వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొచ్చర్ ఎఫెక్ట్?: 45శాతం తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం, పెరిగిన మొండిబకాయిలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌(2017-18, క్యూ4)లో 45 శాతం తగ్గింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2016-17) క్యూ4లో రూ.2,083 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,142 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడించింది.

మొండి బకాయిలు 17% పెరగడంతో కేటాయింపులు 85% ఎగిశాయని దీంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.28,603 కోట్ల నుంచి రూ.33,760 కోట్లకు ఎగసింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.1.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని బ్యాంక్‌ తెలిపింది. దీనికి రికార్డ్‌ డేట్‌ను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

ICICI bank q4 profit plunges 45% to Rs 1,142cr, NPA surges

కాగా, బ్యాంక్‌ ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ చందా కొచ్చర్‌.. కొన్ని కంపెనీలకు రుణాలచ్చి ప్రతిగా ప్రతిఫలాలు పొందారన్న ఆరోపణలు బలంగా వస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అయితే, మేనేజ్‌మెంట్‌ మార్పు గురించి బ్యాంక్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి.

గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్లో బ్యాంక్‌ స్టాండలోన్‌ నికర లాభం రూ.2,025 కోట్ల నుంచి సగం తగ్గి రూ.1,020 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.16,586 కోట్ల నుంచి రూ.19,943 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.5,962 కోట్ల నుంచి రూ.6,022 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌) 3.14 శాతం నుంచి 3.24 శాతానికి పెరిగాయి.

వడ్డీయేతర ఆదాయం రూ.3,017 కోట్ల నుంచి 88 శాతం వృద్ధితో రూ.5,679 కోట్లకు పెరిగింది. గత క్యూ4లో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఐపీఓలో భాగంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో 20.78 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను రూ.3,480 కోట్లకు విక్రయించామని, దీంతో వడ్డీయేతర ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్‌ తెలిపింది. కాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 7% వాటాను రూ.2,099 కోట్లకు విక్రయించింది.

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 2.3 శాతం లాభంతో రూ.289 వద్ద ముగిసింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో లిస్టైన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 4 శాతం లాభంతో 8.83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

కాగా, ఆర్థిక ఫలితాలను ఆమోదించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు భేటీ అయినప్పటికీ.. వీడియోకాన్‌కి రుణాల మంజూరులో సీఈవో చందా కొచ్చర్‌ ప్రమేయం వివాదం గురించి చర్చించలేదు. ఫలితాల వెల్లడి సందర్భంగా చందా కొచర్‌ ఈ విషయం తెలిపారు. ఈ వివాదంపై ఆమెతో పాటు బ్యాంకు కూడా మౌనం వహిస్తుండటంపై విలేకరులు ప్రశ్నించగా.. తనకు బాసటగా మార్చి 28న ఐసీఐసీఐ బ్యాంకు చేసిన ప్రకటనను కొచ్చర్‌ ప్రస్తావించారు.

'రుణ వివాదం గురించి బోర్డు సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదు. బోర్డు ఇప్పటికే తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. ఇంతకు మించి చెప్పేదేమీ లేదు' అని ఆమె తెలిపారు. సోమవారం నాటి సమావేశంలో ప్రభుత్వ నామినీ లోక్‌ రంజన్‌ హాజరు కాలేకపోయారన్నారు. మంగళవారం జరగనున్న బోర్డు సమావేశం సాధారణమైనదేనని, ఈ ఆర్థిక సంవత్సరం అనుసరించాల్సిన వ్యూహాలు, సాధించాల్సిన లక్ష్యాల గురించి చర్చించనున్నట్లు ఆమె చెప్పారు. రుణ వివాదంతో బ్యాంకు ప్రతిష్ట మసకబారిందన్న వార్తలు సరికాదని, 14 శాతం మేర పెరిగిన డిపాజిట్లే దీనికి నిదర్శనమని కొచర్‌ తెలిపారు. భర్త దీపక్‌ కొచర్‌ సహా తన కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా.. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మంజూరులో చందా కొచర్‌ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, నికర మొండి బకాయిలను 2020 మార్చికల్లా 1.5% లోపు తగ్గించడంపై దృష్టి సారిస్తామని ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్‌ వ్యాఖ్యానించారు. రిటైల్‌ రుణాలను 60%కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్‌రప్టసీ కోడ్‌ కేసులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రికవరీ అవుతాయనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

English summary
ICICI Bank, which is facing, conflict of interest allegations involving is chief chanda Kochhar, on Monday posted a 45% decline in consolidated net profit to Rs 1,142 crore for three months ended March as bad loans surged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X