వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకరిద్దర్ని బలి పశువులు చేసే యత్నం: పీఎన్బీకి రేటింగ్స్‌కు ముప్పు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై/న్యూఢిల్లీ: బూటకపు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ)లతో రూ.11,400 కోట్ల మేరకు మోసగించి విదేశాలకు వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోయిన కేసులో కొందరిని బలి పశువులను చేసే ప్రయత్నం జరిగింది. ఈ విషయాన్ని బ్యాంక్ ప్రధాన కార్యాలయ అధికారులు సీబీఐ విచారణలో అంగీకరించారు. పీఎన్బీ ముంబైలోని బ్రాడ్ రోడ్ శాఖకు చెందిన రిటైర్డ్ అధికారి గోకుల్ నాథ్ శెట్టి, సింగిల్ విండో అధికారి మనోజ్ ఖారత్‌లదేనని ముద్ర వేసి తప్పించుకోవడానికి ప్రయత్నించామన్నారు. మరోవైపు పీఎన్బీకి అంతర్జాతీయ రేటింగ్స్ సమస్య ముప్పుగా పరిణమించింది.
ఈ బ్యాంకు రేటింగ్స్‌ తగ్గిస్తామని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలైన మూడీస్‌, ఫిచ్‌ హెచ్చరించాయి. ఏళ్ల తరబడి మోసం జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై రేటింగ్‌ సంస్థలు ప్రధానంగా దృష్టి సారించాయి. బ్యాంకు నెట్‌వర్త్‌ తగ్గుదల, పెరుగుతున్న నష్టాలను ఇందుకు కారణంగా చూపాయి. భారత బ్యాంకింగ్‌ చరిత్రలోనే దీన్ని అతిపెద్ద కుంభకోణమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. బ్యాంకులోని అధికారులు నేరానికి పాల్పడటం, నిఘా కొరవడటమే ఇందుకు ప్రధాన కారణాలు.

బ్యాంకు యాజమాన్యం తీసుకునే చర్యల ఆధారంగా మూడీస్ రేటింగ్

బ్యాంకు యాజమాన్యం తీసుకునే చర్యల ఆధారంగా మూడీస్ రేటింగ్

నీరవ్ మోదీ ‘ఎల్వోయూ' కుంభకోణం వ్యవహారంతో పీఎన్బీలో అంతర్గత, బహిరంగ రక్షణ వ్యవస్థలు, నాణ్యమైన యాజమాన్య నిఘాపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మోసపూరిత లావాదేవీల వల్ల తలెత్తే ఆర్థిక దుష్ప్రభావం, బ్యాంకు మూలధన మెరుగుదల కోసం యాజమాన్యం చేపట్టిన చర్యలు, పీఎన్బీపై నియంత్రణ సంస్థ తీసుకున్న చర్యల ఆధారంగా రేటింగ్‌ తగ్గిస్తామని మూడీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

బీబీ విభాగంలోకి మార్చేసిన ఫిచ్

బీబీ విభాగంలోకి మార్చేసిన ఫిచ్

పీఎన్బీ రేటింగ్‌ను అననుకూల (నెగెటివ్‌) విభాగంలోకి తగ్గించనున్నట్టు ‘ఫిచ్' తెలిపింది. ‘అతి పెద్ద కుంభకోణం బయటపడటంతో పీఎన్‌బీ రేటింగ్‌ను ఫిచ్‌ నెగెటివ్‌ అయిన ‘బీబీ' విభాగంలోకి మార్చింది' అని ఆ సంస్థ తెలిపింది. నీరవ్‌ మోదీ తరహాలోనే రొటమాక్‌ పెన్నుల తయారీ యాజమాని సైతం బ్యాంకులను మోసం చేసిన సంగతి తెలిసిందే.

పీఎన్బీ హెడ్డాఫీసులో అధికారులపై సీబీఐ ప్రశ్నల వర్షం

పీఎన్బీ హెడ్డాఫీసులో అధికారులపై సీబీఐ ప్రశ్నల వర్షం

పీఎన్బీ కుంభకోణంలో ఉన్నతస్థాయి అధికారుల పాత్రను నిగ్గుతేల్చే దిశగా సీబీఐ చురుగ్గా అడుగులు వేస్తోంది. ఢిల్లీలోని ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన సీబీఐ అధికారుల టీమ్‌లు మంగళవారం ఎగ్జక్యూటివ్ డైరెక్టర్‌తోపాటు 10 మంది బ్యాంకు అత్యున్నత అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అతని మామ మెహుల్‌ ఛోక్సీల బాగోతంపై అధికారుల నుంచి వివరాలను రాబట్టడానికి సీబీఐ ప్రయత్నించింది.

