పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో బంగారం ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ తమ సైనిక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడం అంతర్జాతీయ మార్కెట్లను శాంతపరిచింది. ఈ నిర్ణయం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు మళ్ళీ పునరుద్ధరణకు నోచుకుంటాయనే ఆశలను పెంచింది. ఫలితంగా బంగారం ధరలు పెరిగాయి. ఇది పెట్టుబడిదారులకు కొంత ఉపశమనాన్ని ఇస్తోంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,53,160ల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,40,400గా నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో నేడు పుంజుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బంగారం ధర 0.11 శాతం పెరిగి, 10 గ్రాములకు రూ. 1,54,956కు చేరింది. దీనికి భిన్నంగా వెండి ధరలో కొంత ప్రతికూలత కనిపించింది. ఇది 0.44 శాతం పడిపోయి కిలో రూ. 2,45,309 వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు స్పాట్ మార్కెట్‌లో వెండి ధర కిలోకు రూ. 2,60,000గా ఉంది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ 0.22 శాతం క్షీణించి ఔన్సు 4,3291.38 డాలర్లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప వ్యత్యాసాలతో అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,53,310గా ఉండగా, అహ్మదాబాద్‌లో రూ. 1,53,210గా ఉంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణెల్లో ధరలు రూ. 1,53,160 వద్ద సమానంగా ఉన్నాయి. 22 క్యారెట్ల విషయానికొస్తే, నగరాల వారీగా ఈ ధరలు రూ. 1,40,400 నుండి రూ. 1,40,550 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,491, 22 క్యారెట్లు - రూ. 14,070, 18 క్యారెట్లు - రూ. 11,795
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377

Click it and Unblock the Notifications