వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొచ్చర్ మెడకు ‘వీడియోకాన్’ ఉచ్చు!!: క్విడ్ ప్రో కో జరిగిందా? సీబీఐతోపాటు దర్యాప్తు బరిలోకి సీబీడీటీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు రుణ మంజూరు విషయం ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్‌ మెడకు క్రమంగా బిగుసుకుంటున్నది. వీడియోకాన్‌ సంస్థకు భారీ మొత్తంలో రుణాన్ని మంజూరు చేసి ప్రతిగా కొచ్చర్‌ కుటుంబం ఆయాచిత లబ్ది పొందిందనే ఆరోపణలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణం ఇచ్చిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఆదాయం పన్ను (ఐటీ) విభాగం వేగంగా అడుగులు వేస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు తీరును కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)లోని దర్యాప్తు విభాగం సునిశితంగా పరిశీలిస్తోంది. సీబీఐ తన ప్రాథమిక విచారణలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను శనివారం ప్రశ్నించింది. ప్రస్తుతానికి చందాకొచ్చర్ పేరు చేర్చకున్నా.. ఆధారాలు ఉంటే మాత్రం తదుపరి దశలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఈ రుణ మంజూరు వ్యవహారంతో సంబంధం ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు నోడల్ అధికారులను ప్రశ్నించి, వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నామని వెల్లడించారు.

తప్పు జరిగిన సంకేతాలుంటే కొచ్చర్ దంపతులకు తప్పని విచారణ?

తప్పు జరిగిన సంకేతాలుంటే కొచ్చర్ దంపతులకు తప్పని విచారణ?

2012లో వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణ మంజూరీలో ఏదైనా ‘క్విడ్‌ ప్రో కో' (నీకిది నాకది) జరిగిందా అన్నదానిపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సంబంధిత లావాదేవీల పత్రాలను పరిశీలిస్తున్నామని ఒక వేళ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ ఏదైనా తప్పునకు పాల్పడినట్లు సంకేతాలు కనిపిస్తే మాత్రం ,అక్రమాలు జరిగాయన్న సాక్ష్యాధారాలేమైనా లభించినట్లయితే ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ తదితరులను పిలిపించి ఈ వ్యవహారంపై మరింత లోతుగా ప్రశ్నిస్తామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. వారిని ప్రశ్నించడం కోసం కొచ్చర్ దంపతులకు సమన్లు జారీ చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.

 ఎఫ్ఐఆర్ నమోదుకు సాక్షాధారాల సేకరణకే ప్రాథమిక విచారణ

ఎఫ్ఐఆర్ నమోదుకు సాక్షాధారాల సేకరణకే ప్రాథమిక విచారణ

రూ.3250 కోట్ల రుణ జారీ ప్రక్రియలో భాగస్తులైన ఐసీఐసీఐ బ్యాంక్‌ నోడల్‌ అధికారుల వాంగ్మూలాలను ప్రాథమిక విచారణలో భాగంగా నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్ వేణుగోపాల్‌ధూత్‌, దీపక్‌ కొచ్చర్‌, తదితరులు ఉన్నట్లు ఆ అధికారులు వివరించారు. ప్రాథమిక దర్యాప్తు ఇలా సీబీఐ ఏదైనా కేసు విషయంలో దర్యాప్తు చేయడానికి ముందు ఎఫ్‌ఐఆర్ ‌(తొలి సమాచార నివేదిక) నమోదు చేస్తుంది. అయితే అందుకు అవసరమైన సాక్ష్యాలను సేకరించడానికి అంతకు ముందే ప్రాథమిక దర్యాప్తు పేరిట రంగంలోకి దిగుతుంది. ఇపుడు ఐసీఐసీఐ బ్యాంక్‌-వీడియోకాన్‌ రుణం కేసులోనూ సీబీఐ చేసిందిదే.

వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్ సంయుక్తంగా ఎన్ఆర్పీఎల్ స్థాపన

వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్ సంయుక్తంగా ఎన్ఆర్పీఎల్ స్థాపన

వీడియోకాన్, ఐసీఐసీఐ బ్యాంకు మధ్య ఏం జరిగిందన్న సంగతి ఇదమిద్ధంగా తెలియకున్నా.. అసలు కథ 2008 డిసెంబర్‌లో మొదలైంది. వీడియోకాన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌, చందా కొచ్చర్‌ల మధ్య క్విడ్‌ ప్రో కో జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేణుగోపాల్‌ ధూత్‌, చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌లతో పాటు కొచ్చర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు బంధువులు కలిసి 2008లో న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌(ఎన్‌ఆర్‌పీఎల్‌)ను నెలకొల్పారు. 2009లో ఎన్‌ఆర్‌పీఎల్‌ డైరెక్టర్‌గా ధూత్‌ రాజీనామా చేసి దీపక్‌ కొచ్చర్‌కు తన 25వేల షేర్లను బదిలీ చేశారు.

