వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్నా ఫుడ్స్‌లో రూ.152 కోట్లు పెట్టుబడి పెట్టిన మోర్గాన్ స్టాన్లీ నిర్వహణలోని పిఇ ఆసియా ఫండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా నిర్వహణలోని ఫండ్ సహజసిద్ధ ఆహార ఉత్పత్తుల బ్రాండ్ - నేచుర్ హెల్త్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ అయిన 'మన్నా ఫుడ్స్' తయారీదారు సదరన్ హెల్త్ ఫుడ్స్‌లో రూ. 152 కోట్ల మేర పెట్టుబడిగా పెట్టింది.

మన్నా ఫుడ్స్ వేడి పాలతో వెంటనే సిద్ధం చేసుకోగల, సాంప్రదాయికంగా ఇంట్లోనే చేసుకునే 'సత్‌మవ్వు'ను మరింత అభివృద్ధి చేస్తూ తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల మిశ్రమంగా మన్నా హెల్త్ మిక్స్‌ను తన ప్రముఖ ఉత్పత్తిగా అందిస్తోంది. తన ప్రధానమైన ఈ ఉత్పత్తితో పాటు ఇంకా రెడీ టు కూక్ - మిల్లెట్ బేస్‌డ్ ఇన్‌ప్లాంట్ ఫుడ్, మిల్లెట్ గ్రెయిన్స్, సోయా నగ్గెట్స్, డ్రైడ్ ఫ్రూట్స్, ప్యూరీస్, పేస్ట్ మొదలైన హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్‌లను కూడా మన్నా ఫుడ్స్ అందిస్తోంది. మన్నా దక్షిణ భారతదేశంలో అనేక కుటుంబాల నమ్మకాన్ని చూరగొన్న ఒక సుప్రసిద్ధ బ్రాండ్.

'మన్నా హెల్త్ మిక్స్ నేతృత్వంలో మన్నా ఫుడ్స్ ఒక విశిష్టమైన హెల్త్ ఫుడ్ వేదికను సృష్టించింది. దీనిద్వారా సజమైనటువంటి, నిల్వ పదార్థాలు వినియోగించని, సంప్రదాయబద్దమైన ఆహార శ్రేణిని అందిస్తోంది. ప్రజలు కృత్రిమ ఆహారాన్ని వదిలేస్తూ సేంద్రీయ, సాంప్రదాయిక ఆహారం వైపు మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో, మన్నా ఫుడ్స్ మోర్గాన్ స్టాన్లీతోకలిసి భాగస్వామ్యం వహిస్తున్నందుకు, అదే విధంగా భారతదేశంలో హెల్త్ ఫుడ్ రంగంలో విజయవంతంగా దూసుకుపోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని కంపెనీ ప్రమోటర్ ఐ.ఎస్.ఎ.కె. నాజర్ అన్నారు.

Morgan Stanley invests Rs 152 crores in Manna Foods

మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ లిమిటెడ్ ఆసియా ఇన్ ఇండియా కో- హెడ్ అర్డున్ సైగరల్ మాట్లాడుతూ, 'అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ, కస్టమర్లకు సహజమైన, ఆరోగ్యకరమైన, అత్యంత నాణ్యత కలిగిన ఉత్పత్తులను నిరంతరం పంపిణీ చేస్తున్న మన్నా వంటి బ్రాండ్‌కు మద్దతు అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భారతదేశంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో మన్నా అందిస్తున్న సహజ ఆహార ఉత్పత్తులు వినియోగదారులకు ఒక ఆకర్షణీయమైన ఎంపికను అందించే స్తితిలోఉన్నాయని మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా, సూపర్ ఫుడ్ తరహా పోషకాహారాలు కలిగి తిరిగి ప్రజాదరణ పొందుతున్న పెరట్లో పండే తృణధాన్యాలను చౌక ధరకే అందిస్తోంది. మన్నా తదుపరి దశ అభివృద్ధికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని అన్నారు.

దక్షిణ భారతదేశంలో కంపెనీ విస్తరణక, అదే విధంగా ప్రస్తుత మదుపర్లలో కొంత మంది నిష్క్రమణకు ఈ నిధులను వినియోగించడం జరుగుతుంది. కంపెనీ అంతకు ముందు 2015లో ఫల్‌క్రమ్ నేతృత్వంలోని గ్రోత్ ఇన్వెస్టర్ల నుంచి రూ.30 కోట్లను సేకరించింది.

'2015లో మన్నాతో బాగస్వామ్యం వహించిన తర్వాత ఫల్‌క్రమ్, నాజర్ నేతృత్వంలోని మన్నా బృందంతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. మన్నా ఎప్పుడూ ఒక బలమైన బ్రాండ్ అని మా విశ్వాసం. కంపెనీ గత 2 ఏళ్లుగా ప్రకటిస్తున్న బలమైన అమ్మకాల వృద్ది ద్వారా అదే తేటతెల్లమైంది. మోర్గాన్ స్టాన్లీతో చేతులు కలపడం వల్ల ఎఫ్ఎమ్‌సిజి విభాగంలో కంపెనీ స్థానం మరింత బలోపేతం అవుతుంది' అని ఫల్‌క్రమ్ భాగస్వామి ఎతాన్ ఖాత్రి అన్నారు.

ఎమ్ఎపిఇ అడ్వైజరీ గ్రూప్ మొత్తం వ్యవహారానికి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది..

English summary
Morgan stanley Private equity Asia Funs invested Rs 152 crores in Manna Foods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X