వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగుమతులపై అవకతవకలు: రూ.34వేల కోట్లకు గండి.. జీఎస్టీ వ్యాపారుల గారడీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో పన్ను ఆదాయ రాబడి తగ్గుముఖం పట్టిందని ఆర్థిక శాఖ ఆందోళనకు గురవుతున్నది. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే వ్యాపారులు భారీ స్థాయిలో పన్ను ఎగవేతకు పాల్పడి అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.34వేల కోట్ల వరకు గండికొట్టినట్లు తెలుస్తోంది. జులై నుంచి డిసెంబర్ మధ్య దాఖలైన రిటర్న్‌ల ప్రాథమిక విశ్లేషణలో ఈ సంగతి తేలింది.
ప్రధానంగా దిగుమతి లావాదేవీ వ్యవహారాల్లో పన్ను ఎగవేతలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దిగుమతి చేసుకున్న వస్తువు అమ్మకం విలువను బిల్లులో తక్కువగా చూపి కొందరు ఆ మేరకే పన్ను చెల్లించారు. ఇలా ప్రతిసారీ అమ్మకం సమయంలో తక్కువ పన్ను చెల్లిస్తూ వచ్చారు.

 రీఫండ్ క్లెయిమ్ చేయని 30 వేల మంది వ్యాపారులు

రీఫండ్ క్లెయిమ్ చేయని 30 వేల మంది వ్యాపారులు

వ్యాపారులు వాస్తవంగా కట్టాల్సిన పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారు. ఆర్థికశాఖ అధికారుల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఐ - జీఎస్‌టీ చెల్లించేవాళ్లు 73 వేల మంది కాగా.. రూ.30,000 కోట్ల వరకు పన్ను చెల్లిస్తున్నారు. వారెవ్వరూ రీఫండ్‌ను క్లెయిమ్‌ చేసుకోలేదు. మరోవైపు 33,000 మంది వాస్తవ చెల్లింపు కంటే రూ.10 వేల కోట్లు ఎక్కువగా క్లెయిమ్‌ చేసుకున్నారు.

ఐ - జీఎస్టీ చెల్లింపులపై ఇన్ ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌కు దూరం

ఐ - జీఎస్టీ చెల్లింపులపై ఇన్ ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌కు దూరం

దిగుమతిదార్లు సాధారణంగా అనుసంధానిత వస్తు, సేవల పన్నును చెల్లిస్తుంటారు. వినియోగదారులు చెల్లించే జీఎస్టీకి లేదంటే క్లెయిమ్‌ కింద పొందిన రీఫండ్‌ మొత్తంతో ఈ పన్ను చెల్లింపును సర్దుబాటు చేయాలి. పెద్ద కంపెనీలతోపాటు దిగుమతిదార్లు ఐ జీఎస్‌టీని చెల్లిస్తున్నా, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు క్లెయిమ్‌ చేసుకోవడం లేదనే విషయం తేలింది. బిల్లు లేకుండానే దేశంలోకి వస్తువులను దిగుమతి చేసినట్లు అనుకోవాల్సిన పరిస్థితిని ఇది కల్పిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. విలాసవంత, హానికారక ఉత్పత్తుల దిగుమతులపై సెస్ విషయంలో ఇదే తరహా పరిస్థితి నెలకొంది. దిగుమతుల సమయంలో సెస్ చెల్లిస్తున్నారు కాని క్రెడిట్‌కు క్లెయిమ్‌ చేసుకోవడం లేదు. వినియోగదారు చెల్లించే జీఎస్‌టీతోనూ సర్దుబాటు చేసుకోవడం లేదు.

నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంపై ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, సిడ్బీ నివేదిక

నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంపై ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, సిడ్బీ నివేదిక

పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు వల్ల తలెత్తిన పరిస్థితుల నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) పూర్తిగా కోలుకోలేదని ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌, సిడ్బీ నివేదిక పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ చాలావరకు కోలుకున్నా, రూ.10 లక్షల లోపు రుణాలు తీసుకున్నఎంఎస్‌ఎంఈలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాయని తెలిపింది. రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు రుణాలు తీసుకున్న సంస్థలు, పెద్దనోట్ల రద్దుకు ముందు స్థాయికి చేరాయని వివరించింది. రూ.50 లక్షలకు మించి రుణాలు తీసుకున్న సంస్థలు అన్ని రంగాల్లో పూర్వస్థాయికి చేరాయని పేర్కొంది. సంఘటిత ఆర్థిక వ్యవస్థల నుంచి వివిధ సంస్థలు, వ్యక్తులకు అందిన మొత్తం రుణాలు రూ.100 లక్షల కోట్లు కాగా, ఇందులో ఎంఎస్‌ఎంఈలకు చేరింది రూ.11.75 లక్షల కోట్లు. ఐదు కోట్ల ఎంఎస్‌ఎంఈలలో 50 లక్షల సంస్థలకే సంఘటిత ఆర్థిక సంస్థల నుంచి రుణాలు అందుతున్నాయి.

