వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘సేవల’తో భారత్‌కు ముప్పు.. కృత్రిమ మేధను నమ్ముకోవద్దన్న నోబెల్‌ విజేత క్రూగ్‌మెన్‌

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సేవల రంగాన్నే నమ్ముకుంటే భారత ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు తప్పదని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత పాల్‌ క్రుగ్‌మన్‌ హెచ్చరించారు. కృత్రిమ మేధ (ఎఐ) టెక్నాలజీతో భారత సేవల రంగంలో కొలువులు క్షీణించి, మున్ముందు భారీగా నిరుద్యోగ సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. 'న్యూస్ 18' నిర్వహించిన 'రైజింగ్ ఇండియా' సదస్సులో క్రూగ్‌మన్‌ ఈ హెచ్చరిక చేశారు. ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం పాత్రను పెంచుకోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు.
'కొత్తగా వినిపిస్తున్న కృత్రిమ మేధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్‌లో వ్యాధి నిర్దారణ పరీక్షలను ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భారత్‌లోని డాక్టర్లతోపాటు కృత్రిమ మేధ ఆధారిత కంపెనీల నుంచి కూడా పొందే అవకాశం ఉంది. అదే జరిగితే భారత సేవల రంగం ఆందోళన చెందక తప్పదు' అన్నారు.

30 ఏళ్లలోనే బ్రిటన్‌తో సమానంగా భారత్ ప్రగతి

30 ఏళ్లలోనే బ్రిటన్‌తో సమానంగా భారత్ ప్రగతి

భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత పనితీరును కనబరుస్తూ వేగంగా ముందుకు సాగుతున్నా, దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఇంకా ఒక పెద్ద సమస్యగానే మిగిలిపోతోందని అన్నారు. గత 30 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ మేటిగా రాణిస్తూ ఎంతో పురోగమించిందని వివరించారు. బ్రిటన్‌ 150 ఏళ్లలో సాధించినంత ప్రగతిని.. భారత్‌ గత మూడు దశాబ్ధాల్లోనే సాధించి చూపిందన్నారు. భారత్‌లో ఆర్థిక పరివర్తన చాలా వేగంగా జరుగుతూ వస్తోందని తెలిపారు. ఇక్కడ పెదరికం తాడవిస్తుండడం శోచనీయమని ఆయన వివరించారు. ఇందుకు ప్రధాన కారణంగా దేశంలో గణనీయంగా సంపద సృష్టి జరగుతున్నా.. ఆది సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానంగా పంపిణీ జరగకపోవడమే ఇందుకు కారణమన్నారు.

సకాలంలోనే భారత్‌లో ఆర్థిక సంస్కరణలు

సకాలంలోనే భారత్‌లో ఆర్థిక సంస్కరణలు

భారత్‌లో ఆధికారిక అడ్డంకులు కాస్త తగ్గి ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తున్నా, ఆర్థిక అసమానతలు పూర్తిగా సమిసిపోలేదని పాల్ క్రూగ్‌మెన్ అన్నారు. భారత్‌లో వినిమయ శక్తి అంతకంతకు పెరుగుతోందని.. ఫలితంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూ పోతోందన్నారు. ఇప్పటికే భారత జపాన్‌ ఆర్థిక వ్యవస్థను దాటేసి అమెరికా, చైనా సరసన నిలిచిందన్నారు. ఐరోపా దేశాల్లోని ఆర్థిక వ్యవస్థ కంటే భారత్‌ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు. సరైన సమయంలో భారత్‌లో సంస్కరణలు చేపట్టడం, పరిస్థితులకు అనుగుణంగా భారత్‌ అవకాశాలను చేజిక్కించుకోవడం వల్లే భారత్‌ నేడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సరసన చేరిందని, కానీ భారత్‌లో అవినీతి ఇంకా సమస్యగానే ఉందని ఆయన వివరించారు.

గ్లోబలైజేషన్ భారత్‌లో అదే దూకుడు

గ్లోబలైజేషన్ భారత్‌లో అదే దూకుడు

భారత్‌లో వ్యాపార అనుకూల వాతావరణం తేవడంతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పాల్‌ అన్నారు. సేవల ప్రపంచీకరణ నుంచి లబ్దిపొందే విషయంలో భారత్‌ ముందంజలో ఉందని వివరించారు. సేవల రంగం దన్నుతో ఆర్థిక వ్యవస్థ ఇంత మెరుగైన పనితీరును కనబరచడం ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదని ఆయన తెలిపారు. గ్లోబలైజేషన్‌ తరువాత క్రమంలో కూడా భారత్‌ ఇదే దూకుడుతో ముందుకు సాగే అవకాశం ఉందని అన్నారు.

పాలకులు అప్రమత్తంగా ఉండాలని పాల్ క్రూగ్‌మెన్

పాలకులు అప్రమత్తంగా ఉండాలని పాల్ క్రూగ్‌మెన్


భారత ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ దేశాలకంటే మేటిగా రాణిస్తూ ముందుకు సాగుతున్నా దేశంలో తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విషయంలో అశ్రద్ధ తగదని పాల్‌క్రూగ్‌మెన్‌ హెచ్చరించారు. ఎంతో మేటి వృద్ధిని అంచనా వేస్తున్నా తగిన ఉద్యోగ, ఉపాధికల్పన లేకుంటే స్థిరమైన వృద్ధి సాధించడం కష్టమేనని ఆయన అన్నారు. ఉద్యోగ కల్పన లేనిది ఎంత వృద్ధి సాధించినా అది ఎక్కవ కాలం నిలవజాలదని ఆయన విశ్లేషించారు. కావున విధాన నిర్ణేతలు, పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని పాల్‌క్రూగ్‌మెన్‌ సూచించారు.

