వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మహారాజా’పై వేటు కాలేదు సమయం ఆసన్నం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'మహారాజా' ఎయిర్ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు. ఎందుకంటే దాని పునరుద్దరణకు ఇచ్చిన ఐదేళ్ల గడువు పూర్తి కాలేదు మరి. గత యూపీఏ ప్రభుత్వం దాని పునరుద్దరణకు ఐదేళ్ల గడువు పెట్టిన సంగతి పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని సభ్యులు లేవనెత్తారు. అందునా బుద్దిజం టూరిజం సర్క్యూట్ గురించి చర్చించేందుకు ఎజెండా పంపి.. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ముందుకుతేవడంతో విపక్షాల సభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఎయిర్ ఇండియాను నాలుగు సంస్థలుగా విడదీసి ఒక్కో సంస్థలో 51 శాతం వాటాలను ఉపసంహరించాలని ప్రతిపాదించినట్లు సమాచారం.కాగా, మంగళవారం సమావేశానికి హాజరైన సభ్యులు ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రతిపాదించిన ముసాయిదాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేస్తామని విపక్షాల సభ్యులు హెచ్చరించారని సమాచారం.

దీంతో కేంద్ర ట్రాన్స్ పోర్ట్, టూరిజం, కల్సర్ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం.. సదరు వివాదాస్పద ముసాయిదా నివేదికను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందని అధికార వర్గాల కథనం. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం జాతీయంగా, అంతర్జాతీయంగా అతి తక్కువ చార్జీలకే సేవలందిస్తున్న 'ఎయిర్ఇండియా', 'ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్'లను కలిపి ఒక సంస్థగా రూపొందించి ఈ ఏడాది చివరికల్లా విక్రయ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సోమవారం ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

 ఎఐ వాటాల విక్రయానికి బీజేపీ అనుకూలం

ఎఐ వాటాల విక్రయానికి బీజేపీ అనుకూలం

స్థాయీ సంఘం చైర్మన్‌గా నియమితులైన త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డెరిక్ ఓ బ్రెయిన్ సమావేశానికి గైర్హాజరు కావడంతో బీజేపీ సభ్యుడు రాకేశ్ సింగ్ సమావేవానికి అధ్యక్షత వహించారని సమాచారం. చైర్మన్ పరోక్షంలోనే స్థాయీ సంఘం సదరు నివేదికను ఉపసంహరించుకున్నదా? లేదా? అన్న సంగతి ఇంకా తెలియాల్సి ఉన్నది. 31 మంది సభ్యుల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో 16 మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయానికి అనుకూలంగా ఉన్నవారిలో అత్యధికులు బీజేపీ సభ్యులేనని సమాచారం. ముసాయిదా నివేదికను వ్యతిరేకిస్తున్న వారిలో కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కుమారి సెల్జా, అర్పితా ఘోష్ (టీఎంసీ), రీతాబ్రత బెనర్జీ (సీపీఎం బహిష్క్రుత నేత) సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ నిరంకుశంగా వ్యవహరించారని వారు ముగ్గురు ఆరోపించారు.

చైర్మన్ అనుమతితోనే ముసాయిదా ఉపసంహరణ సాధ్యమన్న కాంగ్రెస్

చైర్మన్ అనుమతితోనే ముసాయిదా ఉపసంహరణ సాధ్యమన్న కాంగ్రెస్

స్థాయీ సంఘం చైర్మన్ డెరిక్ ఓ బ్రెయిన్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తానని తేల్చి చెప్పారు. మెజారిటీ సభ్యులు ముసాయిదా నివేదికను ఉపసంహరిస్తున్నారని తెలిపారు. ‘ఈ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్, దాని అనుబంధ సంస్థల ధ్వంసం సాగుతున్నది. దానికి కౌన్సిల్ అవసరం' అని డెరిక్ ఓ బ్రెయిన్ వ్యాఖ్యానించారు. అయితే అధికారిక చైర్మన్ ఆమోదం లేకుండా బిల్లు ఉపసంహరణ నిర్ణయం చట్టబద్దంగా నిలువదని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పీటీఐకి చెప్పారు. 31 మంది సభ్యులు గల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో 15 మంది బీజేపీ, టీడీపీ, అప్నాదల్, ఆర్ఎల్ఎస్పీ నుంచి ఒక్కొక్క సభ్యుడు ఉన్నారు. మిగతా వారిలో కాంగ్రెస్, టీఎంసీ నుంచి ముగ్గురు చొప్పున, సమాజ్ వాదీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, బీజేడీ, సీపీఎం, అన్నాడీఎంకే తరఫున ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 పునరుద్దరణ నిధులు ఒకేసారి విడుదల చేస్తేనే ఫలితాలు

