గుడ్ న్యూస్: వాటర్ ప్యూరిఫయర్, ఎలుకల మందుపై GST తగ్గింపు?
దేశంలో కాలుష్య ఇబ్బందులు పెరుగుతున్నాయి.. ఈ మేరకు జీఎస్టీ (GST) తగ్గిస్తే సరిపోతుంది. ఇదేంటి కాలుష్యం పెరగడానికి జీఎస్టీ తగ్గడానికి సంబంధమేంటనే ఆలోచన మీకు రావచ్చు. అయితే ఇందులో చాలా అర్ధం ఉంది. మరి కొన్ని రోజుల్లో కేంద్రం 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే జీఎస్‌టీ మండలి వచ్చే 15 రోజుల్లోగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కోర్టు సూచనలు కొన్ని పరిగణలోకి తీసుకుని జీఎస్టీలలో చిన్న మార్పులు చేయాలని మండలి భావిస్తుంది. దీని ద్వారా మధ్య తరగతి వారికి కొన్ని రకాల వస్తువులు చౌకగా దొరుకుతాయి.
వాటర్ ప్యూరిఫయర్, ఎయిర్ ప్యూరిఫయర్‌లపై వస్తు సేవల పన్ను (GST)ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు సూచనల మేరకు 18% నుంచి 5 శాతానికి తగ్గించాలని చూస్తుంది. దేశంలో కాలుష్య ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులపై వస్తు సేవల పన్ను తగ్గిస్తే ప్రయోజన కరంగా ఉంటుందని కోర్టులు పలు సందర్బాల్లో అభిప్రాయ పడ్డాయి. కాబట్టి కోర్టులు చేసిన ప్రతిపాదనను పరిశీలించడానికి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. మరో 15 రోజుల్లో ఈ సమావేశం జరగనుంది. రాబోయే బడ్జేట్ సమావేశాలలోపు ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయ తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మరో 60 రోజుల్లో వాటర్ ప్యూరిఫయర్, ఎయిర్ ప్యూరిఫయర్‌లపై జీఎస్టీ తగ్గి.. ప్రతి మధ్య తరగతి వారు వీటిని కొనుగోలు చేసే అవకాశం బాగా ఉంటుంది.
ఇప్పటివరకు మూడు నెలలకొకసారి ఒకసారి జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. చివరిసారిగా సెప్టెంబరులో ఈ భేటీ జరిగింది. దేశంలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ప్యూరిఫయర్‌లపై పన్ను తగ్గించడానికి రాష్ట్రాల మధ్య కూడా ఏకాభిప్రాయం కుదరాలి. అప్పుడు మాత్రమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఈ ఉత్పత్తులను అత్యవసర వస్తువులుగా వర్గీకరించాలి. అనంతరం రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు జీఎస్‌టీని 18% నుంచి 5 శాతానికి తగ్గించే అవకాశం ఉంటుంది. మరో వైపు ఇళ్లలో ఉపయోగించే కొన్ని పురుగుమందులు, ర్యాట్ కిల్లర్ లపై కూడా జీఎస్‌టీని తగ్గించాలని ప్రతిపాదనలున్నాయి. వీటిపై ప్రస్తుతం 18% శాతం జీఎస్టీని 5% శ్లాబ్‌కు తీసుకురావచ్చని విశ్వసనయ సమాచారం.

దేశ రాజధాని డిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, కలకత్తా, వంటి నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. దీని ద్వారా ప్రజలు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా దిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హెచ్చరికలు జారీచేస్తుంది. మరో వైపు కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని చర్యలకు ఆదేశిస్తున్నాయి. అలాగే పర్యావరణవేత్తల నుంచి కూడా పలు డిమాండ్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం యోచిస్తుంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది. వివాదం తీవ్రమవుతున్న తరుణంలో తక్షణ చర్యలకు కేంద్రం ప్లాన్ చేస్తుంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications