వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: చమురు సంస్థలతో ప్రభుత్వ బంధానికి తెగదెంపులే!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అసలే ఇది ఎన్నికల ఏడాది. మరో నాలుగు నెలల్లో నాలుగు, ఈ ఏడాది చివరిలో మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు అటుపై లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణం వచ్చేసింది. కానీ ఎన్నికల వేళ ప్రజాకర్షక విధానాలు అమలు చేయాల్సిన తప్పనిసరి బాధ్యత ప్రభుత్వానిది. అందునా గతేడాది జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి బడ్జెట్ ఇది. 2017 - 18లో ద్రవ్యలోటు 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

జీఎస్టీ అమలుతో వివిధ వర్గాలు, రంగాల నుంచి వచ్చే రెవెన్యూ వసూళ్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో తగ్గే ఆదాయ లోటును పూడ్చేసేందుకు ప్రభుత్వానికి పెట్టుబడుల ఉపసంహరణ ఒక తారక మంత్రంగా, కల్పతరువుగా, కామధేనువుగా మారనున్నది. కాగా ఈ ఏడాది రూ.91,252.6 కోట్ల మేరకు ఆదాయం పొందాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రారంభంలోనే బిగ్ టికెట్ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Government Set To Hit Divestment Target Post ONGC-HPCL Deal

హెచ్పీసీఎల్‌లో రూ.36,915 కోట్ల ఉపసంహరణకు ఇలా ప్లాన్
హెచ్పీసీఎల్‌లో రూ.36,915 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించాలని సంకల్పించారు. తాజాగా సవరించిన అంచనాల ప్రకారం హెచ్పీసీఎల్‌లో ప్రభుత్వ 51 శాతం వాటా రూ.36,915 కోట్ల పెట్టుబడులను ఓఎన్జీసీ స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపింది. అప్పుల రూపేణా రూ.20 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.72,500 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించడం లక్ష్యంగా పెట్టుకుంటే రూ.54,337.60 కోట్ల మేరకు కేంద్రం ఆదాయం పొందింది.

గతేడాది హడ్కో తదితర సంస్థల్లో రూ.54,337 కోట్లు ఉపసంహరణ
సీపీఎస్ఈల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.46,500 కోట్లు, లిస్టెడ్ బీమా సంస్థల్లో వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.11 వేల కోట్ల ఆదాయం పొందింది. దీనివల్ల హడ్కో, ఈఐఎల్, ఎన్టీపీసీ, నాల్కో, ఆయిల్, జీఐఎసీ, న్యూ ఇండియా ఇన్సూరెస్స్ సంస్థల్లో ప్రభుత్వ వాటా తగ్గుముఖం పట్టింది. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో రూ.56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నిర్దేశించుకున్న ప్రభుత్వం రూ.46,247 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నది.

English summary
New Delhi: The government is all set to cross annual disinvestment target this fiscal for the first with ONGC buying the Centre's entire 51 per cent stake in HPCL for Rs. 36,915 crore. With its stake sale in HPCL, the government's disinvestment receipt will work out to be Rs. 91,252.6 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X