వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాటాగ్రూప్ చైర్మన్‌గా ‘చంద్ర’ సంఘటితం.. చాకచక్యంగా సవాళ్ల పరిష్కారం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: ఎన్ చంద్రశేఖరన్ అంటే ఏడాది క్రితం వరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓగానే అందరికీ తెలుసు. కానీ సరిగ్గా ఏడాది క్రితం 2017 ఫిబ్రవరి 21న టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్‌ను అందరూ 'చంద్ర' అంటారు. టాటా గ్రూపు అధిపతి అయిన మూడో టాటాయేతర వ్యక్తి. అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సింహాసనాన్ని అధిష్ఠించిన అసామాన్యుడు. 2106 అక్టోబర్ 24వ తేదీన సైరస్‌ మిస్త్రీని బలవంతంగా ఛైర్మన్‌ కుర్చీ నుంచి దించేశాక, ఆ స్థానానికి సమర్థులు ఎవరా అని రతన్‌ టాటా ఆలోచించారు.
అప్పుడు గ్రూపు కంపెనీలన్నిటిలోనూ తలమానికమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)ను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే కాదు.. గ్రూపు ఆదాయాల్లో ఎక్కువ భాగాన్ని అందించిన 'చంద్ర'నే సరైన వ్యక్తిగా భావించారు. ఏడాది సమయం అనేది 150 ఏళ్ల చరిత్ర గల టాటా గ్రూప్‌ విషయానికొస్తే చాలా చిన్నదే. ఈ సమయంలోనే పరిస్థితులేమీ అకస్మాత్‌గా మారిపోవు.

టాటా గ్రూపులో ఆర్థిక క్రమశిక్షణకు ఇలా ప్రాధాన్యం

టాటా గ్రూపులో ఆర్థిక క్రమశిక్షణకు ఇలా ప్రాధాన్యం

కానీ టాటా గ్రూప్ సంస్థల్లో ఒక్కో సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఒక్కొక్క సమస్యనూ పరిష్కరించుకుంటూ వెళ్లడంలో చంద్రశేఖరన్‌ ‘మార్క్' కనిపిస్తోంది. అన్నింటికీ మించి.. అందరినీ కలుపుకుని పోయే ఆయన మనస్తత్వం మంచే చేసింది. మార్కెట్‌ పరిస్థితులూ అందుకు కలిసివచ్చాయి. సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ అలవర్చడంలో కీలకంగా వ్యవహరించారు.

వాటాల క్రాస్ హోల్డింగ్స్‌లో సమస్యలు పరిష్కారం

వాటాల క్రాస్ హోల్డింగ్స్‌లో సమస్యలు పరిష్కారం

గత ఏడాది కాలంలో అంతర్జాతీయ ఉక్కు పరిశ్రమ, దేశీయ ప్రయాణికుల కార్ల పరిశ్రమను గాడిలో పెట్టగలమన్న సంకేతాలు ఇచ్చారు. ఆయా నిబంధనలను సరళతరం చేసి నమోదిత గ్రూపు కంపెనీల్లో క్రాస్‌-హోల్డింగ్‌ (ఒక కంపెనీలో ఒకదానికి వాటా.. అందులో మరో దానికి వాటా.. అలా) పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. గ్రూప్ సంస్థల్లో లాభాలు రాని అప్రాధాన్య ఆస్తులను విక్రయించారు.

వారంలోపే డొకొమొతో వివాదం పరిష్కారం ఇలా

వారంలోపే డొకొమొతో వివాదం పరిష్కారం ఇలా

టాటా గ్రూపును లాభదాయకత వైపు నడిపించడంతోపాటు ఆర్థికంగా, పారిశ్రామికంగా స్థిరీకరణను తేవడమే ప్రధాన అజెండాగా నడిచారు. టాటా గ్రూపు కంపెనీల్లోకి కొత్త రక్తాన్ని ఎక్కించడంతోపాటు ఆయా సంస్థల్లో నెలకొన్న వివాదాల పరిష్కారం దిశగా అడుగులేశారు. 2017 ఫిబ్రవరి 21న టాటా గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్ర.. టాటా టెలీసర్వీసెస్‌కు, జపాన్‌కు చెందిన టెలికం సంస్థ డొకొమొ మధ్య అదే నెల 28వ తేదీన పరిష్కరించారు.

