వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ కమిటీ చైర్మన్‌గా నందన్ నీలేకని

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్ రూపకర్త నందన్ నీలేకనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ పేమెంట్స్ ప్యానెల్‌కు చైర్మన్‌గా నియమించింది. ఆర్బీఐ మంగళవారం డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి హైలెవల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి నీలేకనిని చైర్మన్‌గా నియమించింది.

నందన్ నీలేకని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు. యూఐడీఏఐ మాజీ చైర్మన్ కూడా. ఇప్పుడు ఆయన ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. డిజిటల్ పేమెంట్స్ కమిటీలో కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, విద్యా సంస్థలు, బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఐదుగురు సభ్యులు ఉంటారని ఆర్బీఐ ప్రకటించింది.

RBI Appoints Aadhaar Architect Nandan Nilekani as Chairman of Panel on Digital Payments

వీరిలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్, సీఐఐఈ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సంజయ్ జైన్, విజయా బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిషోర్, కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మాజీ కార్యదర్శి అరుణ శర్మలు ఉంటారు.

దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, చెల్లింపుల భద్రత, డిజిటల్ లావాదేవీలపై కస్టమర్లలో విశ్వాసాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించిన కమిటీ సలహాలు, సూచనలు చేస్తుంది. కమిటీ మొదటిసారి సమావేశమైన దగ్గరి నుంచి మూడు నెలల్లో ఆర్బీఐకి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

English summary
Infosys co founder Nandan Nilekani who will head the digital payments panel, has served as chairman of the Unique Identification Authority of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X