వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్రలో తొలిసారి భారీ పతనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.08! ‘లిరా’ ఎఫెక్టే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూపాయి మరింత పతనం దిశగా కొనసాగుతోంది. మంగళవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో పడిపోయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ చరిత్రలో తొలిసారి రూ.70కి చేరిపోయింది.

టర్కీలో ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కిష్‌ లిరా భారీగా పతనమవుతుండడంతో ఆ ప్రభావం మన కరెన్సీపైనా పడుతోంది. సోమవారం రూపాయి మారకం విలువ ఏకంగా 110 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే.

Rupee crashes to all-time low of 70.08 against US dollar

మంగళవారం మరింతగా పడిపోయి రూ.70.08 పైసల వద్ద జీవన కాల కనిష్ఠానికి చేరింది. సోమవారం రూపాయి మారకపు విలువ రూ.69.93 పైసల వద్ద ముగిసింది.
తాజా పతనంతో 2018లో రూపాయి విలువ పది శాతం తగ్గిపోయినట్లయింది.

అమెరికా కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్‌ బాగా పెరగడంతో రూపాయి బలహీనపడుతోందని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఉదయం 11.15 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల లాభంతో 37777.96 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11402.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో ట్రేడర్లు కలవరపడుతున్నారు.

English summary
The rupee hit the 70-per dollar mark for the first time, tumbling to a record low, as a Turkey-led rout in emerging-market currencies intensified losses. The rupee slipped as much as 0.2 percent to 70.08 per dollar in Mumbai and is down almost 9 percent this year in Asia’s worst performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X