వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12ఏళ్లకు పెప్సికో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ఇంద్రానూయీ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పెప్సికో సీఈఓ ఇంద్రానూయీ ఈ ఏడాది అక్టోబర్ 3న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. రామన్ లగౌర్టా అనే సెకండ్ ర్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ను ఆమె స్థానంలో కంపెనీ బోర్డు ఎన్నుకున్నట్లు తెలిపింది.

పెప్సికో సంస్థకు సీఈఓగా ఇంద్రానూయీ 12ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆమె మొత్తం సంస్థలో 24ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆమె కంపెనీని లాభాల బాటలో నడిపించారు. 2006 నుంచి 2017 వరకు 162శాతం షేర్‌హోల్డర్ రిటర్న్, డివిడెంట్ బైబ్యాక్స్ ద్వారా షేర్ హోల్డర్స్‌కు 79.4బిలియన్లు రిటర్న్ చేయడం జరిగింది. మొత్తం రెవెన్యూ 80శాతం పెరగింది.

Indra Nooyi Is Stepping Down as PepsiCo CEO After 12 Years

కస్టమర్లకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందివ్వడమే తమ ప్రాధాన్యత అని గట్టిగా నమ్మేవారు భారత సంతతికి చెందిన సీఈఓ. ఇండస్ట్రీ రీసైక్లింగ్ హాబిట్స్ మెరుగుపరిచే చర్యలు కూడా ఆమె చేపట్టారు.

కాగా, రామన్ లగౌర్టా పెప్సికోకు ఆరవ సీఈఓగా నూయీ అనంతరం బాధ్యతలు చేపట్టనున్నారు. స్పానిస్ కన్ఫెక్షనరీ కంపెనీ, చుపా చుప్స్. ఎస్.ఏలో పనిచేసిన లగౌర్టా.. 22 ఏళ్ల క్రితమే పెప్సికోలో చేరారు. కాగా, ప్రస్తుతానికి ఇది తప్ప మిగితా స్థానాల్లో ఎలాంటి మార్పు లేవని పెప్సికో సంస్థ తెలిపింది.

English summary
PepsiCo CEO Indra Nooyi will step down as CEO on October 3rd this year, the company announced on Monday. The firm’s board elected Ramón Laguarta, who was already the second-ranked executive, to succeed her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X