• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నోట్ల రద్దు నీరవ్‌కు ముందే తెలుసా?: ఇటు డిజిటల్ వాలెట్లకు కష్టకాలం

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ/ ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.11,400 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన విలాసవంతమైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి దేశంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి ముందే తెలుసా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి పాత రూ.1000, రూ.500 విలువైన నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడానికి కేవలం కొన్ని గంటల ముందు ఆ బ్యాంకుకు చెందిన ఒక శాఖలో రూ.90 కోట్ల నగదును డిపాజిట్ చేసినట్లు తెలుస్తున్నది.ఈ నగదును ఆయన బంగారంగా గానీ లేక మరో రూపంలోకి గానీ మార్చుకుని ఉండవచ్చునన్న సందేహాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు, నీరవ్ మోదీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, నోట్ల రద్దు నిర్ణయం గురించి నీరవ్ మోదీకి ముందే తెలిసి ఉంటుందని స్పష్టమవుతోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు. ఇందులో నిజవాస్తవాన్ని వెలికితీసేందుకు సమగ్రమైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఎన్పీపీ ఎం మజీద్ మెమన్ అన్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ కన్సార్టియానికి రూ.6000 కోట్లు రుణం ఇలా

ఐసీఐసీఐ బ్యాంక్ కన్సార్టియానికి రూ.6000 కోట్లు రుణం ఇలా

మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌లో మోసం జరిగిందో లేదో తెలుసుకోవడానికి రెండు డజన్‌కు పైగా ఉన్న బ్యాంకింగ్ రంగ సంస్థలు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం గీతాంజలికి రూ.6 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చాయి. గీతాంజలిలో ఆర్థిక మోసం జరిగిందో తెలుసుకోవడానికి ఈ బ్యాంకుల కన్సార్టియం టీఆర్ ఛాధా అండ్ కోను నియమించుకున్నాయి. ఇచ్చిన రుణాన్ని వసూలు చేయడానికి ఈ ఆడిట్ దోహదం చేయనున్నదని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఈ గీతాంజలికి పీఎన్‌బీ 1,000 కోట్ల స్థాయిలో రుణం ఇవ్వగా, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.600 కోట్లు సమర్పించుకున్నాయి.

కేవైసీ నిబంధనల అమలు గడువు పెంపునకు ఆర్బీఐ నో

కేవైసీ నిబంధనల అమలు గడువు పెంపునకు ఆర్బీఐ నో

పేటీఎం, ఓలా మనీ, గూగుల్‌ తేజ్‌ వంటి డిజిటల్‌ వాలెట్లకు లేదా ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కస్టమర్ల నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన కేవైసీ-కంప్లీయెన్స్‌ తుది గడువును మరింత పొడిగించడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిరాకరించింది. రేపే ఆఖరి తేదీగా ఆర్‌బీఐ పేర్కొంది. ఇప్పటికే సరిపోయేంత సమయం ఇచ్చామని, మరోసారి ఈ గడువును పొడిగించలేమని ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకులు ప్రమోట్‌ చేసే 50 వాలెట్లతో పాటు 55 ప్రీపెయిడ్‌ వాలెట్లు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయి. వీరందరూ ఫిబ్రవరి 28 వరకు ఈ ప్రక్రియను పూర్తిగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

పొడిగించిన గడువు నేటితో ముగింపు.. అయినా ప్రాబ్లం లేదన్న ఆర్బీఐ

పొడిగించిన గడువు నేటితో ముగింపు.. అయినా ప్రాబ్లం లేదన్న ఆర్బీఐ

తొలుత డిజిటల్ వాలెట్ల ఖాతాదారులంతా గతేడాది డిసెంబర్ నెలాఖరులోగా కేవైసీ వివరాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం ఈ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే తమ కేవైసీ వివరాలను సమర్పించారు. దీంతో, మిగతా యూజర్లను కోల్పోతామేమోనని డిజిటల్‌ వాలెట్ల యాజమాన్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగదురహిత ఆప్షన్ల నుంచి మళ్లీ నగదుకు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. తమ వాలెట్‌ను/ పీపీఐ అకౌంట్‌ను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవడంతో ఈ ప్ర​క్రియ పూర్తవుతుంది. రెసిడెన్షియల్‌ ప్రూఫ్‌ లాంటి మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ఈ ప్రక్రియలో అవసరం అవుతాయి.

ఫిబ్రవరి తర్వాత బ్యాలెన్స్‌తో కొనుగోళ్లు

ఫిబ్రవరి తర్వాత బ్యాలెన్స్‌తో కొనుగోళ్లు

ఆర్బీఐ, కేంద్రం తమ కేవైసీ వివరాలు కోరడంపై వాలెట్ల యూజర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజర్లు దీనిపై ఆందోళన చెందడానికి ఎలాంటి కారణం లేదని ఆర్బీఐ తెలిపింది. తుది గడువు వరకు కేవైసీ సంబంధిత వివరాలను పీపీఐ యూజర్లకు ఇవ్వకున్నా, కస్టమర్లు తమ నగదును కోల్పోరని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. ఇప్పటికీ కేవైసీ ఫార్మాలిటీలు పూర్తి చేయని వారికి ఫిబ్రవరి 28 తర్వాత కూడా తమ బ్యాలెన్స్‌ను కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చని/ పీపీఐ అకౌంట్‌ను క్లోజ్‌ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఈ బ్యాలెన్స్‌ నగదును మీ బ్యాంకు అకౌంట్లకు ట్రాన్సఫర్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

English summary
"When Nirav Modi left India, at that time it was reported that some hours prior to Prime Minister's announcement of demonetisation in 2016, Nirav Modi deposited 90 crore rupees of cash in one branch of PNB, and he probably exchanged it for bullion or something," Nationalist Congress Party (NCP) MP Majeed Memon told ANI, and added. " I think that there should be proper investigation to see if there is any element of truth to it."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X