అనుభవజ్నుడైన అధికారి సారథ్యంలో ఈడీ విచారణ

అనుభవజ్నుడైన అధికారి సారథ్యంలో ఈడీ విచారణ

తమ కస్టడీలో ఉన్న బెచ్చు తివారీ, యశ్వంత్‌ జోషి, ప్రఫుల్‌ సావంత్‌లను విచారించినప్పుడు కొన్ని వివరాలు బయటపడ్డాయి. నీరవ్‌మోదీ సంస్థలకు చెందిన ఎనిమిది మంది, గీతాంజలి గ్రూపునకు చెందిన 10 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను సీబీఐ బలగాలు విచారించాయి. వేర్వేరు రాష్ట్రాలకు విస్తరించిన ఆర్థిక నేరాలను విచారించడంలో దిట్టగా పేరొందిన సంయుక్త సంచాలకుని స్థాయి అధికారి నేతృత్వంలో వీరి విచారణ కొనసాగింది.

విదేశాల్లో నీరవ్ మోదీ మరో ఆస్తి గుర్తింపు

విదేశాల్లో నీరవ్ మోదీ మరో ఆస్తి గుర్తింపు

ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీపై ‘నల్లధన వ్యతిరేక చట్టం' కింద దర్యాప్తు సంస్థలు తాజా అభియోగాలు మోపాయి. నార్మండీ తీరానికి సమీపంలోని జెర్సీలో ఒక ట్రస్టు రూపంలో అక్రమ ఆస్తిని కలిగి ఉన్నట్లు గుర్తించాయి. విదేశీ ఆస్తిని గుర్తించడం ఇది రెండోసారి. సింగపూర్‌లో ఒక బ్యాంకు ఖాతాను తొలుత గుర్తించారు. నీరవ్‌, అతని భార్య అమీ, నీరవ్‌మోదీ సంస్థల వివిధ స్థిరాస్తులపై ఇప్పటికే జప్తు నోటీసులు అంటించారు.

ఫ్రాన్స్ సదస్సు టూర్ రద్దు చేసుకున్న ఈడీ డైరెక్టర్ కర్నాల్ సింగ్

ఫ్రాన్స్ సదస్సు టూర్ రద్దు చేసుకున్న ఈడీ డైరెక్టర్ కర్నాల్ సింగ్

వరుసగా ఆరో రోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కొనసాగించాయి. నీరవ్‌, ఛోక్సీలకు చెందిన 13 కేంద్రాల్లో గాలించి మరో రూ.10 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఈడీ డైరెక్టర్‌ కర్నాల్‌ సింగ్‌ ఒక సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ వెళ్లాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

సీబీఐ అదుపులో గీతాంజలి, ఫైర్‌స్టార్ డైమండ్స్ అధికారులు

సీబీఐ అదుపులో గీతాంజలి, ఫైర్‌స్టార్ డైమండ్స్ అధికారులు

నీరవ్‌మోదీ ‘ఫైర్‌స్టార్‌ డైమండ్‌' కంపెనీ ప్రెసిడెంట్‌ (ఫైనాన్స్‌) విపుల్‌ అంబానీని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం అరెస్టు చేసింది. ఈ కేసులో తొలి పెద్ద తలకాయ అరెస్టు ఇదే. అంబానీతో పాటు అదే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ కవితా మన్‌కికర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అర్జున్‌ పాటిల్‌, నక్షత్ర గ్రూపు ముఖ్య ఆర్థికాధికారి కపిల్‌ ఖండేల్వాల్‌, గీతాంజలి గ్రూపు మేనేజర్‌ నితెన్‌ షాహిలను అరెస్టు చేశారు. మూడు కంపెనీల వ్యవహారాల్లో సంతకాలు చేసే అధికారం మన్‌కికర్‌కి ఉంది.

English summary
NEW DELHI: Punjab National Bank's (PNB) rating on Tuesday came under scanner of rating agencies Fitch and Moody's as an aftermath of the Rs 11,300 crore fraud reported in the bank's Brady House branch in Mumbai. The decision means that the country's second largest lender may see a rating downgrade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X