వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నడూలేని విధంగా రూ. 71కి చేరిన రూపాయి మారకం: కారణాలివే

|
Google Oneindia TeluguNews

ముంబై: రూపాయి మారకం విలువ గతంలో ఎన్నడూ లేనివిధంగా క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి తొలిసారిగా రూ.71కి చేరింది. అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది.

రూపాయి గురువారం సెషన్‌లో రూ.70.74 వద్ద ముగిసింది. శుక్రవారం ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభంలో రూ.70.95పైసల వద్ద ప్రారంభమైంది. తర్వాత మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవన కాల క్షీణత నమోదు చేసింది.

Rupee Collapses To New Record Low: Key Things To Know

చమురు దిగుమతిదారుల నుంచి డాలరుకు గిరాకీ పెరగడం, చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడం రూపాయి క్షీణతకు దారితీస్తోంది.

కాగా, చైనా-అమెరికాల మధ్య వాణిజ్య భయాలు కూడా దేశీయ కరెన్సీలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.94 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ మార్కెట్లను ఒడిదుడులకు గురిచేసే అవకాశం ఉంది.

English summary
The Indian rupee collapsed to a fresh record low of 71 against the US dollar for the first time ever by slipping 26 paise today, reported news agency PTI (Press Trust of India). The fall in Indian currency is due to the persistent demand for the US currency amid rising crude prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X