• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నియంత్రణా వ్యవస్థ ప్లస్ ఆర్బీఐ వైఫల్యం వల్లే పీఎన్బీ ఫ్రాడ్: ఐసీఏఐ

By Swetha Basvababu
|

హైదరాబాద్‌: బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం, నియంత్రణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ)లో జరిగిన మోసం జరిగిందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) పేర్కొంది.

పీఎన్బీ మోసానికి కారణం చార్టర్డ్‌ అకౌంటెంట్ల (సీఏ) వైఫల్యమని పేర్కొనడం సరికాదని ఐసీఏఐ మాజీ ప్రెసిడెంట్‌ ఎం. దేవరాజారెడ్డి తెలిపారు.

ఇదే విషయాన్ని ఆర్థిక శాఖ, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళతామని ఆయన చెప్పారు. సీఏలు ఆడిట్‌ విధులను మాత్రమే నిర్వహిస్తారని, నగదు పుస్తకం, లెడ్జర్‌లో సమాచారం అకౌంటింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? లేదా? అని మాత్రమే పరిశీలిస్తారని తెలిపారు.

ఐసీఏఐ, ఆడిటర్లకు పరిమిత అధికారాలు

ఐసీఏఐ, ఆడిటర్లకు పరిమిత అధికారాలు

ఆడిటింగ్‌, పరిశోధన (ఇన్వెస్టిగేషన్‌)కు తేడా ఉందని, పరిశోధనకు ఒక అధికారం ఉంటుందని, అటువంటి అధికారం ఐసీఏఐకి, అడిటర్లకు లేదని అభిప్రాయపడ్డారు. బ్యాంకు ఆడిట్‌పై సీఏలకు అవగాహన కల్పించడానికి ఐసీఏఐ అనుబంధ దక్షిణ భారత ప్రాంతీయ కౌన్సిల్‌ (సిర్క్‌) హైదరాబాద్‌ శాఖ సెమినార్‌ను నిర్వహించింది. ఈ సెమినార్‌లో ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు ఎం దేవరాజారెడ్డి మాట్లాడుతూ పీఎన్బీ కుంభకోణంపై ఐసీఏఐను, ఆడిటర్లను తప్పు పట్టడం సరికాదన్నారు.

100 శాతం బ్యాంకు పత్రాల పరిశీలన అసాధ్యమన్న సిర్క్

100 శాతం బ్యాంకు పత్రాల పరిశీలన అసాధ్యమన్న సిర్క్

బ్యాంకులో ఉద్యోగులు మోసపూరితంగా వ్యవహరించినందు వల్లే మోసాన్ని గుర్తించడంలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్ర చాలా పరిమితమని దక్షిణ భారత ప్రాంతీయ కౌన్సిల్‌ (సిర్క్‌) ఛైర్మన్‌ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. సీఏలు ఆర్థిక సలహాదారులు మాత్రమేనని, అన్ని పత్రాలను 100 శాతం పరిశీలించడం అసాధ్యమని, అందుకు తగిన సమయం ఉండదని అన్నారు. ఇటువంటి మోసాలను ఎప్పటికప్పుడు పసికట్టాల్సింది ఆయా బ్యాంకుల్లోని వ్యవస్థలేనని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కూడా తనిఖీలు చేయాల్సి ఉందన్నారు.

ఒకరిద్దరి తప్పులను అందరినీ తప్పుబట్టొద్దన్న ఐసీఏఐ

ఒకరిద్దరి తప్పులను అందరినీ తప్పుబట్టొద్దన్న ఐసీఏఐ

బ్యాంకు అధికారులు, వ్యాపారులు ఏకమై అవకతవకలు చేస్తే అవి ఆడిటింగ్‌లో బయటపడవని అన్నారు. ఆర్థిక మంత్రి కూడా చార్టర్డ్‌ అకౌంటెంట్లు విఫలమయ్యారని అనడం సరికాదని సిర్క్ చైర్మన్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు అన్నారు. ఒకరు, ఇద్దరు తప్పు చేస్తే.. అందరికీ దాన్ని అన్వయించరాదని, ఎంతో బాధ్యతతో సీఏలు తమ విధులను నిర్వహిస్తున్నారని చెప్పారు. రుణాలు ఇవ్వడానికి అర్హత లేదని ఆడిటర్లు సూచించినా, బ్యాంకులు కొంత మందికి రుణాలు ఇస్తున్నాయని వివరించారు. వివిధ అంశాల్లో సీఏలకు అవగాహన పెంచడానికి సిర్క్‌ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు.

