వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రంప్ ఎఫెక్ట్, అమెరికా-చైనా ట్రేడ్ వార్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్‌కు తెరలేపారు.
చైనాపై వాణిజ్య ఆంక్షలు విధించారు. దీంతో అమెరికా, ఐరోపా మార్కెట్లు డీలాపడ్డాయి. ఆ ప్రభావం మన దేశ మార్కెట్ల పైన కూడా పడింది. సెన్సెక్స్ 400కు పైగా కోల్పోయింది. నిఫ్టీ 10,000కు పైగా కిందకు పడిపోయింది.

అమెరికా-చైనామధ్య ట్రేడ్ వార్ భయాలు నెలకొన్న నేపథ్యంలో మార్కెట్ భారీగా పతనమైంది. నిఫ్టీ 2018లో తొలిసారిగా పదివేల మార్క్‌కు పడిపోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, యస్ బ్యాంకు తదితర షేర్లు భారీగా నష్టపోయాయి.