వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్వోయూల కింద బ్యాంకులకు రూ.6,600 కోట్లు చెల్లించిన పీఎన్బీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ, ఆయన మామ మెహుల్‌ చోక్సీల తరఫున జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ల(ఎల్‌ఒయు)కు ఎనిమిది బ్యాంకులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.6,600 కోట్లు చెల్లించింది. పీఎన్బీ నుంచి రుణ బకాయిలు అందుకున్న సంస్థల్లో కెనరా బ్యాంక్‌ (రూ.356 కోట్లు), ఎస్బీఐ (రూ.985 కోట్లు), అలహాబాద్‌ బ్యాంక్‌ (రూ.1,389 కోట్లు) ఉన్నాయి. ఇంకా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.321 కోట్లు), యూకో బ్యాంక్‌ (రూ.818 కోట్లు), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.1,433 కోట్లు), యాక్సిస్‌ బ్యాంక్‌ (రూ.1,252 కోట్లు), ఇంటెసా సాన్‌ పావోలోకు (రూ.24 కోట్లు) పీఎన్బీ చెల్లించింది

గత నెల 31తో ముగిసిన ఎల్వోయూల గడువునీరవ్ మోదీ కుంభకోణంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తుఈ ఎల్వోయూల గడువు గత నెల 31తో ముగింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఈ బకాయిలను చెల్లించింది. పీఎన్బీకి రూ.13వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దేశీయ బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేసిన ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్ఐఒ) దర్యాప్తు చేస్తున్నాయి.

నీరవ్ మోదీ కుంభకోణంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు

నీరవ్ మోదీ కుంభకోణంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు

ఈ ఎల్వోయూల గడువు గత నెల 31తో ముగింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఈ బకాయిలను చెల్లించింది. పీఎన్బీకి రూ.13వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దేశీయ బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేసిన ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్ఐఒ) దర్యాప్తు చేస్తున్నాయి.

సీబీఐ అప్రమత్తం చేసినా అలర్ట్ కానీ భారతీయ బ్యాంకు విదేశీ శాఖలు

సీబీఐ అప్రమత్తం చేసినా అలర్ట్ కానీ భారతీయ బ్యాంకు విదేశీ శాఖలు

దర్యాప్తు సంస్థ అప్రమత్తం చేశాక కూడా డబ్బు చెల్లించిన భారతీయ బ్యాంక్సీబీఐ కేసు నమోదు చేసిన కొద్దిరోజుల తర్వాత కూడా బెల్జియంలోని భారత బ్యాంక్‌ శాఖ నుంచి నీరవ్‌ మోదీ భారీ మొత్తంలో సొమ్ము విత్‌డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. నీరవ్‌ మోదీ వ్యవహారం గురించి కేసు నమోదు చేసిన రోజునే (జనవరి 31) విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖలన్నింటినీ అప్రమత్తం చేశామని దర్యాప్తు ఏజెన్సీ అంటోంది. అయినా నీరవ్‌ మోదీ భారీగా సొమ్ము విత్‌డ్రా చేసుకోగలగడంతో అధికారులు విస్మయం చెందారు. ఆ బ్యాంక్‌ పేరును మాత్రం వారు వెల్లడించలేదు. ఈ కేసులో నీరవ్‌ మోదీకి చెందిన పలు ఖాతాలను స్తంభింపజేశారు. కానీ అప్పటికే మోదీ తన సొమ్మును అకౌంట్లలో నుంచి విత్‌డ్రా చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.

తక్కువ ఈఎంఐలకే అలహాబాద్ బ్యాంకు రుణాలు

తక్కువ ఈఎంఐలకే అలహాబాద్ బ్యాంకు రుణాలు

ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘అలహాబాద్‌ బ్యాంకు' రుణ వడ్డీరేట్లపై గుడ్‌న్యూస్‌ చెప్పింది. బేస్‌ రేటును, బెంచ్‌మార్కు ప్రైమ్‌ లెండింగ్‌ రేటు(బీపీఎల్‌ఆర్‌)ను 45 బేసిస్‌ పాయింట్లు చొప్పున తగ్గిస్తున్నట్టు పేర్కొంది. దీంతో తక్కువ ఈఎంఐలకు రుణాలకు లభించనున్నాయి. తగ్గింపు నిర్ణయంతో బేస్‌ రేటు 9.60 శాతం నుంచి 9.15 శాతానికి దిగొచ్చింది. బెంచ్‌మార్కు ప్రైమ్‌ లెండింగ్‌ రేటు కూడా 13.85 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. బేస్‌ రేటును, బీపీఎల్‌ఆర్‌ను 45 బేసిస్‌ పాయింట్లు చొప్పున తగ్గించాలని బ్యాంకు అసెట్‌ లైబిలిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ నిర్ణయించిందని బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సమీక్షించిన రేట్లు ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది.

English summary
Before the end of the current fiscal, the Punjab National Bank (PNB) has paid back Rs 6,600 crore to eight banks defrauded in the Rs 13,700 crore LoU fraud involving fugitive diamantaires Nirav Modi and Mehul Choksi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X