వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా పీఎంవో చేతుల్లోనే, నోట్ల రద్దు-జీఎస్టీలతో భారత్‌కు దెబ్బ: రఘురాం రాజన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత్‌లో అధికార కేంద్రీకరణ ఎక్కువగా ఉందని, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శలు గుప్పించారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

రాజకీయ నిర్ణయాల్లో అధికార కేంద్రీకరణ మరీ ఎక్కువగా అయిందని, ఇదే భారత్‌కు ప్రధాన సమస్య అన్నారు. ఇటీవల ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే అందుకు ఉదాహరణ అన్నారు.

Former RBI Governor Raghuram Rajan blames demonetisation for obstructing Indias economic growth

ఈ విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి కార్యాలయం అనుమతి ఇచ్చిందని చెప్పారు. అధికార కేంద్రీకరణ రాజకీయ నిర్ణయాల్లో మరీ ఎక్కువ అన్నారు. సర్దార్ విగ్రహావిష్కరణలో ఉన్న వేగం అన్నింటా ఉండాలన్నారు. ప్రధాని కార్యాలయమే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. భారత్‌లో ప్రధాని కార్యాలయం అనుమతి లభిస్తే తప్పు ముందడుగు పడట్లేదన్నారు.

రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడే ప్రధానమంత్రిపై ఆధారపడే అన్నీ జరుగుతున్నాయన్నారు. సర్దార్ విగ్రహం అంశాన్ని ప్రస్తావిస్తూ ఏదైనా జరగాలి అని భావిస్తే దానిని చేసి తీరుతుందని, దీనిని ప్రతీ అంశంలోనూ మనం చూడలేమా అన్నారు. అధికార కేంద్రీకరణ ఎక్కువగా ఉండటంతో పాటు అధికారుల లేదా ఉద్యోగుల చేతిలో అధికారం లేకపోవడం కూడా మరో ప్రధాన సమస్య అన్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు తాముగా ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నాయని చెప్పారు. అవినీతి కుంభకోణాలు బయటపడుతున్నప్పటి నుంచీ ఉద్యోస్వామ్యం వెనకడుగు వేసిందని విమర్శించారు. నోట్ల రద్దు భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అడ్డుకుంటోందన్నారు. నోట్ల రద్దుతో పాటు జీఎస్టీ ప్రభావం భారత్ పైన బాగా పడ్డాయన్నారు.

English summary
Demonetisation and the GST are the two major headwinds that held back India's economic growth last year, former RBI Governor Raghuram Rajan has said, asserting that the current seven per cent growth rate is not enough to meet the country's needs. Addressing an audience at the University of California in Berkley on Friday, Rajan said for four years -- 2012 to 2016 -- India was growing at a faster pace before it was hit by two major headwinds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X