వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి కేసులు ఉన్నందుకే..ఫోర్బ్స్ జాబితాలో చేరని సౌదీ రాయల్స్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

రియాద్‌: అవినీతి కేసుల్లో చిక్కుకున్నందు వల్లే 2018 ప్రపంచ కుబేరుల జాబితాలో సౌదీ అరేబియా రాజ కుటుంబ వారసుల పేర్లు చేర్చలేదని ప్రముఖ మ్యాగజైన్స్ ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో ఇందులో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తొలిసారిగా అగ్రస్థానాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది విడుదల చేసిన వార్షిక జాబితాలో సౌదీ అరేబియాకు చెందిన సంపన్నులను పరిగణనలోకి తీసుకోలేదు. గతేడాది సౌదీకి చెందిన చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. ఈ కారణం వల్లే వారిని జాబితాలోకి తీసుకోలేదని పత్రిక పేర్కొంది.

 ఆస్తుల జప్తు వివరాల వెల్లడించని సౌదీ అధికారులు

ఆస్తుల జప్తు వివరాల వెల్లడించని సౌదీ అధికారులు

అవినీతి ఆరోపణల కింద గతేడాది సౌదీలో చాలా మంది వ్యాపార వేత్తలను అక్కడి అధికారులు నిర్బంధం చేశారు. ఆ తర్వాత ఒప్పందాలు, చెల్లింపులు చేసుకుని వీరిలో చాలా మందిని విడుదల చేశారు. ఈ ఒప్పందాల్లో ఆయా వ్యాపారవేత్తలకు చెందిన 100 బిలియన్‌ డాలర్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సౌదీ అధికారులు చెప్పారు. అయితే ఎవరి నుంచి ఎంత స్వాధీనం చేసుకున్నారనే వివరాలను మాత్రం స్పష్టం చెప్పలేదు.

గతేడాదిలో భారీగా పెరిగిన సౌదీ రాజ కుటుంబీకుల ఆస్తులు

గతేడాదిలో భారీగా పెరిగిన సౌదీ రాజ కుటుంబీకుల ఆస్తులు

అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం వల్లే సౌదీ అరేబియా రాజ కుటుంబీకుల ఆస్తుల వివరాలపై పూర్తిగా స్పష్టత రాలేదని ఫోర్బ్స్ పేర్కొంది. అందుకే ఈ ఏడాది జాబితాలో సౌదీ వాసులను చేర్చలేదని ఫోర్బ్స్‌ తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాదితో పోలిస్తే సౌదీ బిలియనీర్ల ఆస్తులు చాలా పెరిగాయని ఫోర్బ్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో సంపద పెరిగిందని పేర్కొంది. గతేడాది ఫోర్బ్స్ జాబితాలో 10 మంది సౌదీ అరేబియా రాజ కుటుంబ వారసులు ఉన్నారు.

 సౌదీ రాజ కుటుంబీకుల ఆస్తి 42.1 బిలియన్ డాలర్లు అంచనా

సౌదీ రాజ కుటుంబీకుల ఆస్తి 42.1 బిలియన్ డాలర్లు అంచనా

సౌదీ అరేబియా యువ రాజుల్లో అల్వాలీద్ బిన్ తలాల్ ఆస్తి 18.7 బిలియన్ డాలర్లు, మహ్మద్ అల్ అమౌదీ 8.1 బిలియన్ డాలర్ల ఆస్తి సంపాదించారు. గతేడాది సౌదీ అరేబియా రాజ కుటుంబ సభ్యుల ఆస్తి 42.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఈసారి జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 2,208 మందిని చేర్చింది. వీరిలో భారత్‌కు చెందిన 119 మంది చోటు సంపాదించారు. ఇందులో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ 19వ స్థానంలో ఉన్నారు.

English summary
Forbes magazine said on Thursday it was excluding all Saudi Arabian tycoons from its annual list of the world’s richest people after dozens of top businessmen from the oil-rich kingdom were detained in a crackdown on corruption last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X