ఐసీఏఐ సమీక్షా బోర్డును బలోపేతం చేస్తేనే బెస్ట్

ఐసీఏఐ సమీక్షా బోర్డును బలోపేతం చేస్తేనే బెస్ట్

నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (నెఫ్రా) ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం హడావుడిగా ఇటీవల ఆమోదం తెలిపిందని, దీని ద్వారా ఇటువంటి మోసాలను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోందని ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు దేవరాజా రెడ్డి అన్నారు. ఇది సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఐసీఏఐ చట్టం ప్రకారం కౌన్సిల్‌లో ఎనిమిది మంది ప్రభుత్వ నామినీలు ఉండాలని, వీరిని నియమించడంతోపాటు ఐసీఏఐలోని నాణ్యత సమీక్ష బోర్డును బలోపేతం చేస్తే, పరిస్థితులు మెరుగు పడతాయని అన్నారు. ఆడిటర్లు కూడా సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకింగ్‌ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలని, పత్రాలను పరిశీలించకుండా సంతకాలు చేయరాదని ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు దేవరాజా రెడ్డి తెలిపారు.

సాయి లైఫ్‌లో టాటా క్యాపిటల్ 35 శాతం వాటా

సాయి లైఫ్‌లో టాటా క్యాపిటల్ 35 శాతం వాటా

టాటా గ్రూపు అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్‌.. హైదరాబాద్‌ సంస్థ సాయి లైఫ్‌ సైన్సెస్‌ నుంచి వైదొలగాలనుకుంటోంది. సాయి లైఫ్‌ సైన్సెస్‌లో టాటా క్యాపిటల్‌కు 35 శాతం వాటా ఉంది. మొత్తం వాటాను ఇతరులకు విక్రయించాలనుకుంటోంది. ఈ వాటాను దక్కించుకునేందుకు జనరల్‌ అట్లాంటిక్‌, వార్‌బర్గ్‌ పిన్‌కస్‌, అపాక్స్‌ పార్ట్‌నర్స్‌, టెమాసెక్‌, ట్రూ నార్త్‌ వంటి పలు ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్లు పోటీపడుతున్నట్లు సమాచారం. టాటా క్యాపిటల్‌ పోర్ట్‌ఫోలియో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కంపెనీల్లో సాయి లైఫ్‌ ఒకటి. ఇన్నోవేటర్‌ ఫార్మా కంపెనీలకు ఈ సంస్థ కాంట్రాక్టు డెవలప్ మెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ సేవలందిస్తోంది.

30 - 40 శాతం తగ్గిన టెల్కో ఫీజులు

30 - 40 శాతం తగ్గిన టెల్కో ఫీజులు

దేశీయ టెలికాం మార్కెట్‌లోకి రిలయన్స్‌ జియో ఎంట్రీ తరువాత మొబైల్‌ ఫోన్‌ బిల్లుల భారం గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా గత ఆరు నెలల్లో సగటు నెలవారీ మొబైల్‌ బిల్లులు సగటున 30నుంచి 40శాతం మేర దిగి వచ్చినా ఇకపై అలా ఉండదట.. భవిష్యత్‌లో ఫోన్‌ బిల్లులు మరింత తగ్గే అవకాశాలు కన్పించడం లేదని కౌంటర్‌పాయింట్‌ టెక్నాలజీ మార్కెట్‌ రీసర్చ్‌ సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. జియో మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఎయిర్‌టెల్‌, ఐడియా సహా పలు టెలికాం సంస్థలు టారిఫ్‌లను తగ్గించాయి. దీని వల్ల టెలికాం సంస్థల ఆదాయానికి భారీగా గండిపడినట్లు తెలుస్తోంది.

టారిఫ్ తగ్గించకుండానే కస్టమర్ల పరిరక్షణకు టెల్కోల వ్యూహాలు

టారిఫ్ తగ్గించకుండానే కస్టమర్ల పరిరక్షణకు టెల్కోల వ్యూహాలు

2016 జూన్‌ నుంచి 2017 డిసెంబర్ మధ్య టెలికాం కంపెనీలు దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయని ఇటీవల నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఫోన్‌ బిల్లులు మరింత తగ్గే అవకాశాలు కన్పించడం లేదని కౌంటర్‌పాయింట్‌ టెక్నాలజీ మార్కెట్‌ రీసర్చ్‌ తెలిపింది. భవిష్యత్‌లో తమ టారిఫ్‌లను మరింతగా తగ్గించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు చేజారకుండా ఆయా సంస్థలు ఉన్న టారిఫ్‌లలోనే ఎక్కువ డేటా, మరిన్ని ఉచిత వసతులను వినియోగదారులకు అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Institute of chartered accountants of India (ICAI) clarified that aditors, ca's not responsible for PNB fraud. It is upto Banking monitoring system as well as RBI monitoring. Auditors, and CA's powers were limited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more