వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 ఏళ్ళలో బ్యాంకుల్లో రూ.1 లక్ష కోట్లు ఆవిరి: ఆర్‌బిఐ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో అవతకలు, మోసాల కారణంగా గత ఐదేళ్ళలో సుమారు రూ. 1 లక్ష కోట్ల మేరకు ప్రజా ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళిందని ఆర్‌బిఐ అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు ఉడాయిస్తున్న ఘటనలను వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.

బ్యాంకుల్లో ఏప్రిల్‌ 2017 నుంచి మార్చి 2018 వరకూ అవకతవకల కేసులు 5152 కేసులకు పెరిగాయని ఆర్‌టీఐ కింద కోరిన సమాచారానికి బదులిస్తూ ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ కేసుల్లో రూ 28,459 కోట్లు చిక్కుకున్నాయని పేర్కొంది.

Over 23,000 bank frauds worth Rs 1 lakh crore reported in 5 years: RBI

ఇక 2016-17లో రూ 23,933 కోట్ల విలువైన 5976 అక్రమాల కేసులు బ్యాంకింగ్‌ రంగంలో నమోదయ్యాయని తెలిపింది. గత ఐదేళ్లలో మొత్తం లక్షా718 కోట్ల మేర ధనం 23,866 అక్రమార్కుల అవకతవకల ఫలితంగా ఆవిరైందని ఆర్‌బీఐ వెల్లడించింది.

ఈ కేసులను సమగ్రంగా పరిశీలించి కేసుల వారీగా వాస్తవాలను క్రోడీకరిస్తూ చర్యలు చేపడుతున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు భారీ రుణాల ఎగవేత కేసులు పేరుకుపోతున్న క్రమంలో ఆర్‌బీఐ వెల్లడించన గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

English summary
Over 23,000 cases of fraud involving a whopping Rs 1 lakh crore have been reported in the past five years in various banks, according to the Reserve Bank of India (RBI).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X