వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు స్థాయిలో రూపాయి పతనం: డాలర్‌తో మారకం 70.32, లిరా ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

ముంబై: అంతర్జాతీయ పరిణామాల ప్రభావాల కారణంగా రూపాయి రోజు రోజుకూ మరింతగా క్షీణించి కలవరపెడుతోంది. ఇప్పటికే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.70 దాటిపోగా గురువారం ట్రేడింగ్‌లో తాజా జీవన కాల కనిష్ఠానికి పడిపోయింది.

గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.32కు చేరింది. టర్కీలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కీష్‌ లిరా భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావం మన రూపాయిపై కూడా పడుతోంది.

Rupee hits a fresh record low of 70.32 a dollar amid Turkey crisis

ఇంటర్‌బ్యాంక్‌ ఫారెన్‌ ఎక్స్ఛేంజిలో గురువారం రూపాయి డాలరుతో పోలిస్తే రూ.70.25 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించింది. గత సెషన్‌లో రూ.69.89 వద్ద ముగియగా.. గురువారం ఇంకా 43పైసలు బలహీన పడి రూ.70.32కు చేరింది.

దిగుమతి దారుల నుంచి అమెరికన్‌ కరెన్సీ డాలరుకు డిమాండ్‌ బాగా పెరిగిందని ఫారెక్స్‌ ట్రేడర్లు చెప్తున్నారు. వాణిజ్య లోటు ఐదేళ్లలో గరిష్ఠంగా 18బిలియన్‌ డాలర్లకు చేరిందని మంగళవారం వాణిజ్య మంత్రి వెల్లడించడంతో ఆ ప్రభావం కూడా రూపాయి పడుతోంది. మంగళవారం రూపాయి ఓ దశలో రూ.70.08కి పతనమైంది.

English summary
On Thursday, rupee opened at record low 70.19 against the US dollar and further slipped to 70.26. It hit 70 to the dollar for the first time on Tuesday, falling 15 paise intraday due to sharp depreciation in Turkish lira. The rupee has fallen more than 9 percent year-to-date and around 2 percent in August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X