వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదో రోజూ తగ్గిన బంగారం ధరలు: డిమాండ్ పడిపోయిందా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బంగారం ధరలు వరుసగా ఐదో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయంగా ట్రెండ్‌ స్తబ్దుగా ఉండటం, స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ లేకపోవడంతో గురువారం 10 గ్రాముల బంగారం ధర బులియన్‌ మార్కెట్‌లో 140 రూపాయలు తగ్గి, రూ.31,210గా నమోదైంది.

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కేజీకి 470 తగ్గినట్టు తెలిసింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,030గా రికార్డైంది. పారిశ్రామిక యూనిట్ల నుంచి, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

 Gold Prices Fall For Five Straight Days

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ స్థిరంగా కొనసాగింది. ఒక్క ఔన్స్‌కు 1,243 డాలర్లు నమోదైంది. బుధవారం 1 శాతం కిందకి పడిపోయిన బంగారం, వారం కనిష్ట స్థాయిలను తాకింది.

ఆగస్టు నెల అమెరికా గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కూడా 0.1 శాతం నష్టంలో ఔన్స్‌కు 1,243.60 డాలర్లుగా నమోదైనట్టు తెలిసింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌, స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ పడిపోవడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

English summary
Gold shed Rs. 140 to Rs. 31,210 per ten gram on Thursday in line with a subdued trend overseas and muted demand from local jewellers, reported news agency Press Trust of India (PTI). Silver followed suit and slipped by Rs. 470 to Rs. 40,030 per kg owing to reduced offtake by industrial units and coin makers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X