• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నోట్ల రద్దు.. ఆ పై జీఎస్టీ నుంచి కోలుకుంటున్న భారత్: మూడీస్.. మహిళా బిలియనీర్లలో సావిత్రి ఫస్ట్

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: అవినీతిని అంతం చేసేందుకు, నల్లధనాన్ని వెలికి తీసేందుకు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ రూ.1000, రూ.500 విలువైన నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏడు నెలలకే దేశ ఆర్థిక వ్యవస్థలోనే కీలక సంస్కరణ.. అన్ని పన్నుల స్థానే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తెచ్చారు. జంట సవాళ్లు.. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రభావం నుంచి దెబ్బ నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ పేర్కొన్నది.
కానీ 2018 ఏడాదిలో భారత్‌ జీడీపీ వృద్ధి రేటులో పెద్దగా మార్పులు ఉండబోవని 7.6% మాత్రమే నమోదు చేసుకుంటుందని స్పష్టం చేసింది. 2018, 19ల్లో ప్రపంచవ్యాప్తంగా వృద్ధిపైనా మూడీస్‌ ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారమే భారత్‌ ఆర్థిక వృద్ధి పురోగమనం ముందుకు కొనసాగుతోందని తెలిపింది.

బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌తో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు దోహదం

బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌తో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు దోహదం

2018-19 ఏడాది బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలే పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తోందని మూడీస్‌ అభిప్రాయ పడింది. 2016లో భారత్‌ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, గతేడాది తీసుకున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నిర్ణయాలతో భారత్‌ వృద్ధి మీద ప్రతికూల ప్రభావం చూపాయి. వాటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడం ప్రారంభించింది. కోలుకోవడంపై కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ, పట్టణాభివృద్ధి కోసం 2018 బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణం' అని మూడీస్‌ తెలిపింది.

2019లో మాత్రం 7.5 శాతంగా జీడీపీ నిర్ధారణ

2019లో మాత్రం 7.5 శాతంగా జీడీపీ నిర్ధారణ

వీటికి తోడు బ్యాంకుల రీకాపిటలైజేషనల్‌ కోసం నిధులు సమకూర్చడం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు మరో అవకాశమని మూడీస్‌ తెలిపింది. కానీ భారత్‌ జీడీపీలో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని వెల్లడించింది. వృద్ధి రేటు 2019 ఏడాదిలో 7.5శాతంగా మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ భారత్‌ రేటింగ్‌ను పెంచిన విషయం తెలిసిందే. 13ఏళ్ల తర్వాత భారత్‌కు బీఏఏ3 నుంచి బీఏఏ2 రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. మూడీస్‌ రేటింగ్‌ ప్రభావం మోదీ ప్రభుత్వానికి మరింత ప్రోత్సహకరంగా లభించినట్లైంది.

సంపద స్రుష్టిలో ఎదురులేని ముఖేశ్‌

సంపద స్రుష్టిలో ఎదురులేని ముఖేశ్‌

భారత్‌లో కొత్త కోటీశ్వరులు ఆవిర్భవిస్తున్నారని హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ సర్వే పేర్కొంది. ఒక్క 2017లోనే 56 మంది బిలియనీర్లు తయారయ్యారన్నది. దీంతో 170 మంది బిలియనీర్లతో అత్యధికంగా సంపన్నులు ఉన్న దేశాల గ్రూప్‌లో భారత్‌ కూడా చేరిందని ఆ సర్వే తెలిపింది. మొత్తం 819 మంది బిలియనీర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది. ఇక అమెరికాలో 571 మంది బిలియనీర్లు ఉన్నారు.

మహిళా బిలియనీర్లలో సావిత్రి జిందాల్ ఫస్ట్

మహిళా బిలియనీర్లలో సావిత్రి జిందాల్ ఫస్ట్

భారత్‌లో హురున్‌ సంస్థ తయారు చేసిన టాప్‌-20 బిలియనీర్ల జాబితాలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తొలిస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మూడో వంతు కొత్త ముఖాలే. గనుల రద్దు భారత్‌లోని బిలియనీర్ల జాబితాను ప్రభావితం చేసిందని ఈ సంస్థ పేర్కొంది. దీంతోపాటు వాటాదారుల మధ్య విభేదాలతో వ్యాపారాలు విక్రయించడం వల్ల కొత్త వారు ఈ జాబితాలో స్థానం సాధించారని అన్నారు. చైనాలో 163 మంది మహిళా బిలియనీర్లు ఉండగా.. భారత్‌లో కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో సావిత్రి జిందాల్‌ తొలిస్థానంలో ఉన్నారు. అత్యధికంగా బిలియనీర్లను తయరు చేస్తున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

English summary
Moody’s Investors Service said Indian economy is starting to recover from the negative impact of demonetisation and disruption caused by GST roll out, but kept GDP growth estimates unchanged at 7.6 % for 2018. In its global growth forecasts for 2018 and 2019, Moody’s said the Budget for fiscal year beginning April 1 (2018-19) includes some measures to stabilise rural economy that was disproportionately hit by scrapping of high denomination 500 and 1000 rupee notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X