పునరుద్దరణ నిధులు ఒకేసారి విడుదల చేస్తేనే ఫలితాలు

ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుని లాభాలు ఆర్జించేందుకు ఎయిర్‌ ఇండియాకు కనీసం 2022 వరకు గడువు ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటికిగానీ ఎయిర్‌ ఇండియా కోసం యూపీ హయాంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఫలితాలు కనిపించవని అంచనా వేసింది. ఉద్దీపన ప్యాకేజీ నిధులు ఒక్కసారిగా కాక, కొద్ది కొద్దిగా విడుదల చేయడమూ ఎయిర్‌ ఇండియాకు సమస్యగా మారిందని తెలిపింది.
దీంతో కంపెనీ బయటి నుంచి అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఎయిర్‌ ఇండియా అప్పులు రద్దు చేయాలని కూడా పార్లమెంటరీ కమిటీ సూచించింది. ప్రకృతి విపత్తులు, దేశ, విదేశాల్లో సంక్షోభాలు తలెత్తినపుడు ఎయిర్‌ ఇండియా పోషించిన సామాజిక బాధ్యతనూ గుర్తించాలని కోరింది. ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరిస్తే ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన చార్జీల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది.

నీతి ఆయోగ్ మాదిరిగా వాణిజ్యపరంగా ఏఐ సేవలను పరిగణించలేం

నీతి ఆయోగ్ మాదిరిగా వాణిజ్యపరంగా ఏఐ సేవలను పరిగణించలేం

ఎయిర్‌ ఇండియా విక్రయ ప్రతిపాదనను ప్రభుత్వం పునఃసమీక్షించాలని జాతికి గర్వకారణమైన ఎయిర్‌ ఇండియాను కాపాడేందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని రవాణా, పర్యాటక పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ స్పష్టం చేసింది.ప్రకృతి వైపరీత్యాలు, భారత్‌లో..విదేశాల్లో సామాజిక, రాజకీయ అశాంతి తలెత్తిన సందర్భాల్లో ఎయిర్‌ ఇండియా తన వంతు సేవలు అందించిందని కొనియాడింది. ఎయిర్‌ ఇండియా పనితీరును నీతి ఆయోగ్‌ చేసిన మాదిరి కేవలం వాణిజ్య కోణంలోనే బేరీజు వేయడం సరికాదని అభిప్రాయపడింది. ఐదేళ్ల తర్వాత కూడా ప్రైవేటీకరణ తప్పదనుకుంటే ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఉద్యోగ భద్రత, పెన్షన్‌ వంటి అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన నాలుగు అనుబంధ సంస్థలు ఇప్పటికీ లాభాలు ఆర్జిస్తున్న విషయాన్ని కమిటీ గుర్తు చేసింది. కనీసం వీటినైనా ప్రైవేటీకరణలో కలపకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

ప్రధాని మోదీకి సీపీఐ నేత రాజా బహిరంగ లేఖ

ప్రధాని మోదీకి సీపీఐ నేత రాజా బహిరంగ లేఖ

తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్రమోదీని సీపీఐ జాతీయ నేత డీ రాజా హెచ్చరించారు. ఎయిర్ ఇండియా నిర్వహించిన ‘సామాజిక బాధ్యత'ను విస్మరించి వ్యవహరిస్తోందని మండి పడ్డారు. ఒకవేళ ఎయిర్ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరించాలని ప్రతిపాదిస్తే, దానిపై చర్చ చేపట్టాలని, దేశానికి దీర్ఘకాలికంగా ఎదురయ్యే సవాళ్లపై చర్చించాలని సూచిస్తూ ఈ మేరకు ప్రధాని మోదీకి రాజా బహిరంగ లేఖ రాశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు పూర్తిగా బూమరాంగ్ అవుతాయని హెచ్చరించారు. వాస్తవంగా ఎయిర్ ఇండియా విస్త్రుత స్థాయిలో విదేశీ మార్గాల్లో తన సేవలను విస్తరించిందని, దాని విస్తరణకు భారీగా అభినందనలు వచ్చాయని గుర్తు చేశారు. అయినా పెట్టుబడులు ఉపసంహరించాలని నిర్ణయించుకుంటే భారత ప్రతిష్టకు గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని హెచ్చరించారు. పౌర విమాన రంగంలో దాని సేవలను విస్మరించి ఎయిర్ ఇండియాను విక్రయించడానికి తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటే ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

English summary
NEW DELHI: Most members of a parliamentary panel sought the withdrawal of a draft report opposing the disinvestment of Air India at a stormy meeting today, prompting some opposition leaders to walk out in protest.Sources, who were present in the meeting, told PTI that the Parliamentary Standing Committee on Transport, Tourism and Culture today decided to withdraw the contentious draft report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X