 ఫిబ్రవరిలో 4.44 శాతానికి తగ్గుదల

ఫిబ్రవరిలో 4.44 శాతానికి తగ్గుదల

రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఆహార పదార్థాలు, చమురు ధరలు దిగి రావడంతో గత కొన్ని నెలలుగా ఎగువముఖం పట్టిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలతో 4.44 శాతంగా నమోదైంది. జనవరిలో నమోదైన 5.07 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గగా, అదే గతేడాది ఇదే నెలలో నమోదైన 3.65 శాతం పోలిస్తే మాత్రం భారీగా పెరిగినట్లు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక తెలిపింది. నవంబర్ 2017లో ఇది 4.88 శాతంగా ఉన్నది. గతనెలలో వినియోగదారుల ఆహార పదార్థాల ధరల సూచీ 4.7 శాతం నుంచి 3.26 శాతానికి తగ్గడం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

రవాణ - కమ్యూనికేషన్ల సేవల్లో పెరిగిన ద్రవ్యోల్బణం

రవాణ - కమ్యూనికేషన్ల సేవల్లో పెరిగిన ద్రవ్యోల్బణం

జనవరిలో 26.97 శాతంగా ఉన్న కూరగాయల ధరల సూచీ ఆ మరుసటి నెలకు 17.57 శాతానికి తగ్గగా, పండ్లు 4.80 శాతంగా నమోదయ్యాయి. వీటితోపాటు పాలు, పాల ఉత్పత్తుల సూచీ 4.21 శాతానికి పరిమితం కాగా, చిరుధాన్యాలు 2.10శాతం, మాంసం-చేపలు 3.31 శాతం, కోడిగుడ్ల ధరల సూచీ 8.51 శాతానికి తగ్గాయి. చమురు, లైట్ విభాగ ఉత్పత్తుల సూచీ 6.80 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. కానీ రవాణా, కమ్యూనికేషన్స్ సేవల సూచీ మాత్రం 1.97 శాతం నుంచి 2.39 శాతానికి పెరిగింది.

 7.5 శాతంగా నమోదైన ఐఐపీ

7.5 శాతంగా నమోదైన ఐఐపీ

పారిశ్రామిక రంగం పరుగుపెడుతోంది. ఈ ఏడాది తొలి నెలలో ఏకంగా 7.5 శాతంగా నమోదైంది. తయారీ రంగం నుంచి వచ్చిన సానుకూల అంశాలతోపాటు కన్జ్యూమర్, క్యాపిటల్ గూడ్స్ విభాగాల నుంచి ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదుతో 2017 జనవరిలో నమోదైన 3.5 శాతంతో పోలిస్తే రెండురెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గతేడాది చివరి నెలలో ఇది 7.1 శాతంగా ఉన్నది. పారిశ్రామిక వృద్ధిలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం 8.7 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం కలిసొచ్చింది. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి 2.5 శాతంగా ఉండేది. పెట్టుబడులకు కేంద్రబిందువైన క్యాపిటల్ గూడ్స్ విభాగం జెట్‌స్పీడ్ వేగంతో దూసుకుపోయింది.

 23 రంగాల్లో వృద్ధి.. ఏడు రంగాల్లో నిరాశాజనకం

23 రంగాల్లో వృద్ధి.. ఏడు రంగాల్లో నిరాశాజనకం

అంతక్రితం ఏడాది ఇదే నెలలో 0.6 శాతంగా ఉన్న క్యాపిటల్ గూడ్స్..ఈ ఏడాది జనవరికి ఇది 14.6 శాతానికి చేరుకున్నది. కన్జ్యూమర్ గూడ్స్ విభాగం 8 శాతం వృద్ధిని కనబరుచగా, నాన్-డ్యూరబుల్ గూడ్స్ రంగం 10.5 శాతంగా నమోదయ్యాయి. కానీ గనుల రంగం నిరాశపరిచింది. ఏడాది క్రితం 8.6 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న గనులు.. జనవరిలో 0.1 శాతానికి జారుకున్నాయి. ప్రాథమిక వస్తువులు 5.8 శాతం, మధ్యంతర వస్తువులు 4.9 శాతం, మౌలికం/నిర్మాణ రంగ పరికరాల్లో వృద్ధి 6.8 శాతంగా నమోదైందని నివేదిక తెలిపింది. 23 రంగాల్లో 16 వృద్ధిని నమోదు చేసుకోగా, ఏడు రంగాల్లో నిరాశాజనక పనితీరు కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య ఐఐపీ రేటు 4.1 శాతంగా నమోదైంది.

English summary
NEW DELHI: Tax authorities are grappling with a Rs 34,000-crore goods and services tax (GST) puzzle amid fresh fears in the government of businessmen evading taxes.Preliminary analysis of returns filed between July and December with the GST Network has indicated that the scale of under-reporting of tax liabilities could be as much as Rs 34,000 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X