టెలీ సర్వీసెస్ రుణ బకాయిలు చెల్లింపులు ఇలా

టెలీ సర్వీసెస్ రుణ బకాయిలు చెల్లింపులు ఇలా

ఇక టాటా టెలీసర్వీసెస్‌లోని మొబైల్‌ వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించారు. రిలయన్స్ జియో రంగ ప్రవేశం తర్వాత టాటా టెలీ సర్వీసెస్ వంటి చిన్న సంస్థతో లాభాలు రావన్న ముందుచూపుతో దాన్ని 2017 అక్టోబర్ 12వ తేదీన భారతీ ఎయిర్ టెల్ కు విక్రయించేశారు. అంతే కాదు టాటా గ్రూపు నుంచి నిధుల సమకూర్చడంతో బ్యాంకులో తీసుకున్న 17 వేల కోట్ల రుపాయల రుణాన్ని కూడా టాటా టెలీ సర్వీసెస్ తీర్చేయడం గమనార్హం.

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జేఎల్ఆర్‌కు లాభాలు

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జేఎల్ఆర్‌కు లాభాలు

2017 సెప్టెంబర్ 20వ తేదీన టాటా స్టీల్‌కు చెందిన ఐరోపా ఆస్తులను జర్మనీకి చెందిన థైసన్‌క్రప్‌ సంయుక్త సంస్థకు బదిలీ చేశారు. టాటా టెలీ సర్వీసెస్ వివాదం పరిష్కారంతో దేశీయ కార్యకలాపాల్లో టాటా మోటార్స్‌ పుంజుకునే విషయమై స్వీయ పర్యవేక్షణతో ప్రగతి సాధించారు. ఏడాది కాలం తర్వాత టాటా గ్రూప్‌ షేర్లు గ్రూప్‌కు మంచి విలువే చేకూర్చాయి. కానీ టాటా మోటార్స్‌ మాత్రం మార్కెట్‌ విలువలో 28 శాతాన్ని కోల్పోయింది. జాగ్వార్‌ లాండ్‌ రోవర్ ‌(జేఎల్‌ఆర్‌) విభాగం స్తబ్దుగా ఉండడం ఇందుకు నేపథ్యం. కీలక మార్కెట్లలో బలహీన గిరాకీ ఉండడంతో ఏడేళ్లుగా ఈ విభాగం లాభాలను కోల్పోతూ వస్తోంది. గమ్మత్తుగా గత డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంఘటితమై రూ. 1212 కోట్ల లాభాలార్జించింది. వరుసగా ఐదు త్రైమాసికాల్లో నష్టాలు చవి చూసిన దేశీయ మార్కెట్‌లో రూ. 183 కోట్లు లాభం సంపాదించడం ఆసక్తికర పరిణామం. ఆదాయ రూపేణా కూడా టాటామోటార్స్ తన రెవెన్యూను 15 శాతం పెంచుకున్నది.

ఇలా గ్రూపు సంస్థల అధికారుల్లో నియామకాలు ఇలా

ఇలా గ్రూపు సంస్థల అధికారుల్లో నియామకాలు ఇలా

అన్నిటి కంటే మించి 100కు పైగా ఉన్న గ్రూపు కంపెనీలను సరళీకరించడం కోసం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకొచ్చి, క్రాస్‌-హోల్డింగ్స్‌ను తగ్గించారు. గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్(సీఎఫ్‌ఓ)గా సౌరభ్‌ అగర్వాల్‌ను, గ్రూప్‌ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌గా ఆర్తి సుబ్రమణియన్‌ను నియమించారు. ఇంకా పలు కంపెనీల సీఈఓ, సీఎఫ్‌ఓల స్థానాలను యువతతో భర్తీ చేశారు. కొంత మంది ఉన్నత స్థాయి అధికారులు నిష్క్రమించడం ఇందుకు నేపథ్యం.

