వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఎలా మార్చాయి

Google Oneindia TeluguNews

కొన్నిసార్లు ఆర్థిక అవసరాలు,వెంటనే డబ్బు అవసరమయ్యే ఎమర్జెన్సీలు వస్తాయి. మీ బ్యాంకు అకౌంట్లో సరిపడినంత డబ్బు ఆ సమయంలో లేకపోతే, మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. ఈ స్థితిలోంచి మీరు ఎలా బయటపడగలరు? క్రెడిట్ కార్డు ద్వారా!

క్రెడిట్ కార్డు ఎలా పనిచేస్తుంది?
మీరు క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవి జరిపినప్పుడు, మీకు ఈ ఫెసిలిటీ ఇచ్చిన బ్యాంకు లేదా సంస్థ మీ తరఫున మర్చంట్ ఫీజు భరిస్తుంది. నిర్దేశించిన లిమిట్ లో మీరు ఎన్ని లావాదేవీలైనా జరుపుకోవచ్చు.

How Credit Cards Have Changed the Way We Spend

సరిగ్గా అవగాహనతో వాడినప్పుడు, క్రెడిట్ కార్డు అత్యవసర సమయాల్లో క్యాష్ అందించి మీ పనులు వెంటనే జరిగేలా ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డులు ఎలా వాడతామన్నదానిపై చాలా మార్పులు వచ్చి, అదొక ముఖ్యమైన ఆర్థిక విషయంగా మారిపోయింది. ఇంకా తెలుసుకోవడానికి చదవండి ;

1. పేమెంట్లు వేగంగా, సులభంగా జరుగుతాయి

క్రెడిట్ కార్డు వలన పేమెంట్లు వేగంగా జరుగుతాయి. ముఖ్యంగా మీ వద్ద తగినంత క్యాష్ లేనప్పుడు ఇది చాలా చేతికొస్తుంది. క్రెడిట్ కార్డుని పేమెంట్ కోసం వాడితే, ఖరీదైన కొనుగోలుకి పెద్దమొత్తాల్లో డబ్బు కట్టడమనేది ఇక సమస్య కానే కాదు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం కట్టాల్సిన డబ్బు నిర్దేశించిన సమయం లోపలే కట్టేయాలి.

2. మీ డబ్బు మరింత సురక్షితం

డెబిట్ కార్డు లేదా క్యాష్ లా కాక(ఒకసారి ఖర్చు చేస్తే ఇక తిరిగిరాదు),క్రెడిట్ కార్డును కొనుగోళ్ళకి వాడినప్పుడు, మీరు కొన్న ఉత్పత్తులలో ఏమైనా సమస్యలొచ్చినా, ఆ సంస్థ ఆర్థికంగా హఠాత్తుగా పడిపోయినా మీ డబ్బు వెంటనే చెల్లించబడకుండా ఆపవచ్చు. వారి నుంచి మీ డబ్బును రిటర్న్ ఇవ్వమని అప్పుడు కోరవచ్చు. అలాగే మీ కార్డు పోగొట్టుకున్నప్పుడు లేదా దాని ద్వారా ఏదన్నా చట్టవ్యతిరేక లావాదేవీలు జరిగినా వ్యాపారస్తులు సెక్యూరిటీ పద్ధతుల ద్వారా మీకు సాయపడగలరు. మీరు అలాంటి స్థితిలోపడితే, వెంటనే ఈ సమస్యను మీకు క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించినవారికి రిపోర్ట్ చేయండి.

3. మీ క్రెడిట్ స్కోరును మెరుగుపర్చుకోవచ్చు

సమయానికి పేమెంట్లు చేసేయడం వలన మీ క్రెడిట్ రేటింగ్ పై సానుకూల ప్రభావం పడుతుంది. అందుకని సమయానికి ముందే మీ బిల్లులు క్లియర్ చేసేసి, మీ అకౌంట్ ను మంచి స్థితిలో నిలుపుకుంటే మీ క్రెడిట్ ప్రొఫైల్ కూడా మెరుగయ్యి,భవిష్యత్తులో పెద్ద లోన్లకి సులభంగా అప్రూవల్ దొరుకుతుంది.