చైనాలోనూ అదే పరిస్థితి నెలకొన్నదని పాల్‌క్రూగ్‌మెన్‌ ఆందోళన

చైనాలోనూ అదే పరిస్థితి నెలకొన్నదని పాల్‌క్రూగ్‌మెన్‌ ఆందోళన

పని చేసే జనాభా తగ్గిపోవడం వల్లనే జపాన్‌ ‘ఆర్థిక సూపర్‌ పవర్‌' హోదాను కోల్పోయిందని పాల్ క్రుగ్‌మన్‌ స్పష్టం చేశారు. చైనాదీ ప్రస్తుతం అదే పరిస్థితి అన్నారు. సేవల రంగంతో పాటు, తయారీ రంగంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా ఆసియాలో ఈ విషయంలో భారత్‌ నాయకత్వ బాధ్యత తీసుకోవాలని కోరారు. లేకపోతే పెరిగే జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించడం భారత్‌కు కత్తిమీద సాములా మారుతుందని హెచ్చరించారు.

మలిదశ ప్రపంచీకరణలో భారత్ కీలక పాత్ర

మలిదశ ప్రపంచీకరణలో భారత్ కీలక పాత్ర

అత్యధిక స్థాయిలో పని చేసే జనాభా ఉన్న భారత్‌ మలి దశ ప్రపంచీకరణలోనూ కీలక పాత్ర పోషిస్తుందని క్రూగ్‌మన్‌ చెప్పారు. ‘భారత అభివృద్ధి కథ చాలా ప్రత్యేకమైంది. సేవల రంగం ఇక్కడ అభివృద్ధిని ముందుకు నెడుతోంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించదు. సేవల ప్రపంచీకరణ ఇప్పుడే ప్రారంభమైంది. దీనికి భారీ వాణిజ్య అవకాశాలు ఉన్నాయి. భారత్‌ మరింత అభివృద్ధి చెందుతుందనేందుకు అది కూడా ఒక కారణం. జపాన్‌, ఇటలీ, చైనా వంటి దేశాలకు ఈ సౌలభ్యం లేదన్నారు. చాలినంత మంది పని చేసే జనాభా లేక ఈ దేశాల ఆర్థికాభివృద్ధి నీరసిస్తోందన్నారు.

స్వల్పకాలంలో తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుదల

స్వల్పకాలంలో తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుదల

ఆర్థిక రంగంలో భారత్‌ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని క్రుగ్‌మన్‌ చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రారంభమైతే భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా దూసుకు పోతుందన్నారు. దేశంలో అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రధాని మోదీ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం అవుతుందన్నారు. స్వల్ప కాలంలోనే భారత్‌లో తలసరి ఆదాయం నాలుగింతలు పెరగడం మామూలు విషయం కాదన్నారు. ప్రపంచ ఆర్థికవేత్తలందరి దృష్టి చైనా మీద ఉండడంతో, భారత అధిక ఆర్థికాభివృద్ధి పెద్దగా అందరి దృష్టికి రావడం లేదన్నారు.

పెరుగుతున్న ఇంటర్నెట్ మోసాల సంఖ్య

పెరుగుతున్న ఇంటర్నెట్ మోసాల సంఖ్య

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో క్రెడిట్‌/డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ మోసాల సంఖ్య కూడా పెరుగుతుండటం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ మోసాల సంఖ్య 1,785గా ఉంది. వీటి వల్ల జరిగిన ఆర్థిక నష్టం 71.48 కోట్ల రూపాయలను తాకింది. రూ. లక్ష, అంతకు మించి నష్టపోయినప్పుడు వాటి నమోదు జరిగింది. కానీ అంతకన్నా తక్కువగా మోసాలు జరిగినా వాటి గురించి ఫిర్యాదు చేయని వారి సంఖ్య అధికంగానే ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

రూ.33.73 కోట్లకు చేరిన మోసాలు

రూ.33.73 కోట్లకు చేరిన మోసాలు

డెబిట్, క్రెడిట్ కార్డులతో గత డిసెంబర్ నెలలో 187 మోసాలతో వాటిల్లిన నష్టం రూ. 33.73 కోట్లకు చేరుకున్నది. ఆర్బీఐ వెబ్‌సైట్‌లోని గణాంకాల ప్రకారం.. డిసెంబర్‌లో ఎటిఎంలు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (వీఔఎస్‌) టెర్మినళ్ల ద్వారా కార్డులను వినియోగించి చేసిన లావాదేవీల విలువ రూ.3,46,997 కోట్లు ఉంది. ఇందులో మోసాలతో నష్ట పోయింది 0.0009 శాతంగా ఉంది. కాగా ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో రిస్క్‌లను తగ్గించేందుకు ఆర్బీఐ తగినన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వం చెబుతోంది.

English summary
Nobel Laureate Paul Krugman has praised India's economic growth saying the country made rapid economic progress during the last 30 years but warned lack of jobs and slowing manufacturing sector could derail the growth story of the world's fastest growing economy. In Q3 of the current fiscal, India regained the world's fastest growing major economy tag with the GDP at 7.2 per cent, compared to China's 6.8 per cent. The GDP figure for the December quarter beat estimates in the range of 6.5 to 6.9 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X