భారతీ స్టీల్ కొనుగోలుకు ఇలా టెండర్ల దాఖలు

భారతీ స్టీల్ కొనుగోలుకు ఇలా టెండర్ల దాఖలు

యూరప్ దేశాల్లోని గ్రూపు సంస్థలను దారి తేవడానికి టాటా స్టీల్స్ బాల్సెన్స్ షీట్ చక్కదిద్దడంపై ద్రుష్టి పెట్టారు. దేశీయంగా కూడా టాటా స్టీల్స్ కార్యకలాపాల నిర్వహణలో బలోపేతం దిశగా ప్రయాణిస్తున్నది. తాజాగా రూ.36 వేల కోట్ల విలువ గల భూషణ్‌ స్టీల్ కొనుగోలు దాదాపు ఖాయమైంది. భిల్లీకి చెందిన ఈ కంపెనీ కోసం అత్యధిక బిడ్‌ను వేసిన సంస్థ టాటా స్టీల్‌యే. భరత్ భూషణ్ స్టీల్, భరత్ భూషణ్ పవర్ సంస్థలు దివాలా దిశగా పయనిస్తుండటంతో రెండు సంస్థలలో పాగా వేసేందుకు బిడ్లు దాఖలు చేసింది టాటా మోటార్స్.

ఏఐ జాతీయకరణకు ముందు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే నిర్వహణ

ఏఐ జాతీయకరణకు ముందు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే నిర్వహణ

ఎయిరిండియాలో ప్రభుత్వం తన వాటా తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఎయిరిండియా కొనుగోలుపై దృష్టి సారిస్తామని చంద్రశేఖరన్ చెప్పారు. ఒకప్పుడు భారత విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని విఫలయత్నం చేసిన టాటా గ్రూప్‌ తన కలను నిజం చేసుకుంటుందేమో చూడాలి. అది కూడా చంద్ర నేతృత్వంలో టాటా గ్రూప్ విమానయాన రంగంలో జరుగుతుందా? లేదా? అన్నది కాలమే సమాదానం చెబుతుంది. ఇంతకుముందు ఎయిర్ ఆసియా తదితర సంస్థల్లో రతన్ టాటా వాటాలు పెట్టారు కూడా. ఆ మాటకు వస్తే ప్రస్తుత ఎయిర్ ఇండియా సంస్థ జాతీయకరణకు ముందు టాటాల ఆధ్వర్యంలోనే నడిచింది సుమా.

9.6 లక్షల కోట్లకు చేరిన టాటా సన్స్ మార్కెట్ క్యాప్

9.6 లక్షల కోట్లకు చేరిన టాటా సన్స్ మార్కెట్ క్యాప్

చంద్ర నాయకత్వంలో చాలా వరకు టాటా కంపెనీలు మార్కెట్‌లోని ప్రామాణిక సూచీల కంటే మిన్నగా రాణించాయి. మొత్తం నమోదిత 27 టాటా కంపెనీల మార్కెట్‌ విలువ ఫిబ్రవరి 21, 2017 నుంచి 14 శాతం పెరిగి రూ.9.6 లక్షల కోట్లకు చేరింది. టీసీఎస్‌, టాటా మోటార్స్‌లను పరిగణనలోకి తీసుకోకపోతే గ్రూప్‌ మార్కెట్‌ విలువ 40.5 శాతం పెరిగినట్లవుతుంది. టాటా స్టీల్స్ వాటా 53 శాతం, టైటాన్ 76, ఇండియన్ హోటల్స్ 33, గ్లోబల్ బేవరేజెస్ 89, వోల్టాస్ 59, ట్రెంట్ 28 శాతం, టాటా ఎలిక్సి 32 శాతం పురోగతి సాధించింది.

ఇలా ప్రధాన సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇలా

ఇలా ప్రధాన సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇలా

కానీ రతన్ టాటా అంచనాలకు అనుగుణంగా చంద్రశేఖరన్ 100కి పైగా కంపెనీలు ఉన్న టాటా గ్రూపును ఏడెనిమిది సెక్టార్లుగా విభజించారు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను స్వతంత్ర క్లస్టర్‌గా గుర్తించారు. టాటా ఏరోస్పేస్, డిపెన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్సియల్ సర్వీసెస్, టాటా కేపిటల్ తదితర గ్రూపులుగా మార్చారు. టాటామోటార్స్ ఆధ్వర్యంలో విద్యుత్ వాహానాల ఉత్పత్తి దిశగా కాలుష్య నియంత్రణ వైపు అడుగులేస్తున్నది. మరోవైపు స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుల్లో చేరుతున్నది. జంషెడ్ పూర్ టౌన్ షిప్ ను టాటా గ్రూప్ స్వయంగా నిర్వహిస్తోంది.

English summary
Twelve months may be a short time in the life of a 150-year-old conglomerate, but there has hardly been a dull day since N Chandrasekaran took charge as chairman of Tata Sons, the group’s holding company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X