• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫిచ్ పితలాటకం: వృద్ధిరేటు 7.3% నుంచి 7.5% లోపే

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2018-19) భారత వృద్ధి రేటు 7.3శాతానికి చేరొచ్చని క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ అంచనా వేస్తోంది. ఇక ఆ వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2019-20లో వృద్ధిరేటు 7.5శాతానికి పెరగొచ్చని భావిస్తోంది. ఈ మేరకు ఫిచ్‌ తమ గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ నివేదికలో విడుదల చేసింది.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికైతే 6.5శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తోంది. 2016లో పెద్దనోట్ల తర్వాత భారత్‌లో నగదు కొరత ఏర్పడినా 2017 జూన్‌ నాటికి తిరిగి మామూలు స్థితికి వచ్చిందని ఫిచ్‌ తెలిపింది. ప్రస్తుతం నోట్ల రద్దుకు ముందు నగదు చలామణి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని వెల్లడించింది.

మూడో త్రైమాసికంలో 7.2 శాతం పెరుగుదలే ప్రగతికి నిదర్శనం

మూడో త్రైమాసికంలో 7.2 శాతం పెరుగుదలే ప్రగతికి నిదర్శనం

ఇక 2017 జులైలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు నేపథ్యంలో ఎదురైన ఇబ్బందులు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. గతేడాది అక్టోబర్‌-డిసెంబరు త్రైమాసికంలో వృద్ధిరేటు 7.2శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణం, తయారీ రంగంలో మంచి వృద్ధి నమోదైనట్లు నివేదికలో తెలిపింది.

2018 - 19లో 7.3 శాతంగా భారత ప్రగతి రేటు

2018 - 19లో 7.3 శాతంగా భారత ప్రగతి రేటు

ఇక ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ కూడా భారత వృద్ధికి ఊతమిచ్చేలా ఉందని ఫిచ్‌ అభిప్రాయపడింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్ల పెంపును ప్రారంభించొచ్చని ఫిచ్‌ అంచనా వేస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.3శాతానికి చేరే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసిన విషయం తెలిసిందే. ఫిచ్‌ నివేదిక ప్రపంచ బ్యాంకు నివేదికకు దగ్గరగా ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక జీఎస్టీ శ్లాబ్ రేట్లు భారత్ లోనే అధికం

ప్రపంచంలోనే అత్యధిక జీఎస్టీ శ్లాబ్ రేట్లు భారత్ లోనే అధికం

భారత్‌లో గత ఏడాది జులై నుంచి అమలవుతున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అత్యంత క్లిష్టమైనదని, ప్రపంచంలోనే రెండో అత్యధిక పన్ను రేటు కలిగినదని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 115దేశాల్లో దాదాపు ఇదే విధమైన పరోక్ష పన్నుల విధానం అమలవుతోందని ప్రపంచ బ్యాంకు ఓ నివేదికలో స్పష్టం చేసింది. భారత్‌లో జీఎస్టీ పన్ను విధానం ఐదు శ్లాబ్‌ల్లో (సున్నా శాతం, 0.5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం) అమలవుతోంది. సున్నా పన్ను శాతంతో కొన్ని వస్తువుల కొనుగోళ్లు, ఎగుమతులకు ట్యాక్స్‌ ఉండదు. అలాగే మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు, రియల్‌ ఎస్టేట్‌పై స్టాంప్‌ డ్యూటీలు, విద్యుత్‌ డ్యూటీలను జీఎస్టీ నుంచి మినహాయించి వాటిపై పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేశారు.

ఐదు దేశాల్లోనే నాలుగు స్లాబ్ ల కంటే ఎక్కువ జీఎస్టీ అమలు

ఐదు దేశాల్లోనే నాలుగు స్లాబ్ ల కంటే ఎక్కువ జీఎస్టీ అమలు

ప్రపంచంలో దాదాపు 49 దేశాలకు ఒకటే శ్లాబ్‌లో జీఎస్టీ ఉంది. 28 దేశాలకు రెండు శ్లాబుల్లో పన్నుల విధానం ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కేవలం ఐదు దేశాల్లో మాత్రమే నాలుగు అంతకన్నా ఎక్కువ శ్లాబుల్లో జీఎస్టీ అమల్లో ఉందని తెలిపింది. ఆ దేశాలు భారత్‌, ఇటలీ, లగ్జెంబర్గ్‌, పాకిస్థాన్‌, ఘనా అని వెల్లడించింది. ప్రపంచంలో ఎక్కువ జీఎస్టీ శ్లాబ్‌లు ఉన్న దేశం భారతే‌ అని ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. 12శాతం, 18శాతం రెండు శ్లాబ్‌లను కలిపేసి ఒకటే శ్లాబ్‌గా మార్చుతామని భారత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు నివేదికలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి రోజుల్లో పన్నుల విధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు గందరగోళానికి గురయ్యాయని పేర్కొంది.

English summary
New Delhi: Fitch Ratings on Thursday projected India’s economic growth to rise to 7.3% next fiscal and further to 7.5% in the fiscal year 2019-20. In its Global Economic Outlook report, the US-based agency forecast Indian economy to clock a growth rate of 6.5% this fiscal, a tad lower than official estimates by the Central Statistics Office (CSO) of 6.6%. The economy grew 7.1% in 2016-17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X