• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్యాంకులకు ఆర్బీఐ హుకుం: ఏప్రిల్‌లోగా స్విఫ్ట్‌తో సీబీఎస్‌ లింక్ చేయాల్సిందే!

By Swetha Basvababu
|

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (;wఎన్బీ)లో భారీ కుంభకోణం నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) అప్రమత్తమైంది. అన్ని బ్యాంకులు కూడా తమ కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ (సీబీఎస్)ను సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలీకమ్యూనికేషన్స్‌ (స్విఫ్ట్‌)తో అనుసంధానించాలని ఆదేశించింది. ఏప్రిల్ 30 లోగా అనుసంధానించాలని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (బిఈ) చైర్‌పర్సన్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండి, సీఈఓ ఉషా అనంతసుబ్రమణియన్‌ ధ్రువీకరించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో వేగవంతంగా స్విఫ్ట్ ‌- సీబీఎస్‌ లింకేజ్‌ చేయడం అత్యవసరమని అలహాబాద్ బ్యాంక్ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్ చెప్పారు. తమ బ్యాంక్‌ కూడా స్విఫ్ట్‌, సీబీఎస్‌ను అనుసంధానం చేయలేదని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తమ బ్యాంకు శాఖలను సూచనలు చేసినట్టు ఆమె చెప్పారు. లోపాలను సరిదిద్దుకునేందుకు అన్ని బ్యాంకులు తమ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను పునః పరిశీలన చేయాలని ఆమె అన్నారు.

స్విఫ్ట్ మెసేజ్‌లు లింక్ చేయనందువల్లేనని వెల్లడి

స్విఫ్ట్ మెసేజ్‌లు లింక్ చేయనందువల్లేనని వెల్లడి

రూ.11,400 కోట్ల మేరకు పీఎన్బీలో జరిగిన మోసం 2011 ప్రారంభం నుంచి మొదలైనా గుర్తించలేకపోయామని టాప్ మేనేజ్మెంట్ చెబుతోంది. విదేశీ బ్యాంకులతో స్విఫ్ట్ మెసేజ్‌లు నడుపుతున్న విషయాన్ని బ్యాంక్ ఖాతా పుస్తకాల్లో చేర్చలేదని తెలిపింది. బ్రస్సెల్ కేంద్రంగా సీబీఎస్ సేవలందిస్తున్న స్విఫ్ట్ సంస్థ కూడా తమ ఖాతాదారుల గురించి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొన్నది. పీఎన్బీతోపాటు పలు భారతీయ బ్యాంకులు స్విఫ్ట్ నెట్ వర్క్ తో అనుసంధానించుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ ప్రభుత్వ బ్యాంకులన్నీ స్విఫ్ట్ వ్యవస్థను తక్షణం అనుసంధానించాలని, ప్రతి బ్యాంకు పరిమితులు విధించుకోవాలని ఆర్బీఐ తేల్చి చెబుతూ వారం క్రితం లేఖ రాసింది. స్విఫ్ట్ వ్యవస్థ ద్వారా చెల్లింపుల్లో ఖచ్చితంగా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నదన్నారు.

ఎగవేతదారులు దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

ఎగవేతదారులు దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

బ్యాంకుల రుణ కుంభకోణాలపై పరస్పరం నిందలు వేసుకునేకంటే రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యత తీసుకోవాలని ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ కాన్ఫడరేషన్ ప్రధాన కార్యదర్శి డీటీ ఫ్రాన్కో డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను తొలిగించి ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు. బ్యాంకుల రుణాలను చెల్లించకుండా జాప్యం చేసే డిఫాల్టర్ల జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణాలను ఎగవేసే డిఫాల్టర్‌లు దేశం విడిచి వెళ్లకుండా బ్యాంకులు.. హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసి వారికి ఎమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్కామ్‌లలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి వారిని బలిపశువు చేయడమేమిటని, అలాగే ఒకేసారి 18 వేల మందిని బదిలీ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు.

