వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్ దెబ్బ: 15 నెలల్లోనే 16 కోట్ల సబ్ స్రైబర్లకు చేరుకొన్న జియో

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికం మార్కెట్లో జియో అనతికాలంలోనే 16 కోట్ల కస్టమర్లకు చేరుకొంది. మార్కెట్లోకి రావడంతోనే సంచలనాలకు జియో కేంద్రంగా మారింది. కొత్త కొత్త ఆఫర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న రిలయన్స్ జియో పెద్ద ఎత్తున కొత్త కస్టమర్లను తన వైపుకు తిప్పుకొంటుంది.

ఉచిత డేటా ఆఫర్, ఉచిత వాయిస్ కాల్స్‌తో రిలయన్స్ జియో మార్కెట్లోకి సంచలనాలతో ముందుకు వచ్చింది. రిలయన్స్ జియో కారణంగా ప్రత్యర్థి టెలికం కంపెనీలు కూడ అనివార్యంగా ప్లాన్లను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

తక్కువ ధరకే ఫీచర్ పోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలో స్మార్ట్‌పోన్‌ను కూడ ప్రవేశపెట్టనున్నట్టు జియో ప్రకటించింది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ ఇతర టెలికం కంపెనీలకు సవాళ్ళు విసురుతోంది.

16 కోట్లకు చేరుకొన్న రిలయన్స్ జియో కస్టమర్లు

16 కోట్లకు చేరుకొన్న రిలయన్స్ జియో కస్టమర్లు

రిలయన్స్ జియో టెలికం మార్కెట్లో సంచలనాలను సృష్టిస్తోంది. కొత్త సబ్ స్రైబర్లను పెంచుకొంటుంది. జియో మార్కెట్లోకి వచ్చిన సుమారు 15 మాసాలు అవుతోంది.ఈ 15 మాసాల్లో జియో కస్టమర్ల సంఖ్య 16 కోట్లకు చేరుకొంది. ఇతర టెలికం కంపెనీలకు గట్టి పోటీని ఇస్తోంది.

రిలయన్స్ వేడుకలో ప్రకటించిన ఆకాష్

రిలయన్స్ వేడుకలో ప్రకటించిన ఆకాష్

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన రిలయన్స్‌ ఫ్యామిలీ డే వేడుకల్లో ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు.

సంచలనాలతో మార్కెట్లోకి ప్రవేశం

సంచలనాలతో మార్కెట్లోకి ప్రవేశం

జియో సంచలనాలతో మార్కెట్లోకి ప్రవేశించింది. ఉచిత ఆఫర్లను వినియోగదారులకు రుచి చూపించింది. డేటాను కూడ ఆరు మాసాల పాటు ఉచితంగా ఇచ్చింది ఆ తర్వాత టారిఫ్ రేట్లను విడుదల చేసింది. ఈ ఆఫర్ల కారణంగా టెలికం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ అనివార్యంగా టారిఫ్ రేట్లను మార్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

5జీ టెక్నాలజీలో పెట్టుబడులు

5జీ టెక్నాలజీలో పెట్టుబడులు

5జీ టెక్నాలజీ ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని రిలయన్స్ జియోలో కీలకంగా వ్యవహరించే బ్రిజేష్ దత్తా అభిప్రాయపడ్డారు.కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.

English summary
The customer base of Reliance Jio has touched 160 million, a little more than a year after the newcomer stormed into the telecom market with aggressive voice and data offerings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X