వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా వాల్‌మార్ట్..!: మిలియనీర్లు కానున్న ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు, ఎలాగంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇటీవల సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, 16 బిలియన్ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కూడా ఆమోదం కూడా తెలిపింది.

వరల్డ్ బిగ్ డీల్: వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ మధ్య డీల్ ఒకే, ధృవీకరించిన సాఫ్ట్‌‌బ్యాంక్ వరల్డ్ బిగ్ డీల్: వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ మధ్య డీల్ ఒకే, ధృవీకరించిన సాఫ్ట్‌‌బ్యాంక్

వాల్‌మార్ట్ చేతిలోకి ఫ్లిప్‌కార్ట్

వాల్‌మార్ట్ చేతిలోకి ఫ్లిప్‌కార్ట్

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుందని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన ఉద్యోగులకు పెద్ద తీపికబురే చెప్పింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మిలియనీర్లు కానున్నారని తెలిపింది.

మిలియనీర్లు కానున్నారు..

మిలియనీర్లు కానున్నారు..

ఎంప్లాయి స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ కింద 126-128డాలర్ల(ఒక్కో యూనిట్) విలువైన పేర్లను విక్రయించేందుకు అనుమతిస్తూ లేఖ రాసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారనున్నారు. ఈ మేరకు ఎకనామిక్స్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనం ప్రచురితం చేసింది. ఈ కథనం ప్రకారం.. వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లో 6,242,271 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందులో ఈఎస్ఓపీ కింద ఉన్న షేర్ల విలువ సుమారు 1.5బిలియన్ డాలర్లు. దీంతో ఒక్కో యూనిట్ 126-128 డాలర్ల చొప్పున వాల్‌మార్ట్ కొనుగోలు చేయనుంది.

800 మిలియన్ డాలర్లు..

800 మిలియన్ డాలర్లు..

ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈఎస్ఓపీ కింద ఉన్న షేర్లను నగదుగా మార్చుకునేందుకు ఉద్యోగులకు అవకాశం దక్కింది. మా ఉద్యోగుల శ్రమకు ఫలితంగా ఇలాంటివి ఇంకా ఎన్నో అవార్డులు, రివార్డులు అందిస్తాం. ప్రస్తుతం ఈ కొనుగోలు ద్వారా ఉద్యోగులు సుమారు 800 మిలియన్ డాలర్లు ఆర్జించనున్నారు' అని వెల్లడించారు.

100శాతం వాటా విక్రయించొచ్చు కానీ..

100శాతం వాటా విక్రయించొచ్చు కానీ..

ఈ రెండు ఆన్‌లైన్ దిగ్గజాల మధ్య లావాదేవీలు పూర్తయ్యే రెండేళ్లలోగా ఉద్యోగులు ఈఎస్ఓపీ కింద 100శాతం వాటాను విక్రయించవచ్చు. అయితే ఈ విక్రయాలు ఈ ఏడాదిలో 50శాతం, వచ్చే ఏడాదిలో 25శాతం, 2020లో మరో 25శాతం వాటాను నగదుగా మార్చుకునే అవకాశం కల్పించింది కంపెనీ యాజమాన్యం. కాగా, గత డిసెంబర్లోనే ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల నుంచి 100 మిలియన్ డాలర్ల విలువైన ఈఎస్ఓపీలను కొనుగోలు చేయడం గమనార్హం.

English summary
Flipkart employees are in for a treat. Earlier this year, Walmart acquired Indian e-commerce giant Flipkart in a buyout vauling at $16 billion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X