వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్ నెట్‌లో మనం పూరే: నార్వే ది బెస్ట్.. బ్రాడ్ బాండ్‌లోనూ సింగపూర్ ఫస్ట్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: క్రమంగా భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టెలికం సంస్థల మధ్య పోటీ వాతావరణం మధ్య మొబైల్ చార్జీలు తగ్గడంతో, ప్రపంచంలోనే అత్యధికంగా డేటా వినియోగిస్తున్న దేశంగా భారత్‌ అవతరించింది.
దేశీయంగా మొబైల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ డేటా వేగాలు పెరిగినా, ప్రపంచదేశాలు ఇంకా మెరుగ్గా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు మాత్రమే. మొబైల్ ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్‌లో భారతదేశం టాప్ - 50 కాదు కదా.. టాప్ - 100 జాబితాలో కూడా లేదు.

62.07 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నార్వే ఫస్ట్

62.07 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నార్వే ఫస్ట్

2017 నవంబర్‌లో సగటు మొబైల్‌ డౌన్‌లోడ్‌ వేగం 8.80 ఎంబీపీఎస్‌ (సెకనుకు మెగాబైట్లు) కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కొద్దిగా వేగం పెరిగి ఇది 9.01 ఎంబీపీఎస్‌కు చేరింది. అయినా కూడా భారత్ స్థానం మారకుండా 109లోనే ఉందని ఓక్లా స్పీడ్‌టెస్ట్‌ సూచీ వెల్లడించింది. డౌన్‌లోడ్‌ సగటు వేగం 62.07 ఎంబీపీఎస్‌తో నార్వే అగ్రస్థానంలో నిలిచింది.

టాప్ టెన్‌లో ఆస్ట్రేలియా.. కెనడా కూడా

టాప్ టెన్‌లో ఆస్ట్రేలియా.. కెనడా కూడా

నార్వే తర్వాత స్థానాల్లో ఉన్న ఐస్ లాండ్‌లో 58.44 ఎంబీపీఎస్‌, నెదర్లాండ్స్‌లో 54.53 ఎంబీపీఎస్‌, సింగపూర్‌లో 51.92 ఎంబీపీఎస్‌, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 51.72 ఎంబీపీఎస్‌, ఖతర్ లో 51.61 ఎంబీపీఎస్‌, ఆస్ట్రేలియాలో 50.04ఎంబీపీఎస్‌, హంగేరిలో 46.39, కెనడాలో 45.67, బెల్జియంలో 45.16 ఎంబీపీఎస్‌ స్పీడ్ రికార్డైంది.

భారతదేశంలో డేటా వేగం అత్యధికంగా పెరుగుదల

భారతదేశంలో డేటా వేగం అత్యధికంగా పెరుగుదల

వైర్ సాయంతో అందజేసే ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బాండ్‌ విషయంలో మాత్రం భారత్‌ ర్యాంక్‌ గతేడాది నవంబర్‌ నుంచి చూస్తే ఈ ఫిబ్రవరి చివరి నాటికి 76 నుంచి 67 స్థానానికి మెరుగుపడింది. ఇదే సమయంలో ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బాండ్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ కూడా 18.82 ఎంబీపీఎస్‌ నుంచి 20.72 ఎంబీపీఎస్‌కి పెరిగింది. ఇందులోనూ 161.53 ఎంబీపీఎస్‌ వేగంతో సింగపూర్‌ ఈ జాబితాలో అగ్రస్థానం పొందింది. ఈ విభాగానికి సంబంధించి, అధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్‌లో డేటావేగం అత్యధికంగా పెరిగిందని గతేడాది నివేదిక ప్రకటించింది.

డేటా వినియోగంలో భారత్‌కు మూడోస్థానం

డేటా వినియోగంలో భారత్‌కు మూడోస్థానం

ప్రపంచదేశాలు నెలవారీగా వినియోగిస్తున్న డేటా, అక్కడి డేటా వేగాలను పరిశీలించి నివేదికలను ఓక్లా రూపొందిస్తుంటుంది. భారతదేశంలో స్పీడ్‌టెస్ట్‌ సర్వర్లు 439 ఉన్నట్లు సంస్థ తెలిపింది. అమెరికా, చైనాల కంటే అధికంగా మనదేశ వినియోగదారులు 150 కోట్ల గిగాబైట్ల డేటాను వినియోగించారని గత డిసెంబర్‌లో నీతిఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా మొబైల్ నెట్ డౌన్‌లోడ్ మరీ పూర్

అంతర్జాతీయంగా మొబైల్ నెట్ డౌన్‌లోడ్ మరీ పూర్

బ్రాడ్‌బ్యాండ్‌ డౌన్‌లోడ్లకు సంబంధించి అంతర్జాతీయ సగటు వేగం 42.71 ఎంబీపీఎస్‌గా ఉన్నది. మొబైల్‌ నెట్‌ డౌన్‌లోడ్లకు సంబంధించి అంతర్జాతీయ సగటు వేగం 22.16 ఎంబీపీఎస్‌కు పరిమితం. మొబైల్‌ డేటా వేగం మెరుగుదలలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మొబైల్‌ డేటా సగటు వేగంలో చైనా (26), శ్రీలంక (82), పాకిస్థాన్‌ (92), బంగ్లాదేశ్‌ (115), నేపాల్‌ (118) స్థానాల్లో ఉన్నాయి. బ్రాడ్‌బ్యాండ్‌ సగటు వేగంలో చైనా (20), శ్రీలంక (76), బంగ్లాదేశ్‌ (86), నేపాల్‌ (89), పాకిస్తాన్‌ (112) స్థానాల్లో ఉన్నాయి.

