వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకునే వారిపై బ్యాంకుల ప్రత్యేక కన్ను

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి వారు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు చర్యలు చేపట్టాయి.

రూ.50కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారి అకౌంట్లపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి. కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాల మేరకే బ్యాంకులు ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. బ్యాంకుల నుంచి రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ లోన్ తీసుకున్న వారి ఖాతాలను ఆడిట్ చేసి వారు ఆ డబ్బు తిరిగి చెల్లించగలరో లేదో పరిశీలిస్తాయి.

Identifying NPAs: PSBs start audit of loans over Rs 50 crore

రుణాలు చెల్లించకుండా నిరర్ధక ఆస్తులుగా మారే అకౌంట్లను గుర్తించి ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

మోసగాళ్లకు చెక్ చెప్పేందుకు రంగంలోకి కేంద్రం: రూ.50 కోట్ల లోన్ దాటితే.. మోసగాళ్లకు చెక్ చెప్పేందుకు రంగంలోకి కేంద్రం: రూ.50 కోట్ల లోన్ దాటితే..

రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారి అకౌంట్లను ఆడిట్ చేస్తున్నామని, మోసాలు గుర్తించేందుకు ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారని తెలుస్తోంది. మోసాలకు పాల్పడేవారిని, నిధులను దుర్వినియోగం చేసేవారిని, ఉద్దేశ్యపూర్వక ఎగవేతదార్లను గుర్తించేందుకు బ్యాంకులు ఆడిట్ చేస్తున్నాయి. వాటిని సీబీఐకి ఇవ్వనుంది.

English summary
After completion of the audits, the banks will prepare details of accounts that could potentially turn into non performing assets (NPAs), which will then be shared with the Government and investigative agencies for further action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X