వార్షిక ఫలితాల దెబ్బ: ఇన్ఫోసిస్ షేర్లు డమాల్, నిమిషాల్లో 15వేల కోట్ల సంపద ఆవిరి

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఇన్ఫోసిస్ షేర్లు పడిపోయాయి. ఈ సంస్థ శుక్రవారం తమ వార్షిక ఫలితాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోమవారం షేర్లు పడిపోయాయి. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభం, ఆదాయంలో అంచనాలను అందుకుంది.

కానీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వెల్లడించిన మార్జిన్‌ రేంజ్‌ అంచనాల కంటే తక్కువగా ఉంది. ఈ ప్రభావం ఇన్ఫోసిస్ షేర్ల పైన పడింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

Infosys Shares Price Slumps, Market Value Of 15,000 Crore Rupees Gone Within Minutes

ఇంట్రాడేలో దాదాపు ఆరు శాతం నష్టోయాయి. దీంతో నిమిషాల్లో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువలో రూ. 15వేల కోట్ల సంపద ఆవిరి అయింది. ఆ తర్వాత కాస్త తేరుకుంది.

ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో షేరు విలువ 3.21శాతం నష్టంతో రూ. 1,130.70 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 3.49శాతం నష్టంతో రూ. 1,130.60 వద్ద కొనసాగింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఇన్ఫోసిస్‌ మార్జిన్‌ రేంజ్‌ను 22 నుంచి 24 శాతంగా అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇది 23 నుంచి 25శాతం ఉంది. ఈ అంచనాలు కంపెనీ షేర్లపై ప్రభావం చూపాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shares of Infosys, which announced its Q4 earnings on Friday, fell as much as 6 per cent today in early trade. This wiped nearly Rs. 15,000 crore off Infosys market capitalisation within minutes of market opening.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X