4. సంపాదించండి,ఖర్చుపెట్టండి, ఒకే సమయంలో

క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్ళు చేస్తే మీకు రివార్డు పాయింట్లు వస్తాయి.వీటిని రిడీమ్ చేసుకున్నప్పుడు క్యాష్ బ్యాక్స్, ఎయిర్ మైల్స్ లేదా ఇతర రకాల లాయల్టీ పాయింట్లుగా మారి మీరు తర్వాత చేసే ప్రతి కొనుగోలుకి సాయపడతాయి. ఈ పాయింట్లను వారు నిర్ణయించిన రివార్డ్స్ రీడీమ్ మార్గంలో మీకు నచ్చినప్పుడు వాడుకోవచ్చు.

ఇటీవలి కాలంలోని క్రెడిట్ కార్డులు అంటే బజాజ్ ఫిన్సెరీ, ఆర్బిఎల్ బ్యాంక్ సూపర్ కార్డు లాంటివి మీరు పెద్దమొత్తాల్లో రివార్డు పాయింట్లను, ఇతర లాభాలను పొందేలా చేస్తాయి.

5. ఆసక్తికరమైన వడ్డీ సెలవులను పొందండి

మీరు నెలవారీ బిల్లులను క్రమం తప్పకుండా సమయానికి కట్టేస్తూ ఉంటే మీకు ఈ సౌకర్యాన్ని అందించిన సంస్థ వారు మీకు వడ్డీ లేని రోజులను కానుకగా అందిస్తారు. కొంత ప్రత్యేక సమయం వరకూ మీరు చేసే కొనుగోళ్ళపై ఏ వడ్డీ ఉండదు.

6. క్రెడిట్ కార్డులకి కరెన్సీ మార్పులు ఉండవు

విదేశ కరెన్సీకి మీ డబ్బు మార్చటానికి మీరు కన్వర్షన్ ఛార్జీలు కట్టాలి కానీ విదేశాల్లో మీరు క్రెడిట్ కార్డుతో సులభంగా షాపింగ్ చేసేయొచ్చు.కొన్ని సంస్థలు విదేశాలలో కొనుగోళ్ళకి వేసే అదనపు ఫీజులను మాఫీ కూడా చేస్తాయి.

7. ఊహించని ఖర్చులప్పుడు క్రెడిట్ కార్డు ఆసరా అవుతుంది

రాబోయే కాలంలో మీరు ఊహించని ఖర్చు హఠాత్తుగా వచ్చిపడినప్పుడు, మీ వద్ద తగినంత డబ్బు లేకపోయినప్పుడు ఆ ఖర్చును తట్టుకోగలిగే శక్తి క్రెడిట్ కార్డు ద్వారా వస్తుంది, ఇదే క్రెడిట్ కార్డు యొక్క పెద్ద లాభం.మొత్తంమీద, ప్రాథమిక నియమాలు, వాడుక సరిగ్గా తెలిసినప్పుడు క్రెడిట్ కార్డు చాలా ఉపయోగపడే మార్గం. దాంతో వాస్తవికంగా ఉండగలిగినంతవరకూ, మీరు మీకు సంబంధించి లాభాలు పెంచుకోవచ్చు.

క్రెడిట్ కార్డులు, ఇంటి రుణాలు, వ్యాపార రుణాలు,వ్యక్తిగత రుణాలకి సంబంధించి బజాజ్ ఫిన్సెరీ వారి ముందే ఆమోదించిన ఆఫర్లతో, రుణాలు పొందడం నల్లేరుపై నడకలా మారింది. మీరు చేయాల్సిందల్లా కొంచెం మీ గురించి ప్రాథమిక సమాచారమిచ్చి, మీకు సంబంధించి ఇంతకు ముందు ఆమోదించబడ్డ ఆఫర్ల గురించి తెలుసుకుని సరైన ఆప్షన్లను పొందండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X