వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు బ్యాంకుల విలీనంతో రూ.20వేల కోట్లు నష్టం

|
Google Oneindia TeluguNews

విజయాబ్యాంకు, దేనా బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడాలు విలీనం కావడం మార్కెట్లపై దుష్ప్రభావం చూపించింది. ఈ మూడు బ్యాంకుల కలయిక ఇన్వెస్టర్లను థ్రిల్ చేస్తుందనుకుంటే అది కాస్త తలకిందులైంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో లాభాల్లో స్వల్ప పెరుగుదల చోటు చేసుకోగా... మరికొన్ని బ్యాంకులు కొనుగోలుదారులకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మొత్తం మీద ఇండియన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ అయిన బ్యాంకులు దాదాపు 20వేల కోట్ల రూపాయల మేరా నష్టపోయాయి.

<strong>మెగా మెర్జర్: ఆ 3 బ్యాంకుల విలీనం</strong>మెగా మెర్జర్: ఆ 3 బ్యాంకుల విలీనం

తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమవుతున్నారని అదే సమయంలో బ్యాంకులు కూడా రుణాలను తిరిగి కట్టించుకోలేకపోతున్నాయని... దీనికి చాలా సమయం పడుతుండటంతో బ్యాంకులు నష్టాల బాట పడుతున్నాయన్నారు స్మిత్ టాన్ అసెట్ మేనేజ్‌మెంట్‌ ఛీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ డేవిడ్ స్మిత్. ఇక్కడ పెరుగుతున్న ధరలు, పడిపోతున్న ధరలు చూస్తే కొందరికి వరంగాను, మరికొందరికి పెద్ద తలనొప్పిగానూ మారాయని ఆయన అన్నారు.

listed banks lose Rs 20,000 crore in market value with merger of three banks

ఒక్కటవుతున్న మూడు బ్యాంకుల్లో దేనా బ్యాంక్ పరిస్థితి అంత బాగోలేదు. బ్యాంకు విలీనం అవుతుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా వాటి షేర్లు 20శాతం పెరిగాయి. ఇది గత పదేళ్లలో ఎన్నడూ లేదు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 16శాతం పడిపోయాయి. మే 2004 నుంచి ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. మరోవైపు విజయాబ్యాంకు 5.8శాతం పడిపోయాయి. బ్యాంకు షేర్లు పడిపోవడంతో హెడ్జింగ్ ధరలు కూడా పడిపోయాయి. ఇదిలా ఉంటే భారత్‌లోని బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ అధీనంలో సగానికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయాదేశాల ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వద్ద రుణాలు పొంది వాటిని ఎగవేసిన చెత్త రికార్డు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉంది.

English summary
India’s plan to merge state-controlled lenders as a way to resolve its bad-debt issue didn’t thrill investors. The proposed union of Vijaya Bank and Dena Bank with Bank of Baroda fanned speculation of further consolidation in the sector. While some state-run lenders rose on Tuesday, most fell on concerns about eroding capital buffers and growing bad debt for buyers. Overall, the 22 banks listed on Indian stock exchanges lost about 203 billion rupees ($2.8 billion) of market value.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X