూటీ మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది.

ఇండియాలో ఉత్పత్తులను పెంచేందుకు

ఇండియాలో ఉత్పత్తులను పెంచేందుకు

ఇండియాలో వస్తువుల ఉత్పత్తిని పెంచేందుకుగాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంటుందని సమాచారం. కేవలం ఎలక్ర్టానిక్‌ పరికరాల అసెంబ్లింగ్‌ హబ్‌లా కాకుండా తయారీ హబ్‌గా మలచాలన్న ఉద్దేశంతో ఆయా పరికరాల దిగుమతిపై కస్టమ్స్‌ డ్యూటీ విధించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తుంది.

కస్టమ్ డ్యూటీ పెంపు ఇలా

కస్టమ్ డ్యూటీ పెంపు ఇలా

ఈ ఏడాది జులైలో ప్రభుత్వం మొబైల్‌ పోన్లపై 10 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని విధించింది. డిసెంబర్‌ 14న కస్టమ్స్‌ డ్యూటీని ఏకంగా 15 శాతానికి పెంచింది.మరోవైపు కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపుతో ఆయా దేశాలతో స్వేచ్ఛా వర్తక ఒప్పందాల నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యల హేతుబద్ధతను పన్ను నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

English summary
The budget is expected to give Make in India a boost through a customs duty rejig, but the move could make imported high-end mobile phones and electronic goods costlier .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X