వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారిశ్రామిక ప్రగతి తగ్గుముఖం.. మరింత నియంత్రణలోకి ద్రవ్యోల్బణం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పారిశ్రామికోత్పత్తి సూచీ తగ్గుముఖం పట్టింది. గతేడాది డిసెంబర్‌లో ఐఐపీ సూచీ 7.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ రంగం, క్యాపిటల్‌ గూడ్స్‌, నాన్‌-డ్యూరబుల్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ అద్భుతమైన పనితీరు ఇందుకు కారణమని కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌వో) సోమవారం తెలిపింది. గత నవంబర్‌లో ఐఐపీ వృద్ధిని 8.4 శాతం నుంచి 8.8 శాతానికి సవరించింది. దీంతో డిసెంబర్‌ ఐఐపీ సూచీ వృద్ధిని పోల్చి చూస్తే తక్కువే. కాగా 2016 డిసెంబర్‌ నెలలో ఐఐపీ సూచీ 2.4 శాతంగా నమోదైంది. ఇక గత త్రైమాసికంలో తయారీ రంగం 8.4 శాతం వృద్ధిని కనబర్చింది.
వస్తువుల తయారీతో పాటు యంత్ర పరికరాలు, మన్నికేతర వినియోగదారు వస్తువుల బలమైన పనితీరు ఇందుకు దోహదం చేసింది. డిసెంబర్ 2016లో ఐఐపీ 2.4 శాతంగా మాత్రమే ఉంది. అదే నవంబర్ 2017 అయితే 8.4 శాతంగా ఉండగా.. తాజాగా దానిని 8.8 శాతానికి సవరించడం విశేషం. జనవరిలో నమోదైన ద్రవ్యోల్బణం మరింత అదుపులోకి వచ్చింది. దీంతో స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగైనట్లయింది.

 దన్నుగా కన్జూమర్ గూడ్స్ కూడా..

దన్నుగా కన్జూమర్ గూడ్స్ కూడా..

పారిశ్రామికోత్పత్తిలో 77.63శాతం వాటా కలిగిన తయారీ రంగం ఐఐపీకి కీలక మద్దతునిచ్చింది. 2016 డిసెంబర్‌లో ఈ రంగం కేవలం 0.6శాతం పెరిగింది. క్యాపిటల్‌ గూడ్స్‌ 6.2 శాతం నుంచి ఏకంగా 16.4 శాతానికి ఎగిసింది. కన్స్యూమర్‌ నాన్‌-డ్యూరబుల్స్‌ 0.2 శాతం నుంచి 16.5 శాతానికి పెరిగింది. ఇక ప్రాథమిక వస్తువులు 3.7 శాతం, ఇంటర్మీడియట్‌ వస్తువులు 6.2 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నిర్మాణ వస్తువులు 6.7శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే సమయంలో కన్య్సూమర్‌ డ్యూరబుల్స్‌ 0.9శాతంగా నమోదు అయ్యింది. కాగా 2017 డిసెంబర్‌లో 23 ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లకు 16 గ్రూప్‌లు సానుకూల వృద్ధిని కనబర్చాయి.

పండ్ల ధరలు తగ్గినందు వల్లే సీపీఐ తగ్గుముఖం

పండ్ల ధరలు తగ్గినందు వల్లే సీపీఐ తగ్గుముఖం

ఈ ఏడాది జనవరిలో వినియోగ దారుల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) కాసింత తగ్గింది. దీంతో ఈ నెలలో రిటైల్‌ సూచీ 5.07 శాతానికి క్షీణించింది. కూర గాయలు, పండ్లు, ఇంధన పరికరాల ధరలు తగ్గడమే ఇందుకు కారణ మని గణాంకాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్‌లో ఈ సూచీ 17 నెలల గరిష్టానికి చేరి 5.21శాతంగా నమోదైంది. క్రితం ఏడాది జనవరిలో రిటైల్‌ సూచీ 3.17శాతంగా ఉంది. సోమవారం ఈ మేరకు సీఏస్‌వో గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం పోలిస్తే ఆహర పదార్థాల ధరలు డిసెంబర్‌లో 4.96 శాతం నమోదు కాగా, జనవరిలో 4.7 శాతానికి దిగివచ్చాయి. పండ్ల ధరలు 6.63శాతం నుంచి 6.24శాతానికి స్వల్పంగా పెరిగాయి. ఇంధన, విద్యుత్‌ సెగ్మెంట్‌ 7.90శాతం నుంచి 7.73శాతానికి తగ్గాయి. ఇదిలావుంటే డిసెంబర్‌ నెల ఐఐపీ, జనవరి నెలకు సంబంధించిన సీపీఐ గణాంకాలు 2017-18 రెండో ముందస్తు జీడీపీ అంచనాలకు ఇవి చాలా కీలకం. ఈ నెల చివరిన జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి.

 యంత్ర పరికరాల్లో రెండంకెల వృద్ధితో పెట్టుబడి ఊపందుకోదు

యంత్ర పరికరాల్లో రెండంకెల వృద్ధితో పెట్టుబడి ఊపందుకోదు

2018 తొలి అర్థభాగంలో ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగానే ఉంచొచ్చని అనిపిస్తోందని రేటింగ్‌ ఏజెన్సీ ఇండ్‌-రా విశ్లేషిస్తోంది. వచ్చే కొద్ది నెలల్లో దేశీయ మార్కెట్‌ కీలకంగా మారనున్నది. వృద్ధి చెందుతున్న భారత ఆర్థికం కొత్త వ్యాపారాలకు చేదోడునందిస్తూనే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ అనిశ్చితులు, పెరుగుతున్న రక్షణాత్మక విధానాల వల్ల గిరాకీ విషయంలో ఇబ్బందులకు ఎదురుకావొచ్చునని అసోచామ్‌ అధ్యక్షుడు సందీప్‌ జజోదియా వ్యాఖ్యానించారు. యంత్రపరికరాల్లో రెండంకెల వృద్ధి నమోదైనంత మాత్రాన పెట్టుబడుల కార్యకలాపాలు పుంజుకున్నాయని చెప్పలేం అని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ వ్యాఖ్యానించారు.

English summary
After rising to a 17-month high in December, retail inflation moderated to a two-month low of 5.07 per cent in January aided by lower rate of food inflation. Food inflation, as measured by the Consumer Food Price Index, rose to 4.70 per cent in January from 4.96 per cent in the previous month. The inflation rate based on Consumer Price Index (Combined) eased in January from 5.21 per cent in December and is in line with the 5.1 per cent inflation rate estimated by the Reserve Bank of India (RBI) for the January-March quarter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X