వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్కార్ మేల్కొనాలి: ఐడీబీఐని చక్కదిద్దకపోతే ప్రాబ్లమే.. ఆర్థికశాఖకు తేల్చి చెప్పిన ఆర్బీఐ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ 'ఐడీబీఐ బ్యాంకు'లో ఆర్థిక పరిస్థితిపై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలుస్తున్నది. ఐడీబీఐలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని తగిన చర్యలు చేపట్టాలని ఆర్బీఐ ఆ లేఖలో విజ్ఞప్తి చేసినట్లు ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు.
మొండిబకాయిలను గుర్తించడం సహా ఐడీబీఐ పనితీరులో అనేక లోపాలు ఉన్నట్లు ఆర్బీఐ ఈ లేఖలో స్పష్టం చేసిందని ఆ అధికారి తెలిపారు. ఐడీబీఐ బ్యాంకు పనితీరులో ఎన్నో లొసుగులున్నాయని, ప్రత్యేకించి మొండి బకాయిలను గుర్తించడంలో ఆ బ్యాంకు యంత్రాంగం చాలా లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నట్లు తాము జరిపిన తనిఖీలో వెల్లడైందని ఆ అధికారి తెలుపుతోంది.

ఆర్థికశాఖకు లేఖపై స్పందించని ఆర్బీఐ

ఆర్థికశాఖకు లేఖపై స్పందించని ఆర్బీఐ

దీన్ని బట్టి చూస్తుంటే ఐడీబీఐ బ్యాంకులో మొండి బకాయిలు ఆ బ్యాంకు చెప్పినదాని కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చునన్న అభిప్రాయం బలపడుతున్నది. అందుకే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నామని ఆర్బీఐ ఆ లేఖలో పేర్కొన్నట్లు ఆ అధికారి తెలిపారు. ఈ లేఖ గురించి అడిగిన ప్రశ్నలపై ఆర్బీఐ స్పందించలేదు. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) లేఖ గురించి తమ బ్యాంకుకు తెలియదని, ఈ లేఖలో ఆర్బీఐ వ్యక్తం చేసిన అభిప్రాయాలు 2017 మార్చి నాటివై ఉండవచ్చని ఐడీబీఐ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.

ఏడాదిన్నరలో ఐడీబీఐ కార్యకలాపాలు పుంజుకుంటాయని వెల్లడి

ఏడాదిన్నరలో ఐడీబీఐ కార్యకలాపాలు పుంజుకుంటాయని వెల్లడి

కొద్ది నెలలులగా ఐడీబీఐ బ్యాంకు పనితీరు ఎంతగానో మెరుగు పడిందని ఆ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. బ్యాంకుల్లో తలెత్తిన సమస్యల పరిష్కారంలో తమ బ్యాంకు చాలా చక్కగా వ్యవహరిస్తున్నది. మొండి బాకీల సమస్య పరిష్కారానికి తాము ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థలు కూడా ఎంతగానో బలోపేతమయ్యాయని ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.వచ్చే 18 నెలల్లో తమ బ్యాంకు మళ్లీ పుంజుకుంటుందని తాము గట్టిగా విశ్వసిస్తున్నాం అని ఐడీబీఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

2017 - 18 మూడో త్రైమాసికంలో రూ.1,542 కోట్ల నష్టం

2017 - 18 మూడో త్రైమాసికంలో రూ.1,542 కోట్ల నష్టం

ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుతం రిజర్వు బ్యాంకు పీసీఏ (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్) నిబంధనల పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2017-18) మూడో త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంకు రూ.1,542 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అప్పటికి తమ స్థూల మొండి బకాయిలు రూ.50,622 కోట్ల మేరకు (అడ్వాన్సుల్లో 27.72 శాతం) ఉండవచ్చని ఆ బ్యాంకు అంచనా వేసింది.

రూ.87 కోట్ల రుణం ఎగవేసిన వజ్రాల వ్యాపారి ఛోక్సీ

రూ.87 కోట్ల రుణం ఎగవేసిన వజ్రాల వ్యాపారి ఛోక్సీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరైన గీతాంజలి ఆభరణాల సంస్థ యజమాని మోహుల్‌ ఛోక్సీ మరో బ్యాంకుకు టోకరా వేసినట్టుగా తెలుస్తోంది. మంగుళూరుకు చెందిన కర్ణాటక బ్యాంక్‌ వద్ద నుంచి కూడా రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. బుధవారం ఆ బ్యాంక్‌ బీఎస్‌ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ సంగతి తెలిపింది. గీతాంజలి ఆభరణాల సంస్థ యజమాని మోహుల్‌ ఛోక్సీ రూ.86.47కోట్ల మేర మోసపూరితంగా రుణాలు తీసుకున్నట్లు సంబంధిత బ్యాంక్‌ అధికార వర్గాలు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కు ఫిర్యాదు చేశాయి. ఎటువంటి లెటర్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌లు (ఎల్‌ఓయూ) లేకుండా ఛోక్సీ కంపెనీ రుణాలు పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోహుల్‌ పీఎన్‌బీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

బ్యాంకుల కుంభకోణాలు, ఆర్థిక స్థితిగతులపై చర్చ

బ్యాంకుల కుంభకోణాలు, ఆర్థిక స్థితిగతులపై చర్చ

భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) అధినేత ఉర్జిత్‌ పటేల్‌ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. వచ్చే వారం ఆర్బీఐ నిర్వహించనున్న ద్వైమాసిక పరపతి విధాన సమీక్షతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతున్న వేళ కీలక వడ్డీరేట్లను తగ్గించి ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి సాధనకు ఊతమివ్వాలన్న డిమాండ్‌ అంతకంతకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఉర్జిత్‌ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉర్జిత్ పటేల్ తో భేటీ వివరాలపై స్పష్టతనివ్వని ఆర్థికశాఖ

ఉర్జిత్ పటేల్ తో భేటీ వివరాలపై స్పష్టతనివ్వని ఆర్థికశాఖ

దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో పెద్దపెద్ద కుంభకోణాలు, మోసాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మధ్య సమావేశంలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఉర్జిత్‌ భేటీ సందర్భంగా ఇంకా ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్న అంశంపై మాత్రం సర్కారు స్పష్టతనివ్వలేదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తొలిసారి పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని ఏప్రిల్‌ 4-5 తేదీల్లో నిర్వహించనున్నది.ఈ సమావేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

English summary
Government-owned IDBI Bank is in news again after a report said Reserve Bank of India (RBI) has informed finance ministry about the poor financial position of the bank and urged the government to take remedial action.The lender in which the government has 77.79% stake said one fourth of its loan book turned sour for quarter ended December 2017. The bank reported 24.72% of gross non-performing assets (NPAs) ratio in Q3 of current fiscal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X