వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతికూల సంకేతాలు: మరోసారి తగ్గిన బంగారం ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మరోసారి బంగారం ధరలు తగ్గాయి. బుధవారం నాటి బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 500 రూపాయల మేర పడిపోయింది. 460 రూపాయలు నష్టపోయి రూ.31,390గా నమోదైంది.

స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ పడిపోవడంతోపాటు గ్లోబల్‌గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది.

Gold prices fall slightly as outlook for faster US interest hikes weigh

కాగా, అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగా ఉందని.. ఫెడ్‌ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జీరోమ్‌ పావెల్‌ ప్రకటించడంతో, డాలర్‌కు సెంటిమెంట్‌ బలపడింది. దీంతో ఎంతో విలువైన ఈ మెటల్‌కి డిమాండ్‌ పడిపోయింది.

మంగళవారం అంతర్జాతీయంగా బంగారం ధరలు 1 శాతం క్షీణించాయి. ఈ ఏడాది మూడు నుంచి నాలుసార్లు రేట్లను పెంచబోతున్నట్టు కూడా జీరోమ్‌ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.460 చొప్పున పడిపోయి రూ.31,390గా రూ.31,240గా నమోదయ్యాయి.

English summary
Gold prices fell slightly on Wednesday, extending the decline from the previous session, as investors interpreted comments from Federal Reserve Chairman Jerome Powell to mean that the US may raise interest rates more frequently than anticipated this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X