వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్! ఇది పరివర్తన టైం: సిబ్బందికి పీఎన్బీ ఎండీ లేఖ.. దశ సూత్రాలతో పద నిర్దేశం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ వ్యవస్థను.. ఆ మాటకు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థను ఒక కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంతో బ్యాంకులు పరివర్తన బాట పడుతున్నాయి. అందునా బాధిత సంస్థ పీఎన్బీలోనే ఈ డ్రైవ్ మొదలైంది. దశమ సూత్రాల వ్యూహాంతో పీఎన్బీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా సిబ్బందికి మార్గ నిర్దేశం చేశారు. వీటిలో అంతర్గతంగా '3సీ' నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించాలని సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

బ్యాంకులో అంతర్గత వాటాదారులతో కలిసి పరస్పరం సహకారం, నిబద్ధతతో వ్యవహరిస్తూ సమాచార మార్పిడి (కమ్యూనికేషన్స్ వ్యవస్థ బలోపేతం)తో ముందడుగు వేయాలని పేర్కొన్నారు. దీనికి సునీల్ మెహతా స్వతంత్ర ప్రతిపత్తి గల 'మిషన్ పరివర్తన డివిజన్' ఏర్పాటు చేయాలని సంకల్పించారు.

 రుణ వసూళ్లు, వినూత్న నిఘాకు పీఎన్బీ ప్రాధాన్యం

రుణ వసూళ్లు, వినూత్న నిఘాకు పీఎన్బీ ప్రాధాన్యం

పరివర్తన వ్యూహంలో అత్యధికంగా లాభాలార్జన, ఆస్తుల నాణ్యత మెరుగుదల, రుణ వసూళ్లు, ఉత్పాదక పెంపుదల దిశగా వ్యూహం అమలు చేయాలని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా పేర్కొన్నారు. రిటైల్ బిజినెస్ వ్యవహారాలు, పొరపాట్లతోపాటు ఫిర్యాదుల తగ్గింపు ద్వారా వినూత్న నిఘా పద్ధతులను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు పరస్పరం కలివిడి, భాగస్వామ్య విధానం అనుసరిస్తూ ‘లీడ్ ది పరివర్తన్' పోర్టల్ స్రుష్టిస్తూ పరివర్తన ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ పరివర్తన దిశలో ప్రతి పీఎన్బీ ఉద్యోగి నుంచి స్రుజనాత్మక ఆలోచనలను, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు.

 పోటీ తత్వంతో ఖాతాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా పని చేయాలని పిలుపు

పోటీ తత్వంతో ఖాతాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా పని చేయాలని పిలుపు

ప్రతిపాదిత ‘మిషన్ పరివర్తన్ డివిజన్' పాలసీ ఇన్‌పుట్స్, విధుల నిర్వహణకు యాజమాన్య పద్దతుల విస్తరణకు వేదికను ఖరారుకు మార్గదర్శకత్వం వహిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు బ్యాంకు ప్రధాన కేంద్రంలోని వివిధ డివిజన్ల జోక్యాన్ని పెంపొందించడానికి అవసరమైన చర్యలు ప్రతిపాదిస్తుందని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా తన లేఖలో పేర్కొన్నారు. బ్యాంకులో మార్పు మాత్రమే నిరంతరంగా సాగే ప్రక్రియ అని తెలిపారు. సమర్థవంతమైన పనితీరుతో కూడిన వాతావరణం నెలకొల్పాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీని పరిగణనలోకి తీసుకుంటూ పోటీ తత్వంతో ఖాతాదారుల డిమాండ్లకు అనుగుణంగా పని చేయాలని తెలిపారు.

30 వేల స్టార్టప్ లతో నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు

30 వేల స్టార్టప్ లతో నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ రంగం)లో స్టార్టప్‌లకు మార్కెట్ కొరవడటంతోపాటు ఇతర కారణాలతో మణిపాల్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. గత ఆర్థిక సంవత్సరంలో స్టార్టప్‌లకు 13.65 బిలియన్ల మేరకు తాము నిధులు సమకూర్చామని అన్నారు. కానీ ఈ ఏడాది కేవలం 95 బిలియన్ డాలర్ల విలువ మాత్రమే స్రుష్టించగలిగారని చెప్పారు. భారతదేశంలో సుమారు 30 వేల స్టార్టప్‌ల్లో 3.5 నుంచి నాలుగు లక్షల మంది ఉద్యోగాలు పొందుతున్నారని మోహన్ దాస్ పాయ్ తెలిపారు.

