వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెన్సెక్స్ 331, నిఫ్టీ 81 పాయింట్లు...భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

|
Google Oneindia TeluguNews

రెండ్రోజుల క్రితం నష్టాల బాటలో ముగిసిన భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే మార్కెట్లు మంచి లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా మెటల్ రంగం, ఎనర్జీ రంగాలు లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ నిఫ్టీ రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 331 పాయింట్ల లాభాలతో ముగియగా నిఫ్టీ 81 పాయింట్ల ప్రాఫిట్‌తో క్లోజ్ అయ్యాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.1శాతం పెరుగుదలతో ముగియగా... బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతంతో ముగిసింది.

ఇదిలా ఉంటే అంతర్జాతీయ సానుకూలతలు కూడా తోడవడంతో బ్యాంకింగ్ ఇతర రంగాల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు లాభాల బాటను కొనసాగించాయి. ఇందులో భాగంగానే సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 331 పాయింట్లు పెరిగి 38,277కు ఎగబాకింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 11,552కు చేరుకుంది.

Markets close hitting a all time record

ఈరోజు భారీ లాభాల్లో దూసుకెళ్లినవి ఇవే:
హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (18.63%), వెల్స్ పన్ కార్ప్ (11.46%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (7.96%), జిందాల్ సా లిమిటెడ్ (7.22%), ఎల్ అండ్ టీ (6.74%).

నష్టాలు చవిచూసిన కంపెనీలు

గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (-5.92%), ఫెడరల్ బ్యాంక్ (-5.62%), గ్రాఫైట్ ఇండియా (-4.95%), టీటీకే ప్రిస్టేజ్ (-4.22%), తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ (-3.84%).

ఇక ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. హ్యాంగ్‌సెంగ్ 139శాతం పెరుగుదల నమోదు చేయగా... నిక్కీ 0.32 శాతంతో పడిపోయింది. షాంగై కంపోజిట్ 1.09శాతం లాభాలు నమోదు చేసింది. యూరోపియన్ మార్కెట్లు కూడా మంచి ఫలితాలే ఇచ్చాయి.

English summary
Indian share markets continued their momentum during closing hours of trade and ended the day at their fresh record high levels. Gains were largely seen in the metal sector and energy sector.Both, the Sensex and Nifty, ended their day at record closing highs. At the closing bell, the BSE Sensex stood higher by 331 points (up 0.9%) and the NSE Nifty closed higher by 81 points (up 0.7%). The BSE Mid Cap index ended the day up by 1.1%, while the BSE Small Cap index ended the day up by 0.1%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X