 ఇలా దీపక్ కొచ్చర్.. ఆపై మహేశ్ చంద్ర పుంగ్లియాకు ఎన్నార్పీఎల్ షేర్లు బదిలీ

ఇలా దీపక్ కొచ్చర్.. ఆపై మహేశ్ చంద్ర పుంగ్లియాకు ఎన్నార్పీఎల్ షేర్లు బదిలీ

2010లో వేణుగోపాల్ ధూత్‌ తన కంపెనీ సుప్రీం ఎనర్జీ నుంచి ఎన్‌ఆర్‌పీఎల్‌కు రూ.64 కోట్ల రుణం ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత జరిగిన షేర్ల బదిలీ నేపథ్యంలో ధూత్‌కు చెందిన సుప్రీం ఎనర్జీ.. ఎన్‌ఆర్‌పీఎల్‌లోని మెజారిటీ షేర్లను కొనుగోలు చేసింది. అటుపైన వాటిని మహేశ్‌ చంద్ర పుంగ్లియాకు బదిలీ చేశారు. సుప్రీం ఎనర్జీలో పుంగ్లియా తనకున్న మొత్తం వాటాను దీపక్‌ కొచ్చర్‌కు చెందిన పినాకిల్‌ ఎనర్జీకి రూ.9 లక్షలకే విక్రయించారు. రూ.64 కోట్ల పెట్టుబడులు ఉన్న కంపెనీ రూ.9 లక్షలకే వచ్చిందన్నమాట. ఇప్పటిదాకా కథ బాగానే సాగింది. ఇది జరిగిన ఆరు నెలలకు 2012లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రూ.3250 కోట్ల రుణం మంజూరైన తర్వాతే న్యూపవర్‌ కంపెనీ చేతులు మారడం అనుమానాలను రేకెత్తిస్తోంది.

వీడియోకాన్‌కు ఎస్బీఐ ఆధ్వర్యంలోని 20 బ్యాంకుల

వీడియోకాన్‌కు ఎస్బీఐ ఆధ్వర్యంలోని 20 బ్యాంకుల

కన్సార్టియం రూ.40 వేల కోట్ల రుణం ఇలా
దీపక్ కొచ్చర్, ఇద్దరు బంధువుల ఆధ్వర్యంలోని న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థకు రుణం మంజూరు ప్రామాణికతను సీబీఐ పరిశీలిస్తోంది. ఈ మొత్తం విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందాకొచ్చర్‌ పాత్ర ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సీబీఐ తన ప్రాథమిక విచారణలో ఈ అంశాలన్నింటిపైనా ద్రుష్టి సారించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీడియో కాన్ సంస్థకు రుణం మంజూరైంది. అయితే ఈ వార్తలు వెలువడగానే.. నిబంధలను పాటించకుండా.. హెల్డ్‌ టు మెచూరిటీ (హెచ్‌టీఎమ్‌) విభాగంలో బాండ్ల విక్రయాన్ని చేసినందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.58.9 కోట్ల అపరాధ రుసుము విధించింది.

ఎన్నార్పీఎల్ ప్రమోటర్లలో ఒక్కరూ రుణం తీసుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు

ఎన్నార్పీఎల్ ప్రమోటర్లలో ఒక్కరూ రుణం తీసుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు

ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డు మాత్రం తమ సీఈఓ చందాకొచ్చర్‌కు గట్టి మద్దతునే ప్రకటించింది. వీడియోకాన్‌ గ్రూప్‌ రుణ పంపిణీ విషయంలో క్విడ్‌ ప్రో కో జరిగిందన్న వార్తలను కొట్టిపారేసింది. బ్యాంకు రుణ మంజూరీ విషయంలో అంతర్గత ప్రక్రియలన్నీ సమీక్షించామన్నది. అవన్నీ సజావుగా, బలంగా ఉన్నట్లు తేలిందని ఐసీఐసీఐ బోర్డు వెల్లడించడం గమనార్హం. అదే సమయంలో ‘ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణం.. కన్సార్షియంలో భాగంగా ఇచ్చింది. ఏప్రిల్‌ 2012లో అంగీకరించిన మొత్తం కన్సార్షియం రుణం (రూ.40వేల కోట్లు)లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చింది 10 శాతం(రూ.3250 కోట్లు) కూడా లేదు. అదీకాక కన్సార్షియానికి ఆధ్వర్యం వహించింది ఐసీఐసీఐ కాదు. ఒప్పందంలో భాగంగా తన వంతు రుణాన్ని మంజూరు చేసింది' అని ఒక ప్రకటనలో బ్యాంకు బోర్డు పేర్కొంది. న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌ ప్రమోటర్లలో ఒకరు కూడా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోలేదని కూడా స్పష్టం చేసింది.

English summary
Along with the CBI, the investigation wing of the Income-Tax (I-T) Department, too, has commenced what is being described as a “suo motu” inquiry into transactions and money flows in the ICICI Bank-Videocon case. Officials in the Central Board of Direct Taxes (CBDT) told The Sunday Express that following The Indian Express report on the Rs 3,250 crore loan to the Videocon Group from ICICI Bank, the investigation wing in Mumbai has commenced a preliminary enquiry. The focus of the scrutiny would be the “money trail” among the key players and bankers, and a decision would soon be taken on what action could be taken by the I-T Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X