2025 నాటికి 32 లక్షల మందికి స్టార్టప్‌ల్లో ఉపాధి

2025 నాటికి 32 లక్షల మందికి స్టార్టప్‌ల్లో ఉపాధి

ప్రతియేటా ఐదు వేల నుంచి ఆరు వేల వెంచర్లలో పాల్గొంటున్నారని మోహన్ దాస్ పాయ్‌కు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2025 నాటికి లక్ష స్టార్టప్‌లు సుమారు 32 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయన్నారు. అయితే అన్ని స్టార్టప్‌లకు ఉజ్వల భవిష్యత్ ఉన్నదని తెలిపారు. ఫ్లిప్ కార్ట్ తదితర సంస్థల్లో అత్యధిక మందికి ఉపాధి లభిస్తున్నదని మోహన్ దాస్ పాయ్ చెప్పారు. తొలిదశ పారిశ్రామికవేత్తలు మాత్రమే మార్కెట్ లో దూసుకెళ్లలేకపోయారని వివరించారు. వారికి బిజినెస్ లావాదేవీల నిర్వహణ తెలియక ఇబ్బందుల పాలయ్యారని చెప్పారు.

ఇళ్ల కొనుగోలు దారులకు సకాలంలో ప్లాట్లు కేటాయించలేక పోయిన జేపీ ఇన్ ఫ్రాటెక్

ఇళ్ల కొనుగోలు దారులకు సకాలంలో ప్లాట్లు కేటాయించలేక పోయిన జేపీ ఇన్ ఫ్రాటెక్

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ మాతృసంస్థ జేపీ అసోసియేట్స్‌ రూ.200కోట్లు డిపాజిట్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గృహనిర్మాణ ప్రాజెక్టులో ఫ్లాట్ల కొనుగోలుకు డబ్బులు చెల్లించిన వారికి ఇళ్లు కట్టించనందున వారికి తిరిగి చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. రెండు దఫాలుగా ఈ రూ.200కోట్లు చెల్లించాలని సూచించింది. వచ్చేనెల 15, మే 10 తేదీల్లో కోర్టు రిజిస్ట్రీలో ఈ డిపాజిట్లు చేయాల్సిందిగా పేర్కొంది. ఈ కేసు విషయంలో డెవలపర్లు లేవనెత్తిన డిమాండ్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది ఇళ్ల కొనుగోలుదారులు నిధులు వాపసు కోరుతున్నారనే దానికి సంబంధించిన పూర్తి జాబితాను న్యాయస్థానానికి అందజేయాలని జేపీ ఇన్‌ఫ్రాకు సుప్రీంకోర్టు సూచించింది.

 తమ డబ్బు వాపస్ చేయాలని సుప్రీంలో కొనుగోలు దారుల పిటిషన్లు

తమ డబ్బు వాపస్ చేయాలని సుప్రీంలో కొనుగోలు దారుల పిటిషన్లు

జేపీ ఇన్ ఫ్రాటెక్, ప్లాట్ల కొనుగోలు దారులకు సంబంధించిన కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 16కు వాయిదా వేసింది. జేపీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కింద ఇళ్లను కట్టిస్తామని చెప్పి సరైన సమయానికి వాటిని అప్పగించకపోవడంతో కొనుగోలు దారులు తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జేఏఎల్‌(జై ప్రకాశ్‌ అసోసియేట్‌ లిమిటెడ్)ను రూ.2000కోట్లు జమ చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అనంతరం విడతలుగా ఈ మొత్తాన్ని జమ చేసేందుకు అంగీకరించింది. మరోవైపు మొత్తం కొనుగోలుదార్లలో 8శాతం మంది మాత్రమే నిధులు వాపసు కోరుతున్నారని జేపీ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.

English summary
New Delhi: Hit hard by Nirav Modi fraud, Punjab National Bank (PNB) has embarked on Mission Parivartan, a 10-pronged transformation strategy to strengthen one of the oldest public sector banks (PSBs) on all counts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X