వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018 బడ్జెట్ వెరీ స్పెషల్.. జీఎస్టీ తర్వాత తొలి బడ్జెట్ మరి! ఇలా ప్రజారంజకం కూడా..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చేనెల 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ విభిన్నమైంది. దానికి ఒక కారణం ఉంది. 2017 జూలై ఒకటో తేదీ నుంచి నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం.. ఆర్థిక సంస్కరణల్లో కీలకమైన 'వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)'ను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకు వచ్చింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత తొలి జీఎస్టీ బడ్జెట్ ఇది. గత ఏడాది వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లతో పోలిస్తే చాలా విభిన్నమైందీ బడ్జెట్. అంతే కాదు ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఇది చివరిది. ఎందుకంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి మరి. 2017 - 18 బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్.. ప్రజారంజకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

జీఎస్టీతో భారీగా తగ్గిన పరోక్ష పన్ను వసూళ్లు
జీఎస్టీ అమలులోకి తేవడంతో పరోక్ష పన్నుల వసూళ్లు భారీగా పడిపోయాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి ఏడాదిలో చాలా పరిమితమైన వసూళ్లు జరగడంతో జీడీపీలో 3.5 శాతం లోటు ఏర్పడింది. తత్ఫలితంగా వివిధ రంగాలు, శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.

First Budget After GST: How this Union Budget will be Different from Past Ones?

తొలిదశలో కేటాయింపులు.. మలిదశలో పన్ను ప్రతిపాదనలు
కేంద్ర బడ్జెట్‌ను రెండు సెక్షన్లుగా కేటాయించాల్సి ఉంటుంది. తొలిదశలో వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు, వివిధ పథకాల ప్రారంభోత్సవాలు ఉంటాయి. మలిదశలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ప్రతిపాదనలు చర్చలోకి వస్తాయి.

జీఎస్టీ రాకతో పన్నులన్నీ విలీనం
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ వంటి పలు పరోక్ష పన్నులన్నీ 'జీఎస్టీ'లో విలీనం అయ్యాయి. జీఎస్టీ విధి విధానాలు ఎలా ఉండాలన్నదాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఖరారు చేస్తుంది. దీని ప్రకారం జీఎస్టీ తదుపరి బడ్జెట్‌లో కేటాయింపుల తీరు తెన్నులు ఎలా ఉంటాయన్నది నిర్దేశితమవుతాయి.

ప్రత్యక్ష పన్నుల విధానం వెల్లడించే చాన్స్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే 2018 - 19 బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు ప్రత్యక్ష పన్నుల విధానం (డీటీసీ)ని ప్రవేశపెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఆదాయం పన్ను వసూళ్ల విధానాన్ని గాడిలో పెట్టి.. అవకతవకలకు అరికట్టేందుకు చర్యలు ప్రతిపాదిస్తుందని భావిస్తున్నారు.

మధ్య తరగతిపై అరుణ్ జైట్లీ సరికొత్త కరుణకు చాన్స్
ఇక గతేడాది 2017 - 18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మధ్య తరగతి ఆదాయ గ్రూపు ప్రజలకు స్వల్ప ఊరటనిచ్చారు. ప్రత్యేకించి ఆదాయం పన్నులో 2.5 నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్న వారిపై విధిస్తున్న పన్ను శాతాన్ని 10 నుంచి ఐదు శాతానికి తగ్గించారు. ఈ ఏడాది దీన్ని మరికొంత తగ్గించడంతోపాటు నూతన పన్ను శ్లాబ్ లు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా, దేశంలో ఆర్థిక ప్రగతి సాధన దిశగా, ప్రజల కొనుగోలు శక్తి పెంపు దిశగా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.

English summary
New Delhi: Union Budget 2018 is going to be the first Post-GST era budget that Finance Minister Arun Jaitley is scheduled to share on 1st February 2018. Budget 2018 is going to be different from many previous budgets as a lot has changed in the past one year with the introduction of Goods and Services Tax since 1st July 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X