వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: లైవ్ వీడియో కాల్ ఫీచర్ ప్రారంభించనున్న జియో

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత జియో ఇంటరాక్ట్‌ వేదికను ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించింది.

ఈ వేదికలో ఎన్నో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటగా 'లైవ్‌ వీడియో కాల్‌ ఫీచర్‌'ను ప్రారంభించబోతోంది. ఈ ఫీచర్‌తో భారతీయ సినీ దిగ్గజాలతో నేరుగా మాట్లాడిన అనుభూతిని ప్రేక్షకులు పొందవచ్చు.

దానిలో భాగంగానే బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ త్వరలో ప్రారంభించబోయే '102 నాటౌట్‌' కామెడీ షోని ఈ లైవ్‌ వీడియో కాల్‌ ఫీచర్‌తో ప్రేక్షకులకు జియో అందించనుంది.

ఇప్పటికే 186 మిలియన్ల సబ్‌స్కై‍బర్లు, 150 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగ దారులతో భారతీయ టెలికాం రంగంలో జియో విశిష్టమైన స్థానంలో నిలిచింది.

Now video call with Amitabh Bachchan on Reliance Jio’s AI-based JioInteract

తాజాగా ప్రారంభమయ్యే జియో ఇంటరాక్ట్‌ సేవలతో దేశంలోని మూవీ ప్రమోషన్‌ సేవల్లో అగ్రగామిగా జియో అవతరించనుంది. కొద్ది రోజుల్లోనే వీడియో కాల్‌ సెంటర్లు, వీడియో కేటలాగ్‌, వర్చువల్‌ షో రూమ్లు ప్రవేశ పెట్టి వినియోగదారులకు తమ సేవలు అందిస్తామని జియో తెలిపింది.

జియో ఇంటరాక్ట్‌లో మొదటి సర్వీస్‌గా లైవ్‌ వీడియో కాల్‌ నిలవనుంది. జియో కస్టమర్లు ఈ ఫీచర్‌తో మే 4న బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన అనుభూతి పొందొచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా 'మై జియో అప్లికేషన్‌'ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. ఆప్‌ డౌన్‌లోడ్‌ తర్వాత జియో ఇంటరాక్ట్‌పై క్లిక్‌ చేసి.. స్టార్ట్‌ వీడియో కాల్‌పై నొక్కితే చాలు అమితాబ్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన అనుభూతి పొందొచ్చు.

English summary
Reliance Jio has announced the launch of JioInteract, which is the company’s Artificial Intelligence (AI) based brand engagement platform. Jio will launch its Live Video Call service on the platform, allowing users to video call with their favourite celebrities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X