హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ న్యూస్ : ఇనుము ధర తగ్గిందహో..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆకాశాన్నంటిన ఇనుము ధరలు దిగొచ్చాయి. కొంతకాలంగా కొండెక్కిపోయిన ఐరన్ కాస్ట్ తగ్గుముఖం పట్టింది. 15-20 రోజుల కిందటే స్టీలు ప్లాంట్లు ధరలు తగ్గించాయి. కానీ మార్కెట్ లో ఐరన్ వ్యాపారులు 3-4 రోజుల నుంచి కొత్త ధరలతో అమ్మకాలు చేపడుతున్నారు. పాత ధరలతో స్టాక్ పెట్టుకున్న వ్యాపారులు అది అమ్ముడుపోయాకే కొత్త ధరలు అమలు చేస్తున్నారు.

పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లకు సంబంధించి టన్ను ఐరన్ 54 వేల నుంచి 55 వేల రూపాయలు పలుకుతుండగా దాదాపు 3వేల రూపాయలు తగ్గింది. దీంతో కొత్త ధర మేరకు టన్ను ఐరన్ 52 వేలకే లభిస్తోంది. ఇక చిన్న ప్లాంట్లకు సంబంధించి ఇంతకుముందు టన్ను ధర 52 వేలు ఉండగా.. ఇప్పుడది 49వేల రూపాయలకే దొరుకుతోంది.

iron cost reduced around 3 thousand rupees

అకస్మాత్తుగా స్టీల్ ధరలు పడిపోవడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. సీజన్ లేకపోవడం, మూఢం, ప్రభుత్వ నిర్మాణాలు తగ్గిపోవడం, అపార్టుమెంట్ల నిర్మాణాలు తగ్గిపోవడం ఇలాంటి అనేక అంశాలతో ఐరన్ కాస్ట్ తగ్గినట్లు తెలుస్తోంది.

రెండు సంవత్సరాల కిందట చైనా నుంచి దిగుమతయ్యే ఐరన్ ఓర్ ధర తక్కువగా ఉండటంతో స్టీల్ కంపెనీలు కూడా ధరలు తగ్గిస్తూ వచ్చాయి. ఒకానొక సందర్భంలో టన్ను ఇనుము 40వేల రూపాయలకే లభించింది. దాని తర్వాత కంపెనీలు సిండికేట్లుగా మారడం, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో కేవలం ఏడాదిన్నర సమయంలో టన్ను ధర 15వేల రూపాయలు పెరిగింది. మొత్తానికి ధరలు కొంతమేర తగ్గడం శుభపరిణామం అంటున్నారు భవన నిర్మాణ రంగ నిపుణులు. అయితే తగ్గిన ధరలు నిలకడగా ఉంటాయా లేదంటే ఇంకా తగ్గుతాయా అన్నది ప్రశ్నార్థకమే.

English summary
Heavy iron prices have gone down. About 3,000 rupees has fallen. The lack of season, decreased government structures, decreased apartment structures, and many other factors, such as Iron Cast, have been reduced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X