వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఇన్సోసిస్‌కు రాజేష్ మూర్తి రాజీనామా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇన్పోసిస్‌లో పరిస్థితులు చక్కబడుతాయని భావిస్తున్న తరుణంలో మరో షాక్ తగిలింది. ఇన్పోసిస్ దిగ్గజాల్లో ఒకరైన రాజేష్‌మూర్తి కంపెనీకి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం నాడు ప్రకటించారు. ఈ పరిణామం టెక్ కంపెనీలో ఇంకా సంక్షోభం ముగిసిపోలేదని తేటతెల్లం చేసింది. అయితే కొత్త సీఈఓగా సలీల్ ఫరేఖ్ బాధ్యతలను స్వీకరించారు.

ఇన్ఫోసిస్‌ ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సలీల్‌ పరేఖ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీనామా చేసిన తొలి ఎగ్జిక్యూటివ్‌ ఈయనే. పరేఖ్‌ రాకతో మేనేజ్‌మెంట్‌లో రాజీనామాల పర్వం తగ్గుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేశారు. కానీ కంపెనీలో రాజీనామాలు మాత్రం ఆగడం లేదు.

Infosys president Rajesh Murthy resigns

అయితే మూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేస్తున్నట్టు తెలిసింది. 26 ఏళ్లుగా ఆయన ఇన్ఫీలో పనిచేస్తున్నారు. జనవరి చివరి వరకు మాత్రమే మూర్తి ఇక ఇన్ఫీలో పనిచేయనున్నారు.

గత 26 ఏళ్లుగా ఇన్ఫోసిస్‌ అందించిన సేవలకు గాను, కంపెనీ ఆయనను ప్రశంసించింది. భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. గత జూన్‌లో నలుగురు ఇన్ఫోసిస్‌ అధినేతల్లో ఒకరైన సందీప్‌ దాడ్లాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఆయన అనంతరం ప్రస్తుతం మూర్తి కూడా కంపెనీ నుంచి తప్పుకోబోతున్నట్టు తెలిపారు. 2016లో మూర్తి కంపెనీ అధినేతగా ప్రమోట్‌ అయ్యారు. ఎనర్జీ, యుటిలిటీస్‌, టెలికమ్యూనికేషన్స్‌, సర్వీసెస్‌కు మూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

English summary
Infosys said one of its three presidents, Rajesh Murthy, had resigned, the first executive exit since Salil Parekh took over as chief executive officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X