వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రిజల్ట్స్ ఎఫెక్ట్: నష్టాల్లో మార్కెట్లు, అదే కారణమా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే విషయమై స్పష్టత లేని కారణంగా స్టాక్ మార్కెట్లపై ప్రభావం కన్పించింది. బుధవారం ఉదయం నుండి సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉన్న సమయంలో సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. హంగ్ ఏర్పడడంతో నష్టాలతో ముగిశాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా స్పష్టత రాని కారణంగా నష్టాలు కొనసాగాయి.

MARKET WRAP: Global cues, Ktaka result drag Sensex 156 pts; PNB down 12%

ఉదయం దాదాపు ఉదయం దాదాపు 166 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ నష్టాల్లోనే కొనసాగింది. . నిఫ్టీ కూడా 54 పాయింట్ల నష్టంతో ప్రారంభమై చివరి వరకు నష్టాలనే చవిచూసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 156.06 పాయింట్లు నష్టపోయి 35,387.88 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 60.80 పాయింట్లు నష్టపోయి 10741.10 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇవాళ ట్రేడింగ్ లో హెచ్‌యూఎల్‌, లుపిన్‌, ఐటీసీ, విప్రో, ఎస్‌ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సిప్లా, గెయిల్‌, రిలయన్స్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

పీఎన్‌బీ, సిండికేట్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంచురీ ప్లేబోర్డ్స్‌, మోరెపెన్‌ ల్యాబ్స్‌, అదానీ ట్రాన్స్‌మిషన్, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, శక్తి పంప్స్‌ కంపెనీల షేరు్లు దాదాపు 16శాతం పడిపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.82 వద్ద ట్రేడవుతోంది.

English summary
Benchmark indices fell on Wednesday as doubts over the composition of the next government in Karnataka dampened investor risk appetite. However, recovery in rupee and fall in crude oil prices help cut losses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X