వజ్ర వ్యాపారుల రుణాల ఎగవేతపై ఎఫ్‌బీఐఎస్‌యూ ఇలా

వజ్ర వ్యాపారుల రుణాల ఎగవేతపై ఎఫ్‌బీఐఎస్‌యూ ఇలా

ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్డ బిజినెస్ లావాదేవీల పేరిట రుణాలు తీసుకుని ఉద్దేశ్యపూర్వకంగా వాటి పుట్టి ముంచుతున్న వారిలో వజ్రాల వ్యాపారులు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఎన్బీ అత్యధికంగా మోసపోయింది. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఎస్బీఐ'తో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ నష్టమని గణాంకాలు చెబుతున్నాయి. ఇటువంటి 90 మంది ఎగవేతదారులతో గత ఏడాది మార్చి చివరి నాటికే బ్యాంకులకు దాదాపు రూ.5000 కోట్ల నష్టం వాటిల్లిందన్న గణాంకాలు రుజువు చేస్తున్నాయి. బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టిన జెమ్స్ అండ్ డైమండ్ కంపెనీల వివరాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాల సమాఖ్య (ఎఫ్‌బీఐఎస్‌యూ) వెల్లడించింది. ఈ ఎగవేతదారుల వల్ల ఎక్కువగా నష్టపోయిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అగ్రస్థానంలో ఉన్నది. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకుల్లో రెండవదిగా ఉన్న పీఎన్బీకి కేవలం తొమ్మిది మంది ఎగవేతదారుల వల్లనే రూ.1,790 కోట్ల నష్టం వాటిల్లింది.

చిన్న రుణాల చెల్లింపులోనూ వజ్ర వ్యాపారుల నిర్లక్ష్యం

చిన్న రుణాల చెల్లింపులోనూ వజ్ర వ్యాపారుల నిర్లక్ష్యం

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఎస్బీఐకి ఇటువంటి 15 మంది ఎగవేతదారుల వలన కలిగిన నష్టం (రూ.410 కోట్లు)తో పోలిస్తే పీఎన్‌బీకి వాటిల్లిన నష్టం నాలుగు రెట్లు ఎక్కువ. దేశంలో ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారుల మొత్తం సంఖ్య 5000 కంటే కొంచెం ఎక్కువగా ఉందని, వీరి వలన బ్యాంకులకు దాదాపు రూ.49 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఎఫ్‌బీఐఎస్‌యూ చెబుతున్నది. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల సంఖ్య 8,915 మందికి, వారి వల్ల బ్యాంకులకు జరిగిన నష్టం రూ.92,376 కోట్లకు పెరిగినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది మార్చి నెలాఖరు నాటికి 1,120 మంది ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులతో పీఎన్‌బీ అగ్రస్థానంలో నిలువగా, 997 మంది ఎగవేతదారులతో ఎస్బీఐ ద్వితీయ స్థానంలో నిలిచింది. రత్నాలు, ఆభరణాల వ్యాపారులు పెద్ద రుణాలతో పాటు చిన్న చిన్న రుణాలను సైతం తిరిగి చెల్లించకుండా బ్యాంకులను ముంచుతున్నారు.

బకాయిల వసూళ్లకు బ్యాంకులు ఇలా

బకాయిల వసూళ్లకు బ్యాంకులు ఇలా

విన్సమ్, బ్యూటిఫుల్ డైమండ్స్, ఆరో గోల్డ్ జువెల్లరీ లాంటి సంస్థలు ఇప్పటికే ఎన్నో బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టాయి. ఇటువంటి కొన్ని కేసుల్లో బకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకులు చర్యలు చేపడుతుండగా, మరికొన్ని కేసుల్లో దర్యాప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంకులను దోచుకునేందుకు ఎన్నో మార్గాలను అనుసరిస్తున్న వ్యాపారులు ప్రధానంగా తమ కంపెనీల పేర్లను తరచుగా మార్చి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతున్నది. గతంలో స్ప్లెండర్ జెమ్స్ పేరుతో ఏర్పాటైన సంస్థ ఆ తర్వాత బ్యూటిఫుల్ డైమండ్స్‌గా పేరు మార్చుకోవడం ద్వారానూ, ఔరో గోల్డ్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆ తర్వాత తన పేరులో ప్రైవేట్ అనే పదాన్ని తొలగించడం ద్వారానూ, ఘనశ్యామ్‌దాస్ జెమ్స్ అండ్ జువెల్స్ సంస్థ ఆ తర్వాత ఘన్‌శ్యామ్‌దాస్‌గా మార్చడం ద్వారా పలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టినట్లు ఎఫ్‌బీఐఎస్‌యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India’s central bank has asked commercial lenders to link their core software with the SWIFT interbank messaging system by the end of April, bankers said, in the latest regulatory action after a $1.8 billion fraud at Punjab National Bank (PNB). PNB says the fraud began as early as 2011 and remained undetected as the staff did not enter the transactions into its core software after sending instructions to overseas banks using SWIFT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more