రిజర్వుబ్యాంకు గుర్తించిన డర్టీ డజన్‌లో ఒకటి ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్

రిజర్వుబ్యాంకు గుర్తించిన డర్టీ డజన్‌లో ఒకటి ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్

బ్యాంకులకు అధిక మొత్తంలో బకాయిపడటంతో డర్టీ డజన్ సంస్థలుగా ఆర్బీఐ గుర్తించిన సంస్థల్లో ఒకటి ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌. దీనిని చేజిక్కించుకోవడానికి ఏడు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పలు విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక వసుతుల ప్రాజెక్టులను కలిగి ఉన్న ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ సంస్థ 29 ఆర్థిక సంస్థల నుంచి రూ.45వేల కోట్ల మేర రుణాలను తీసుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో ఆర్బీఐ ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ కింద రిజర్వ్‌బ్యాంక్‌ గుర్తించిన డజను బడా సంస్థల్లో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ కూడా ఒకటి.

చైనా సోలార్ ల్యాండ్ నుంచి బెంగళూరు కల్యాణ్ డెవలపర్స్ బిడ్స్

చైనా సోలార్ ల్యాండ్ నుంచి బెంగళూరు కల్యాణ్ డెవలపర్స్ బిడ్స్

ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ను సొంతం చేసుకొనేందుకు అమెరికాకు చెందిన మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఇన్‌జెన్‌ క్యాపిటల్‌, విద్యుత్ రంగ సంస్థ పెన్‌ ఎనర్జీ, ఒడిశాకు చెందిన మైనింగ్‌ సంస్థ త్రివేణి ఎర్త్‌మూవర్స్‌, బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ డెవలపర్స్‌, చైనాకు చెందిన సోలార్‌ ల్యాండ్‌, క్యూబ్‌ హైవేస్‌కు చెందిన ఐఎస్‌స్క్వేర్డ్‌, బెంగళూరుకు చెందిన కల్యాణి డెవలపర్స్‌ సంస్థలు బిడ్లు దాఖలు చేసి ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ ఈ ఏడు సంస్థల్లోంచి ఒక సంస్థను ఎంపిక చేసి ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ను వారికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్రూపు కంపెనీల్లో క్రాస్ హోల్డింగ్స్ తగ్గింపు టాటా సన్స్ వ్యూహం

గ్రూపు కంపెనీల్లో క్రాస్ హోల్డింగ్స్ తగ్గింపు టాటా సన్స్ వ్యూహం

టాటా కమ్యూనికేషన్స్‌తోపాటు హోల్డింగ్‌ సంస్థ పనటోన్‌ ఫిన్‌వెస్ట్‌లో తన షేర్లను మాతృ సంస్థ టాటా సన్స్‌కు విక్రయించాలని టాటా పవర్‌ నిర్ణయించింది. ఈ వాటాల విలువ రూ.2,150 కోట్లు. ఈ విక్రయానికి టాటా పవర్‌ బోర్డు ఆమోదం తెలిపింది. గ్రూప్‌ కంపెనీల్లో క్రాస్‌హోల్డింగ్‌ను తగ్గించుకోవడానికి, నాన్‌ కోర్‌ వ్యాపారాల నుంచి వైదొలగడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

పనటోన్ ఫిన్ వెస్ట్‌లో టాటా కమ్యూనికేషన్స్ 30.1 % వాటా

పనటోన్ ఫిన్ వెస్ట్‌లో టాటా కమ్యూనికేషన్స్ 30.1 % వాటా

టాటా కమ్యూనికేషన్స్‌లో పనటోన్‌ ఫిన్‌వెస్ట్ కు 30.1 శాతం వాటా ఉంది. నాన్‌ కోర్‌ ఆస్తుల్లో వాటాల విక్రయం ద్వారా వృద్ధికి బాటలు వేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు టాటా పవర్‌ పేర్కొంది. పనటోన్‌ ఫిన్‌వెస్ట్ లో 59 కోట్లకు పైగా షేర్లను విక్రయించనున్నట్టు ఇప్పటికే స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది.

English summary
Global internet testing and data firm Ookla has released updates to its Speedtest Global Index. As of February, the Index ranks India 67th for fixed broadband speeds and 109th for mobile internet speeds, globally. In absolute terms, India's performance in fixed broadband download speeds has gone up from average speeds of 18.82 Mbps in November 2017 to 20.72 Mbps in February 2018, marking significant improvement since last quarter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X