వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేల్చి చెప్పిన రఘురాం రాజన్: 1.2 కోట్ల ఉద్యోగాలకు రెండంకెల ప్రగతి కావాల్సిందే

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రతి ఏటా ఉద్యోగాల మార్కెట్‌ గడప తొక్కుతున్న 1.2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలంటే 7.5 శాతం వృద్ధి సరిపోదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు సృష్టించగలగాలంటే రెండంకెల స్థాయిలో, కనీసం 10 శాతం అభివృద్ధితోనే అది సాధ్యమని తెలిపారు. వచ్చే 10-20 ఏళ్లపాటు భారత్‌ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నదని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
తగినన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడం, కంపెనీల మార్గాన్ని సుగమం చేయడం, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంతోపాటు మానవ వనరుల నాణ్యతను పెంచుకోగలిగితే భారత్‌ 10 శాతం వృద్ధిని సాధించగలదన్నారు. భారత్‌లో సంస్కరణలు జరుగుతున్నా ఆశించిన వేగం మాత్రం కొరవడిందన్నారు.

 లోక్‌సభ ఎన్నికల వరకు సంస్కరణలకు చెక్

లోక్‌సభ ఎన్నికల వరకు సంస్కరణలకు చెక్

వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాతే రెండంకెల అభివ్రుద్ధి సాధ్యమని రఘురాం రాజన్ తెలిపారు. ఎన్నికల వరకు మోదీ ప్రభుత్వం సంస్కరణలను అటకెక్కించవచ్చని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ సంస్కరణల్లో వేగం పెంచగలిగితే జిడిపి వృద్ధి గరిష్ఠ స్థాయికి దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుందన్నారు.

 దేశ ప్రగతిపై గోల్డ్‌మన్ శాచ్ నివేదిక ఇలా

దేశ ప్రగతిపై గోల్డ్‌మన్ శాచ్ నివేదిక ఇలా

వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటుని పీఎన్బీ కుంభకోణం దెబ్బతీస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‍మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘గోల్డ్‌మన్‌ శాచ్‌' తాజా నివేదికలో తెలిపింది. ఈ కుంభకోణంతో 2018-19 ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతం మించక పోవచ్చన్నది. ఇదే సంస్థ ఇంతకు ముందు విడుదల చేసిన ఒక నివేదికలో వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వరకు అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. పీఎన్బీ కుంభకోణంతో రుణాల మంజూరు మరింత కఠినమై రుణ పరపతి వృద్ధి రేటు తగ్గిపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. 2019-20లో మాత్రం భారత జీడీపీ వృద్ధి రేటు 8.3 శాతం వరకు ఉంటుందని తెలిపింది.

 భారత ఆర్థిక పరిస్థితి ఇంకా సమస్యాత్మకమే

భారత ఆర్థిక పరిస్థితి ఇంకా సమస్యాత్మకమే

ఆర్థిక పరిస్థితి కుదుట పడుతున్నా, వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా భారత ఆర్థిక వ్యవస్థకు బయటి ఒత్తిళ్లు తప్పేలా లేవని యూబీఎస్ భారత అనుబంధ సంస్థ ‘యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా' తెలిపింది. పెరుగుతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వల (ఫారెక్స్‌) సాయంతో ఈ ముప్పును కాచుకునే ఆర్థిక సత్తా కూడా భారత ఆర్థిక వ్యవస్థకు ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్‌ భారత అనుబంధ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ‘అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే భారత ఆర్థిక పరిస్థితి ఇంకా సమస్యాత్మకంగానే ఉంది. కొన్ని వస్తువుల ధరలు పెరగడంతో రిస్కు (నష్ట భయం) కూడా పెరుగుతోంది. ఈ రిస్కు మేనేజ్‌ చేయగలిగిందే. స్థూలంగా చూస్తే ఇవేవీ భారత ఆర్థిక వ్యవస్థను పెద్దగా ఇబ్బంది పెట్టలేవు' అని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్‌ ఆ నివేదికలో పేర్కొన్నారు.

 పాలక మండళ్ల నియామకంతోనే బీబీబీ పని సరి

పాలక మండళ్ల నియామకంతోనే బీబీబీ పని సరి

ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్బీ)లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో (బీబీబీ) కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బ్యాంకుల పనితీరు, నిర్వహణ మెరుగు పరిచేందుకు తాము చేసిన సిఫారసులు, సూచనలను ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని బీబీబీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ అన్నారు. ప్రస్తుతం తమ సంస్థ కేవలం పిఎస్బీల పూర్తి కాలపు డైరెక్టర్లు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్ల పోస్టులు భర్తీ చేసే సంస్థగానే మిగిలిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరుని దెబ్బతీయని రీతిలో పిఎస్బీలను ఎలా పటిష్ఠం చేయాలనే విషయంలో ప్రభుత్వం తమ సేవలు ఉపయోగించుకోవాలని బీబీబీ కోరింది.

ప్రభుత్వం, బీబీబీ మధ్య సమాచార మార్పిడి పెరుగాలన్న బీబీబీ

ప్రభుత్వం, బీబీబీ మధ్య సమాచార మార్పిడి పెరుగాలన్న బీబీబీ

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ)ల్లో జరిగే ఆర్థిక మోసాలను అరికట్టేందుకు తమకు మరిన్ని అధికారాలు కావాలని ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఇటీవల బహిరంగంగానే చెప్పారు. అది జరిగిన కొద్ది రోజులకే బీబీబీ చీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘బీబీబీ సాయంతో ప్రభుత్వం పీఎస్బీల నిర్వహణ మెరుగు పరచాలనుకుంటే, ప్రభుత్వం-బీబీబీ మధ్య సరైన సమాచార మార్పిడి ఉండాలి' అని వినోద్‌ రాయ్‌ అన్నారు.

English summary
India should concentrate on achieving 10% growth in the next two decades by building infrastructure, making it easier for companies to do business and improving the quality of healthcare and education, former Reserve Bank of India Governor Raghuram Rajan told CNBC in an interview aired on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X